జియో వచ్చాక ఫ్రీ కాల్స్, డేటా+ వాయిస్ ప్లాన్స్ రావడంతో రీఛార్జిల హడావుడి చాలావరకు తగ్గింది. జియోతో పోటీకి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కూడా ఇలాంటి కాంబో ప్యాక్స్‌తో వస్తున్నాయి. దీంతో చిన్న రీఛార్జి వోచర్ల ప్రాధాన్యం బాగా తగ్గింది. అయినా కంపెనీలు ఇప్పటికీ చిన్న రీఛార్జి ప్లాన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అలా 30 రూపాయల్లోపు ధరలో దొరికే రీఛార్జి ప్లాన్స్ ఇవీ..
ఎయిర్టెల్
ఎయిర్టెల్ 5 రూపాయల ప్లాన్: పూర్తిగా డేటా కోసం ఉద్దేశించిన ప్లాన్ ఇది. 5 రూపాయలకు 4జీబీ డేటా ఇస్తారు. వారం రోజులపాటు వాడుకోవచ్చు.
వొడాఫోన్
వొడాఫోన్ 19 రూపాయల ప్లాన్: ఈ రీఛార్జితో ఒక రోజంతా వొడాఫోన్ టు వొడాఫోన్ అన్లిమిటెడ్ కాల్సః్ చేసుకోవచ్చు. 100 ఎంబీ 4జీ డేటా కూడా వస్తుంది.
వొడాఫోన్ 29 రూపాయల ప్లాన్: రాత్రంతా మేలుకుని నెట్వాడుకోవాలనుకునేవాళ్ల కోసం ఉద్దేశించిన ప్లాన్ ఇది. 20 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఐదు గంటలపాటు (తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు) అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఎఫ్యూపీకి కూడా లిమిట్ లేదు.
రిలయన్స్ జియో
జియో 19 రూపాయల ప్లాన్: ఒక రోజంతా అన్లిమిటెడ్ కాల్సః్ చేసుకోవచ్చు. 200 ఎంబీ డేటా కూడా ఫ్రీ.
జియో 23 రూపాయల ప్లాన్: రెండు రోజులపాటు అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాల్స్ వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ ఎస్ ఎంఎస్‌లు కూడా ఫ్రీ.
ఐడియా
ఐడియా 15 రూపాయల ప్లాన్: ఇది చాలా పాతతరం ఆఫర్. 15 రూపాయల రీఛార్జితో లోకల్ , ఎస్టీడీ కాల్స్ సెకనుకు ఒకటిన్నర పైసాకు చేసుకోవచ్చు. 100 ఎంబీ డేటా కూడా ఇస్తారు. వ్యాలిడిటీ నెల రోజులు.
ఐడియా 22 రూపాయల ప్లాన్: ఇది కూడా అలాంటిదే. నెల రోజుల వ్యాలిడిటీతో 500 ఎంబీ డేటా వస్తుంది. 60 రోజులపాటు లోకల్ , ఎస్టీడీ కాల్స్ సెకనుకు ఒకటిన్నర పైసాకు చేసుకోవచ్చు.
ఐడియా 17 రూపాయల ప్లాన్: 15 రోజుల వ్యాలిడిటీతో 200 ఎంబీ డేటా వస్తుంది. 90 రోజులపాటు లోకల్ , ఎస్టీడీ కాల్స్ సెకనుకు 1.2 ఒకటిన్నర పైసాకు చేసుకోవచ్చు.
ఎయిర్‌సెల్
ఎయిర్‌సెల్ 14 రూపాయల ప్లాన్: రెండు రోజుల వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటా వస్తుంది. వాయిస్ కాల్స్ లేవు.
ఎయిర్‌సెల్ 28 రూపాయల ప్లాన్: 250 ఎంబీ డేటా వస్తుంది. వ్యాలిడిటీ 5 రోజులు. వాయిస్ కాల్స్ లేవు.