• తాజా వార్తలు
  •  

BSNL కొత్త టారిఫ్ లన్నీ ఒకచోట మీకోసం

ప్రభుత్వ ఆధ్వర్యం లో నడిచే టెలికాం ఆపరేటర్ అయిన BSNL దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్రీ పెయిడ్ కస్టమర్ ల కోసం హ్యాపీ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇది 43 % అదనపు వ్యాలిడిటీ ని లేదా 50% అదనపు డేటా ను అన్  లిమిటెడ్ కాల్స్ తో సహా ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ లకు అందిస్తుంది. ఇప్పటికే ఉన్న ప్లాన్ లతో పాటుగా BSNL రూ 485/- మరియు రూ 666/- ల ప్లాన్ లను కూడా ప్రవేశపెట్టింది.రూ 485/- ల ప్లాన్ లో రోజుకి 1.5 జిబి డాటా 90 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తుంది.రూ 666/- ప్లాన్ లో 1.5 జిబి డేటా 129 రోజుల పాటు లభిస్తుంది. ఈ ఆఫర్ లలో కేవలం డేటా మాత్రమే గాక అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, STD, రోమింగ్, రోజుకి 100 SMS లు కూడా లభిస్తాయి. ఇవి మాత్రమే గాక ఈ హ్యాపీ ఆఫర్ లో భాగంగా రూ 186/-,  రూ 187/-, రూ  349/-, రూ  429/-, రూ  485/-, రూ  666/- ల ప్లాన్ లను కూడా BSNL ప్రవేశపెట్టింది.

రూ 186/- ల ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీ లో రోజుకి 1 జిబి డేటా లభిస్తుండగా రూ 429/- ల ప్లాన్ లో దీని వ్యాలిడిటీ 81 రోజులుగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు రూ 485/- మరియు రూ 666/- ల ప్లాన్ లు రోజుకి 1.5 జిబి డేటా ను 90 మరియు 129 రోజుల పాటు ఇస్తాయి. అంతేగాక స్పెషల్ రీఛార్జి వోచర్ లైన రూ 187/- మరియు రూ 349/- లతో కూడా రీఛార్జి చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లలో కూడా రోజుకి 1 జిబి డేటా లభిస్తుంది. వీటి వ్యాలిడిటీ 28 రోజులు మరియు 54 రోజులుగా ఉంటుంది. వీటిలో కూడా  వినియోగదారులు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMS, ఉచిత STD మరియు రోమింగ్ ను పొందుతారు.

కస్టమర్ ల శ్రేయస్సే పరమావధిగా BSNL పనిచేస్తుందనీ , ఈ నూతన సంవత్సరం సందర్భంగా తమ కస్టమర్ లను మరింత ఆనంద పరచేందుకు హ్యాపీ ఆఫర్ ను ప్రకటించామనీ BSNL బోర్డు డైరెక్టర్ అయిన RK మిట్టల్ తెలిపారు.

జన రంజకమైన వార్తలు