• తాజా వార్తలు
  •  

జియో సొంత ఫోన్ ఆపేసి ఆండ్రాయిడ్ ఫోన్ పై ఫోకస్ పెట్టడం వెనుక మర్మం ఏమిటి ?

రూ.1500 ధ‌ర‌కే ఫీచ‌ర్ ఫోన్ ఇస్తామంటే పెద్ద సంచ‌ల‌మే సృష్టించింది జియో. వాయిస్ అసిస్టెంట్‌, నెట్ స‌ర్వీసులు, ఇలా ర‌క ర‌కాల ఫీచ‌ర్ల‌తో అంద‌ర్నిలో అమితాస‌క్తిని రేపింది. అయితే ఆ ఆస‌క్తి నెమ్మ‌దిగా త‌గ్గిపోయింది. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ముందుగా అనుకున్నంత‌గా ఈ ఫోన్ లేక‌పోవ‌డం, పైగా అదే ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో ఫోన్లు అందుబాటులోకి రావ‌డంతో జియో ప‌ట్ల విముఖ‌త పెరిగింది. అన్నిటికి మించి జియో ప్ర‌ధాన పోటీదారైన భార‌తి ఎయిర్‌టెల్ రూ.3 వేల లోపే మంచి ఫీచ‌ర్ల‌తో ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో జ‌నాలు అటువైపు మ‌ళ్లారు. ఈ నేప‌థ్యంలో జియో త‌న ఫీచ‌ర్ ఫోన్ త‌యారీని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఏంటీ జియో వ్యూహం
కోట్లాది మంది స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్న జియో..వారిని త‌న గుప్పిట్లో ఉంచుకోవాల‌నే వ్యూహంలో ఉంది. దాదాపు 6 మిలియ‌న్ల మంది భార‌తీయులు జియో వైపు చూస్తున్నారు. అయితే ఇటీవ‌లే మార్కెట్లోకి వ‌చ్చిన ఈ ఫీచ‌ర్ ఫోన్ అనుకున్నంత రెస్పాన్స్‌కు నోచుకోలేక‌పోయింది. ఇప్ప‌టికే రూ.500 చెల్లించి ఈ ఫోన్‌ను ప్రి బుక్ చేసుకున్న వాళ్లు కూడా ఈ ఫోన్ తీసుకోవాలా లేదా అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీనికి ఒక‌టి కాదు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ ఫీచ‌ర్ ఫోనే కార‌ణ‌మా!
ఎయిర్‌టెల్ 4జీ ఫోన్ రంగంలో దిగ‌డంతో జియో ముఖ చిత్రం మారిపోయింది. జియోకు మించి ఎన్నో ఆప్ష‌న్లు దీనిలో ఉండ‌డంతో జ‌నాలు ఎయిర్‌టెల్ 4జీ ఫోన్ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. ముఖ్యంగా  వినియోగ‌దారుల‌కు అవ‌స‌ర‌మైన వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ లాంటి ఫీచ‌ర్లు జియోలో లేక‌పోవ‌డం అతి పెద్ద మైనస్‌. ఎంత ఫీచ‌ర్ ఫోన్ అయినా నెట్  అందుబాటులో ఉన్న ఫోన్‌లో వాట్స‌ప్, ఫేస్‌బుక్ లేక‌పోవ‌డం జ‌నాల‌కు న‌చ్చేలేదు. దీనికి తోడు ధ‌ర కాస్త ఎక్కువ అయినా ఎయిర్‌టెల్ ఈ సోష‌ల్ మీడియా సైట్ల‌ను అందిస్తుండ‌డంతో ఎయిర్‌టెల్ 4జీపై ఆస‌క్తి పెరిగింది

మ‌రో కొత్త తేదీ..
ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల ఫోన్ల‌ను త‌యారు చేసిన జియో.. ఇక‌పై ఉత్ప‌త్తులు ఆపేయాల‌ని నిర్ణ‌యించింది. వాట్స‌ప్‌, ఎఫ్‌బీ స‌పోర్ట్ చేసేలా ఫీచ‌ర్ ఫోన్‌ను త‌యారు చేసి మళ్లీ మార్కెట్లోకి రావాల‌నేది ఆ సంస్థ ఆలోచ‌న‌. ఎయిర్‌టెల్ కార‌ణంగా  జియో వెన‌క‌డుగు వేసిన తొలి సంద‌ర్భం ఇదే. కానీ ఈ ప‌రిస్థితి కూడా నిర్భ‌యంగా ఎదుర్కోవాల‌ని.. లేటుగా అయినా లేటెస్ట్‌గా ముందుకు రావాల‌ని జియో అనుకుంటోంది.                                     

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు