• తాజా వార్తలు
  •  

 ఆధార్‌, మొబైల్ లింకేజి ఐవీఆర్ ద్వారా చేసుకోవ‌డం ఎలా?

మొబైల్  నెంబ‌ర్‌కు ఆధార్‌తో లింక్ తప్ప‌నిస‌రిచేసింది ప్ర‌భుత్వం. దీనికి మ‌రో రెండు నెల‌లు మాత్ర‌మే గ‌డువుంది.  అయితే ఈ ప్రాసెస్‌ను ఈజీ చేసేందుకు ఐవీఆర్ బేస్డ్ వెరిఫికేష‌న్ సిస్ట‌మ్‌ను తీసుకొచ్చింది. ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ వాడుతున్న‌వారయినా ఈ సౌక‌ర్యాన్ని వాడుకోవ‌చ్చు. మొబైల్ కంపెనీల అవుట్‌లెట్ల ద‌గ్గ‌ర‌కు వెళితేగానీ మొబైల్ ఆధార్ లింకేజి చేసుకోలేక ఇబ్బంది ప‌డుతున్న వారంద‌రికీ ఇది శుభ‌వార్తే.
ఎలా లింక్ చేసుకోవాలి?
మీ ఆధార్ కార్డ్‌ను ద‌గ్గ‌ర పెట్టుకోండి. ఇప్పుడు మీరు లింక్ చేయాల‌నుకున్న మొబైల్ నెంబ‌ర్ నుంచి14546 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేయండి. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌.. ఇలా దేశంలో ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ వాడుతున్న వినియోగ‌దారుల‌యినా ఈ నెంబ‌ర్‌ను యూజ్ చేసుకోవ‌చ్చు.
1.)14546 నెంబ‌ర్‌కు కాల్‌చేశాక ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్‌)సిస్టం మిమ్మ‌ల్ని ఆప్ష‌న్స్ అడుగుతుంది. 
2.)ఇండియ‌నా, ఎన్నారైనాసెలెక్ట్ చేసుకోవాలి.
3) ఆ త‌ర్వాత మీ ఫోన్ నెంబ‌ర్‌కు ఆధార్ లింక్‌చేసుకోవ‌డానికి అనుమ‌తిస్తూ 1 నెంబ‌ర్‌ను నొక్కాలి.
4) ఇప్పుడు మీ ఆధార్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్‌చేసి క‌న్ఫ‌ర్మ్‌చేయ‌డానికి 1 నొక్కాలి.
5) పై స్టెప్ పూర్త‌వ‌గానే మీకు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ పంప‌డానికి మీ మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. 
6) మీ టెలికం ఆప‌రేట‌ర్ UIDAI డేటాబేస్ నుంచి మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, వివ‌రాలు, ఫొటో, డేట్ ఆఫ్ బ‌ర్త్ వంటివి తీసుకోవడానికి అనుమ‌తివ్వాలి. 
7) ఇప్పుడు ఐవీఆర్ సిస్టం క‌న్ఫ‌ర్మేష‌న్ కోసం మీ మొబైల్ నెంబ‌ర్‌లోని లాస్ట్  4 డిజిట్స్‌ను అడుగుతుంది.అవి ఎంట‌ర్‌చేయ‌గానే మీకు ఓటీపీ  మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ వ‌స్తుంది.
8) ఓటీపీ ఎంట‌ర్ చేసి 1 నొక్కాలి. దీంతో మీ ఆధార్ మొబైల్ నెంబ‌ర్ రీ వెరిఫికేష‌న్ పూర్తవుతుంది.
9) మీకు ఇంకో మొబైల్ నెంబ‌ర్ కూడా ఉంటే 2 నొక్కి ఐవీఆర్  సిస్టం సూచ‌న‌లు పాటిస్తూ రెండో నెంబ‌ర్‌ను కూడా లింక్‌చేసుకోవ‌చ్చు.
కార్పొరేట్ ప్లాన్స్‌లో ఉండే క‌స్ట‌మ‌ర్లు ఆధార్ రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు