• తాజా వార్తలు
  •  

జియో వ‌ర్సెస్ ఎయిర్‌టెల్‌:  రోజుకు  2జీబీ డేటాలో ఎవ‌రు బెస్ట్‌?

కేబీలు, ఎంబీల్లో డేటా వినియోగం. అదీ మొబైల్ డేటా గురించి తెలిసిన కొద్ది మంది మాత్ర‌మే డేటా ప్యాక్స్ తీసుకుని జాగ్ర‌త్త‌గా వాడుకోవ‌డం.. 2016లో జియో ఎంట‌ర‌య్యేనాటికి ఇండియ‌న్ టెలికం సెక్టార్‌లో మొబైల్ డేటా సినారియో ఇదీ.  జియో తెచ్చిన‌ సంచల‌న మార్పుల‌తో రోజూ 1జీబీ డేటా ఇవ్వ‌ని ప్రీపెయిడ్ ప్లాన్‌ను అస‌లు పట్టించుకునేవాళ్లే లేరు. జియో దెబ్బ‌తో మార్కెట్లో నిల‌దొక్కుకోవ‌డానికి ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌సెల్ వ‌ర‌కు అంద‌రూ ఇదే దారి ప‌ట్టారు. ఇప్పుడు 1జీబీ డేటా కూడా చాల‌క రోజుకు 2, 3 జీబీల డేటా ఇచ్చే ఆఫ‌ర్లు ఏమి ఉన్నాయా అని క‌స్ట‌మ‌ర్లు అడిగే స్థాయికి మొబైల్ డేటా వినియోగం పెరిగిపోయింది.  జియో, ఎయిర్‌టెల్ రెండూ కూడా రోజుకు 2జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను తీసుకొచ్చాయి. 
జియో 799 ప్రీపెయిడ్ ప్లాన్‌
జియో ప్రీ పెయిడ్ యూజ‌ర్లు 799 రూపాయ‌ల‌తో రీఛార్జిచేయించుకుంటే రోజుకు 3జీబీ 4జీ డేటా వ‌స్తుంది.  దీంతోపాటు రోమింగ్‌తోస‌హా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌,  అన్‌లిమిఎడ్ ఎస్ఎంస్‌లు, అన్ని జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉచితం.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. 28 రోజులు రోజుకు 3జీబీ చొప్పున  మొత్తం 84 జీబీ డేటా ఇస్తుంది. 3జీబీ డేటా కూడా అయిపోతే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది.
జియో 799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌
జియోపోస్ట్‌ పెయిడ్ యూజ‌ర్లు 799 రూపాయ‌ల ప్లాన్ ఉంది.  దీంతో కూడా రోజుకు 3జీబీ 4జీ డేటా వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌,  అన్‌లిమిఎడ్ ఎస్ఎంస్‌లు, అన్ని జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉచితం.ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.  సెక్యూరిటీ డిపాజిట్‌గా 950రూపాయ‌లు క‌ట్టాలి. 3జీబీ డేటా కూడా అయిపోతే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. 
ఎయిర్‌టెల్‌లోనే చౌక‌
దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వ‌ర్క్ అయిన ఎయిర్‌టెల్ ఇప్పుడు ప్ర‌తి ప్లాన్‌లోనూ జియోతో పోటీప‌డాల్సిన ప‌రిస్థితి. అందుకే జియో కంటే త‌క్కువ టారిఫ్‌తోనే రోజుకు 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ప్ర‌వేశ‌పెట్టింది. 
ఎయిర్‌టెల్ 549 ప్లాన్‌
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు 549 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 3జీబీ 4జీ డేటా వ‌స్తుంది. రోమింగ్‌తో స‌హా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌,రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. 
ఎయిర్‌టెల్ 799 ప్లాన్‌
ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు 799 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 3.5 జీబీ 4జీ డేటా వ‌స్తుంది. రోమింగ్‌తో స‌హా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌,రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఉచితం.   వాలిడిటీ 28 రోజులు. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు