• తాజా వార్తలు
  •  

జియో ప్ర‌త్య‌ర్థులు ఇప్ప‌టికైనా చేయ‌కూడ‌ని త‌ప్పులివే!

జియో.. టెలికాం రంగంలో సంచ‌ల‌నం ఇది.  దీని వ‌య‌సు ఏడాదే కానీ.. ఏళ్ల త‌ర‌బ‌డి పాతుకుపోయిన పెద్ద పెద్ద కంపెనీల‌ను క‌ద‌లించేసింది. ఒక‌వైపు జియో దూసుకుపోతుంటే.. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థులు మాత్రం వెన‌క‌బ‌డిపోతున్నాయి. జియో వేగాన్నిఅందుకోలేక‌..  రిల‌య‌న్స్  వ్యూహాల‌ను తిప్పికొట్ట‌లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జియో  స్థిరంగా ముందుకెళుతుంటే.. స‌మీప ప్ర‌త్య‌ర్థులైన ఎయిర్‌టెల్‌,  ఐడియా, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ మాత్రం త‌ప్పు మీద త‌ప్పు చేస్తున్నాయి. మ‌రి ఏంటా త‌ప్పులు?   

సుల‌భ‌మైన ప్లాన్లు
జియోకి  మిగిలిన టెలికాం సంస్థ‌ల‌కు ఉన్న వ్య‌త్యాస‌మిదే.  జియో వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టిదాకా తీసుకొచ్చిన అన్ని టారిఫ్ ప్లాన్లు చాలా స్ప‌ష్టంగా..సూటిగా ఉన్నాయి.  కానీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్‌, ఐడియా ప్లాన్ల‌లో ఎంతో గంద‌ర‌గోళం. ఉదాహ‌ర‌ణ‌కు జియో రూ.399 ప్లాన్ అంటే జ‌నాల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంది. ఎంత డేటా వ‌స్తుంది. కాల్స్ ఎలా వ‌స్తాయి.. ఎస్ఎంఎస్‌లు ఎలా ఉంటాయి.. ఇవ‌న్నీ వినియోగ‌దారుల‌కు బాగా తెలుసు. కానీ మిగిలిన టెలికాం కంపెనీల్లో రూ.399 ప్లాన్‌ను పోలిన  ప్లాన్ ఏముంది? ఈ ప్ర‌శ్న‌కు క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌ర స‌మాధాన‌మే లేదు! అలాంటి  ప్లాన్లు  ఏమి లేవా అంటే..! బ్ర‌హ్మాండంగా ఉన్నాయి.. కానీ  జ‌నాల‌కు తెలియవంతే!! దీనికి కార‌ణం ఆయా టెలికాం సంస్థ‌ల ప్లాన్ల‌లో ఉన్న అస్ప‌ష్ట‌తే.

ధ‌ర‌ల్లోనూ ఎంతో తేడా...
రియ‌ల‌న్స్ జియో.. వ‌చ్చిన కొత్త‌ల్లో  ఉచితంగా డేటా, కాల్స్ ఇచ్చి ప్ర‌కంప‌న‌లు రేపింది. ఆ త‌ర్వాత  ఆ సంస్థ నెమ్మ‌దిగా ఛార్జీలు వ‌సూలు చేయ‌డం మొద‌లుపెట్టింది.  అయితే ఈ ప్లాన్ల‌లో  స్ప‌ష్ట‌త ఉంది.  రూ.399, రూ.451 ప్లాన్ ఏదైనా ఎంత జీబీ ల‌భిస్తుంది..ఎంత కాల వ్య‌వ‌ధి, ఎస్ఎంఎస్‌లు, కాల్స్ ఎన్నీ ఇలాంటి వివ‌రాల‌పై వినియోగ‌దారులకు ఎంతో అవ‌గాహ‌న ఉంది. కానీ మిగిలిన టెలికాం సంస్థ‌లు మాత్రం  పోటీ  పేరుతో ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు గుప్పించేశాయి. దీంతో ఏ  ప్లాన్లు అందుబాటులో ఉన్నాయో.. వేటిని వెన‌క్కి తీసుకున్నారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. వొడాఫోన్‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే. ఆ సంస్థ... జియోను పోలిన ఎన్నో ఆఫ‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయి.  అన్నిటిక‌న్నా ఇరిటేట్ చేసే విష‌యం ఏమిటంటే టెలికాం కంపెనీలు త‌మ ప్లాన్ల‌ను క‌నీసం అప్‌గ్రేడ్ కూడా చేయ‌ట్లేదు. దీంతో వినియోగ‌దారుల్లో ఎంతో కన్ఫూజ‌న్‌. మ‌రోవైపు జియో మాత్రం త‌క్కువ ప్లాన్ల‌తో ఎక్కువ‌మంది ఆక‌ర్షించే ప‌నిలో  ఉంది. అప్‌గ్రేడ్ చేసినా అంద‌రికి తెలిసేలా చేయ‌డం ఆ సంస్థ వ్యూహం. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు