• తాజా వార్తలు

ఆధార్‌ను మొబైల్ నెంబ‌ర్‌కు లింక్ చేయ‌డానికి జ‌నాలు ఎందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదో తెలుసా?

భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా  మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల‌ని  సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రెండు నెల‌ల క్రితం ప్ర‌జ‌లంద‌ర్నీ కోరింది. అయితే చాలా మంది ప్ర‌జలు దీన్ని సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు.  ఎన్ని మెసేజ్‌లు పంపిస్తున్నా, కాల్స్ చేస్తున్నా దీనిపై మొబైల్ యూజ‌ర్ల నుంచి పెద్ద‌గా స్పంద‌న ఉండ‌డం లేద‌ని టెలికం నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్స్ చెబుతున్నారు. రోజుకు మ్యాక్సిమం అంటే 40 మంది వ‌చ్చి మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక‌ప్ చేసుకుంటున్నార‌ని హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌ముఖ టెలికం నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్ క‌స్ట‌మ‌ర్ కేర్ యూనిట్లో ప‌ని చేసే అర‌వింద్ చెప్పారు. త‌మ‌కున్న క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌తో కంపేర్ చేస్తే ఇది చాలాచాలా త‌క్కువ‌ని చెప్పారు.   ఆధార్‌, మొబైల్ నెంబ‌ర్ లింకేజ్ అనేది ఐదు నిముషాలు కూడా పట్ట‌దు. అయినా ప్ర‌జ‌లు ఎవ‌రూ దీని గురించి ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌న్నారు.

* చాలా మందికి  ముఖ్యంగా రూర‌ల్ బ్యాక్‌గ్రౌండ్‌లోని మొబైల్ యూజ‌ర్ల‌కు ఈ ఆధార్‌, మొబైల్ నెంబ‌ర్ లింకేజి ఎక్క‌డ చేయించుకోవాలో, ఎలా చేయించుకోవాలో పెద్ద‌గా తెలియ‌దు.

* మ‌రికొంత మంది  ఈ ప్ర‌క్రియ రిటెయిల‌ర్ల ద‌గ్గ‌ర చేయించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించి ముంద‌కు రావ‌డం లేదు. 

ఇలా లింకేజ్ చేయించుకుంటే స్పామ్ కాల్స్‌, మెసేజ్‌ల బెడ‌ద ఎక్కువవుతుందని కొంద‌రు కంప్ల‌యింట్ చేస్తున్నారు.

* వారం క్రితం తాను హైద‌రాబాద్ పంజాగుట్ట‌లోని  అవుట్‌లెట్‌లో ఆధార్‌ను మొబైల్ నెంబ‌ర్ తో అప్‌డేట్ చేయించుకున్నాన‌ని, అయినా త‌న‌కు అప్‌డేట్ చేయించుకోవాల‌ని కాల్స్ వ‌స్తూనే ఉన్నాయ‌ని.. అస‌లు ఈ ప్రాసెస్ ఎప్ప‌టికి పూర్త‌వుతుందని రావ్ అనే బిజినెస్‌మేన్ ప్ర‌శ్నించారు.  ఇలాంటి క‌న్ఫ్యూజ‌న్లు, భ‌యాలతో చాలా మంది  మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ తో అప్‌డేట్ చేయంచుకోవ‌డానికి ముందుకు రావ‌డం లేదు.

కొంత‌మందికి వ్యాపారం

చాలాచోట్ల ఆధార్‌తో మొబైల్ నెంబ‌ర్ అప్‌డేష‌న్ అనేది మొబైల్ షాప్ ఓన‌ర్ల‌కు ఎక్స్‌ట్రా ఇన్‌క‌మ్‌గా మారింది. దీనికి పైసా ఖ‌ర్చు కాకున్నా 20 నుంచి 40 రూపాయ‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తూ కొంత మంది రోజుకు రెండు, మూడు వేలు యూజ‌ర్ల నుంచి లాగేస్తున్నారు.  లింక్ చేసుకోవ‌డానికి వెళితే ఇలా డ‌బ్బులు గుంజుతున్నారు ఎందుకులే అని మ‌రికొంత‌మంది మానేస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు