• తాజా వార్తలు
  •  

జియో రూ.2599 తాయిలాల గురించి మ‌రిచిపోకూడ‌ని అంశాలు

రిల‌య‌న్స్ జియో.. ఇప్పుడు అంద‌రి దృష్టి దీని మీదే. ఇటీవ‌లే ఫీచ‌ర్ ఫోన్‌తో మార్కెట్లోకి వ‌చ్చిన జియో... కొత్త కొత్త ప్లాన్ల‌తో వినియోగ‌దారులు చేజారిపోకుండా  జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే జియో క్యాష్ బాక్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనిలో భాగంగా  రూ.2599  వరకు క్యాష్ బాక్ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయ‌ని జియో చెబుతోంది. మ‌రి జియో తాయిలాల గురించి మ‌రిచిపోలేని కొన్ని విష‌యాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా!

ఏంటి ఆఫ‌ర్‌!
 రిల‌య‌న్స్ జియో ద్వారా రూ.2599 వరకు క్యాష్ బాక్ పొందే అవకాశం ఉంది. దీన్ని న‌వంబ‌ర్ 10 నుంచి  న‌వంబ‌ర్ 25 మ‌ధ్య‌, వాడుకోవ‌చ్చు. దీంతోపాటు  క్యాష్‌బాక్ కూడా అమ‌లు అవుతాయి. రూ.399 అంత‌కంటే ఎక్కువ రీఛార్జ్ చేయించుకున్న యూజ‌ర్లు రూ.400 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈ రీఛార్జ్‌లు  మై జియో లేదా జియో వెబ్‌సైట్ ద్వారా  చేసుకోవాలి. అయితే ఈ క్యాష్‌బ్యాక్ రూ.50 చొప్పున వోచ‌ర్ల రూపంలో మీకు లభిస్తుంది. ఈ వోచ‌ర్ల‌ను భ‌విష్య‌త్‌లో మీరు రీఛార్జ్ చేసుకునేట‌ప్పుడు ఉప‌యోగించుకోవ‌చ్చు.

పేటీఎం, మొబిక్‌విక్‌, ఫోన్ పే, అమేజాన్ పేతో  కూడా..
క్యాష్ బ్యాక్‌లు పొందాలంటే జియో వెబ్‌సైట్ ద్వారా మాత్ర‌మే కాదు పేటీఎం, మొబిక్‌విక్‌, ఫోన్ పె, అమేజాన్ పె  ద్వారా రీఛార్జ్ చేయించుకున్నా చాలు.  డిజిట‌ల్ వాలెట్ల ద్వారా రీఛార్జ్ చేయించుకుంటే రూ.20, రూ.15, రూ.149, రూ.135  ఇలా వివిధ ఓవ‌ర్ల రూపంలో మ‌న‌కు క్యాష్‌బ్యాక్‌లు వ‌స్తాయి. వాటిని భ‌విష్య‌త్‌లో రీఛార్జ్‌ల కోసం వాడుకోవ‌చ్చు.   యాక్సిస్ పే,  ఫ్రీ ఛార్జ్ లాంటి సైట్ల  ద్వారా కూడా రీఛార్జ్‌లు చేసుకోవ‌చ్చు.

జియో.కామ్‌తో రూ.399 డిస్కౌంట్
జియో.కామ్ ద్వారా  క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.399 డిస్కౌంట్ ల‌భించ‌నుంది. అయితే ఇది ల‌భించాలంటే రూ.1500 ట్రాన్సాక్ష‌న్లు చేయాల్సి ఉంటుంది. రూ.1999తో రీఛార్జ్ చేయించుకుంటే రూ.500 డిస్కౌంట్ ల‌భించ‌నుంది.  ఇదే కాదు యాత్రా.కాం ద్వారా డొమిస్టిక్ ఎయిర్ ట్రిప్ వెళ్లే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది జియో. దీంతో పాటు రూ.1000, రూ.500 డిస్కౌంట్ ల‌భిస్తుంది. 

ప్రైమ్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే...
ప్ర‌స్తుతం జియో అందిస్తున్న క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు కేవ‌లం ప్రైమ్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక‌వేళ కొత్త వాళ్లు ఈ ఆఫ‌ర్ల‌ను ఉప‌యోగించుకోవాల‌నుకుంటే వాళ్లు రూ.99తో జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. జియో రీఛార్జ్‌ల ద్వారా క్యాష్‌బ్యాక్ ఓచ‌ర్లు పొందిన‌వాళ్లు ఈ నవంబ‌ర్ 15 త‌ర్వాత రీడీమ్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు