• తాజా వార్తలు

నోకియా 8 వ‌ర్సెస్ వ‌న్‌ప్ల‌స్ 5 వ‌ర్సెస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8.. వీటిలో ఏది బెస్ట్‌?

ఇప్పుడు కాంపిటేష‌న్ మాములుగా లేదు. ఒక‌వైపు పండ‌గ సీజ‌న్‌.. మ‌రోవైపు హోరాహోరీ పోటీ.. ఎలాగైనా క‌స్ట‌మ‌ర్ల మ‌న‌సు గెలుచుకోవాల‌ని మూడు పెద్ద బ్రాండ్లు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్నాయి. అవే నోకియా, శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌. శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్ ఇప్ప‌టికే స్మార్ట్‌ఫోన్ల త‌యారీలో దూసుకుపోతుండ‌గా.. వీటికి పోటీగా దిగ్గ‌జ నోకియా కూడా వ‌చ్చేసింది. గ‌తంలో విండోస్ ఫోన్ల‌ను త‌యారీ చేసి దెబ్బ తిన్న నోకియా.. ఇప్పుడు అన్ని హంగుల‌తో నోకియా 8ను మార్కెట్లోకి తెచ్చింది. మ‌రి నోకియా 8, వ‌న్‌ప్ల‌స్ 5, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 మోడ‌ల్స్‌లో ఏది ఉత్త‌మ‌మైంది? ఏ మోడ‌ల్ వినియోగ‌దారుల మ‌న‌సు గెలుచుకుంటుంది?


అక్టోబ‌ర్‌లో పోటాపోటీ!
క‌స్ట‌మ‌ర్లంతా ఇప్పుడు వెయిట్ చేస్తుంది అక్టోబ‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అనే! ఎందుకంటే నోకియా 8 భార‌త్‌లోకి రాబోతోంది ఆ నెల‌లోనే. నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుంది? ఎలా ఫీచ‌ర్లు ఉంటాయి.. ఎలా ప‌ని చేస్తుందో తెలుసుకోవాల‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నోకియా 8లో చాలా ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా విష‌యంలో ఈ ఫోన్ మిగిలిన ఫోన్ల క‌న్నా భిన్నం. ఫ్రంట్ కెమెరాతో పాటు సెంట‌ర్ కెమెరా ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. యూజ‌ర్లు ఫొటోలు, వీడియోల‌ను ఫ్రంట్‌, రేర్ కెమెరాల‌తో ఒకేసారి తీసుకునే అవ‌కాశం ఉంది. శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌ల‌లో ఈ ఫీచ‌ర్ లేదు.  అంతేకాదు దీనిలో వాడిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్ కూడా మిగిలిన వాటి క‌న్నా నోకియాను ముందంజ‌లో నిలుపుతుంది.

ధ‌రలోనూ ముందంజే
నోకియా హైఎండ్ ఫోన్ ధర‌లోనూ మిగితా ఫోన్ల‌తో పోటీప‌డుతోంది. ప్ర‌స్తతం 8 ర‌కాల స్మార్ట్‌ఫోన్ల‌ను బ‌రిలో దించుతున్న ఈ సంస్థ‌.. వాటి ధ‌ర‌ల‌ను రూ.45 వేల వ‌ర‌కు నిర్ణ‌యించింది. మ‌రోవైపు వన్‌ప్ల‌స్ 5 ధ‌ర 32,999గా ఉంటే, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ధ‌ర రూ.57,900గా ఉంది. వ‌న్‌ప్ల‌స్‌లో 128 జీబీ వారియంట్ పీస్ ధ‌ర రూ.37,999 మాత్ర‌మే. అయితే యూఎస్‌, యూరోపియ‌న్ మార్కెట్ల‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించిన‌ట్లు భార‌త్‌లో ఈ ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

కెమెరా సూప‌ర్‌ 
డివైజ్ వైజ్‌గా అయితే వ‌న్‌ప్ల‌స్ 5, నోకియా 8లు డ్యుయ‌ల్ కెమెరాతో సెట‌ప్‌తో త‌యారు చేశారు.  అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8లో మాత్రం ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ ఉంది. నోకియాలో 5.3 అంగుళాల డిస్‌ప్లే ఉంది. నోకియా, శాంసంగ్ రెండూ 4 జీబీ ర్యామ్‌తో త‌యారైతే.. వ‌న్ ప్ల‌స్ 5 మాత్రం 6 జీబీ ర్యామ్‌తో త‌యారైంది.  వ‌న్‌ప్ల‌స్‌లో 5 ఫోన్లో కెమెరా టెలిఫొటో లెన్స్‌తో త‌యారు చేశారు. నోకియాలో మోనోక్రోమ్‌, ఆర్‌జీబీ సెన్సార్ టెక్నాల‌జీ వాడారు. నోకియాలో బోతీస్ అనే యునిక్ ఫీచ‌ర్ ఉంది. చూడ‌టానికి ఈ మూడు గొప్ప‌గానే అనిపిస్తున్నా.. నోకియా 8 భార‌త్‌లో ఎంత ధ‌ర‌తో దిగుతుంద‌నేది కీల‌క పాత్ర పోషించ‌నుంది.

జన రంజకమైన వార్తలు