• తాజా వార్తలు
  •  

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల‌న్నీ ఒక చోట మీ కోసం

జియో వ‌చ్చిన త‌ర్వాత బీఎస్ఎస్ఎన్ కూడా ఎన్నో ప్లాన్స్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ తెచ్చిన కొన్ని ప్లాన్స్ వినియోగ‌దారుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డేవి ఉన్నాయి. అయితే జియో, ఎయిర్‌టెల్ జోరులో బీఎస్ఎన్ఎల్ కాస్త వెన‌క‌బ‌డింది. అయితే డేటా ప్ర‌ధానంగా బీఎస్ఎన్ఎల్ కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చింది. మ‌రి ఆ సంస్థ తీసుకొచ్చిన కొన్ని కీల‌క‌మైన డేటా ప్లాన్స్ ఏమిటో చూద్దామా...

రూ.291 ప్లాన్‌
రూ291 ప్లాన్‌తో 28 రోజుల పాటు 8 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ డేటా పూర్త‌యిన త‌ర్వాత ఈ డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు త‌గ్గించ‌బ‌డుతోంది.                                                                                                                                              

రూ.298 ప్లాన్‌
ఈ ప్లాన్ కింద  భార‌త్ మొత్తం అన్‌లిమిటెడ్ కాలింగ్ ల‌భిస్తుంది అదే కాక అన్‌లిమిటెడ్ మైస్పీడ్ డేటా కూడా ల‌భిస్తుంది.  56 రోజుల‌పాటు ఉండే ఈ ప్లాన్ కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. రోజుకు 1జీబీ హైస్పీడ్ ల‌భిస్తుంది. డైలీ కోటా పూర్త‌యితే స్పీడ్ 80 కేబీపీఎస్‌కు త‌గ్గించ‌బ‌డుతుంది. 

రూ.339 ప్లాన్‌
రూ.339తో ఎస్‌టీవీ ప్లాన్ భార‌త్ మొత్తం ల‌భిస్తుంది. దీంతో 28 రోజుల పాటు రోజుకు  3జీబీ డేటా ల‌భిస్తుంది. ఇదే కాక  బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్  అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవ‌చ్చు. వేరే నెట్‌వ‌ర్క్స్ 30 నిమిషాల  పాటు వాయిస్‌కాల్స్ చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్ కాల‌వ్య‌వ‌ధి  28 రోజులు.

రూ.349 ప్లాన్‌
ఈ ప్లాన్‌తో  లోక‌ల్‌, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. రోమింగ్ కాల్స్ కూడా దీంతో చేసుకోవ‌చ్చు. 28 రోజుల పాటు 2.5 జీబీ హైస్పీడ్  డేటాను మ‌నం పొందొచ్చు. హైస్పీడ్ డేటా పూర్త‌యిన త‌ర్వాత మీ ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగించొచ్చు. కానీ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు త‌గ్గించ‌బ‌డుతుంది.                                                                                                                            

 రూ.333 ప్లాన్‌
ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్ ద్వారా 56 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా ల‌భిస్తుంది. రోజువారీ లిమిట్ ముగిసిన త‌ర్వాత కూడా అన్‌లిమిటెడ్ స్పీడ్ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. 

రూ.395 ప్లాన్‌
రూ.395 ప్లాన్‌తో ఫ్రీ వాయిస్ కాలింగ్‌, డేటా బెనిఫిట్స్ ఉంటాయి. 71 రోజుల పాటు దీని కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా ల‌భిస్తుంది. బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ 3 వేల నిమిషాల కాలింగ్ అవ‌కాశం ఉంది. వేరే నెట్‌వ‌ర్క్స్‌కి 1800 నిమిషాల వాయిస్ కాలింగ్ అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు