• తాజా వార్తలు

అక్టోబ‌ర్‌లో టెలికాం కంపెనీలు ప్ర‌క‌టించిన టారిఫ్ ప్లాన్లు ఇవే

ఈ ఏడాదిలో టెలికాం కంపెనీలు ఇచ్చిన‌న్ని  ఆఫ‌ర్లు మ‌రి ఎప్పుడూ ఇవ్వ‌లేదేమో. జియో ఎఫెక్ట్‌తో ఎయిర్‌టెల్‌, ఐడియా, బీఎస్ఎన్ఎల్ లాంటి టాప్  కంపెనీలు పోటీ ప‌డి మ‌రీ టారిఫ్ ప్లాన్లు ప్ర‌క‌టించాయి. నెల నెలా కొత్త కొత్త టారిఫ్‌ల‌తో ఈ కంపెనీలు క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ అక్టోబ‌ర్‌లో వ‌చ్చిన ఉత్త‌మ‌మైన టారిఫ్ ప్లాన్లు ఇవే..

ఐడియా సెల్యూల‌ర్ రూ.248 ప్లాన్‌
ఈ నెల‌లో వ‌చ్చిన ఉత్త‌మ‌మైన ప్లాన్ ఇది. రూ.248 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 28 రోజుల పాటు రోజుకు 1జీబీ చొప్పున డేటా మ‌న‌కు ల‌భిస్తుంది.  ఇది 4జీ, 3జీ, 2జీ ఏ యూజ‌ర్ల‌కైనా ఈ ప్లాన్ యూజ్ అవుతుంది.  మీకు 2జీ హ్యాండ్‌సెట్ ఉంటే మీకు 28 రోజుల పాటు 1జీబీ 2జీ డేటా ల‌భిస్తుంది. కొంత‌మంది యూజ‌ర్ల‌కు ఇది లిమిటెడ్ ప్లాన్‌.

భార‌తీ ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌
ఈ నెల‌లో భార‌తీ ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ తీసుకొచ్చింది. రిల‌య‌న్స్ రూ.149 ప్లాన్‌కు పోటీగా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్‌టెల్‌. ఈ ప్లాన్ వ‌ల్ల మ‌న‌కు 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. అంతేకాక అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. అయితే ఈ వాయిస్ కాల్స్ రోజుకు 300 నిమిషాల‌కు, వారానికి 1200 నిమిషాల‌కు ప‌రిమితం కావ‌డం విశేషం. 

బీఎస్ఎన్ఎల్ రూ.429 ప్లాన్‌
బీఎస్ఎన్ఎల్ రూ.429 కాంబో ప్లాన్‌తో 1జీబీ డేటా రోజుకు ల‌భిస్తుంది. అంతేకాక 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. పాన్ ఇండియా బేసిస్ మీద ఇది అంద‌రు యూజ‌ర్ల‌కు వ‌ర్తిస్తుంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ స్టేట్స్‌లో ఈ ప్లాన్‌ను 3.5 ల‌క్ష‌ల మంది తీసుకున్నారు. 

ఐడియా సెల్యుల‌ర్ రూ.198 ప్లాన్‌
ఐడియా సెల్యుల‌ర్ రూ.198 ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా, 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. ఇది సెల‌క్టెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తించే ప్లాన్‌. 

ఎయిర్‌సెల్ రూ.153 ఫీచ‌ర్ ఫోన్ ప్లాన్‌
జియో ఫీచ‌ర్ ఫోన్‌కు దాని రూ.153 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌సెల్ కొత్త ప్లాన్‌తో బ‌రిలో దిగింది. అదే ఎయిర్‌సెల్ రూ.153 ఫీచ‌ర్ ఫోన్ ప్లాన్‌. ఫీచ‌ర్ ఫోన్ మేక‌ర్ లావాతో క‌లిసి ఈ ప్లాన్‌ను అమ‌లు చేస్తోంది ఈ సంస్థ‌. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 2జీ డేటా, అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ 28 రోజుల పాటు ల‌భిస్తుంది. లావా ఫీచ‌ర్ ఫోన్లకు ఇది వ‌ర్తిస్తుంది.


 

జన రంజకమైన వార్తలు