జియో రంగప్రవేశంతో మొబైల్ ఫోన్ టారిఫ్ నేలకు దిగివచ్చింది. కంపెనీలు పోటీపడి ఆఫర్లు ప్రకటించడంతో యూజర్లకు రిలీఫ్ దొరికింది. అందుకే రెండు వందల రూపాయలకు కూడా అన్లిమిటెడ్ కాల్స్, 1 జీబీ వరకు డేటా ను కంపెనీలు ఆఫర్లు చేస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 10 ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవీ..
1. ఎయిర్టెల్ రూ.449 ప్లాన్
జియో టారిఫ్‌లకు తగ్గట్లే దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. రోజుకు 1 జీబీ 4జీ డేటా, ఎస్టీడీ, లోకల్ అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చే 449 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ ఇలాంటిదే. అయితే సెలక్టెడ్ కస్టమర్లకే ఈ ప్లాన్ వర్తిస్తుంది.
ధర: 449 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 4జీ డేటా
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్
2. ఎయిర్టెల్ రూ.293 ప్లాన్
ఇది కూడా సెలక్టెడ్ కస్టమర్లకే ఈ ప్లాన్ వర్తిస్తుంది.
ధర: 293 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 4జీ డేటా
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: అన్లిమిటెడ్ టు ఎయిర్టెల్ నెంబర్స్‌కు మాత్రమే
3. వొడాఫోన్ రూ.244 ప్లాన్
జియో, ఎయిర్ టెల్ మాదిరిగా వొడాఫోన్ నుంచి వచ్చిన ఆఫర్ ఇది. కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.
ధర: 244 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 4జీ డేటా
వ్యాలిడిటీ: 70 రోజులు
కాల్స్: లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్
4. ఐడియా రూ.347 ప్లాన్
పోటీ కంపెనీల స్థాయిలో లేకపోయినా ప్రస్తుతానికి ఐడియా నుంచి బెస్ట్ ఆఫర్ ఇదే. సెలక్టెడ్ కస్టమర్లకే ఈ ప్లాన్ వర్తిస్తుంది. అయితే కస్టమర్లను ఆకట్టుకునే స్థాయిలో లేదు.
ధర: 347 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 3జీ డేటా
వ్యాలిడిటీ: 28 రోజులు
కాల్స్: లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్
5. జియో రూ.399 ప్లాన్
జియో తన యూజర్ల కోసం 84 రోజులకు అందిస్తున్న ప్లాన్ ఇది. జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ధర: 399 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 4జీ డేటా
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్
6. జియో రూ.309 ప్లాన్
జియో తన యూజర్ల కోసం 56 రోజులకు అందిస్తున్న ప్లాన్ ఇది. జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ధర: 309 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 4జీ డేటా
వ్యాలిడిటీ: 56 రోజులు
కాల్స్: లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్
7. ఎయిర్‌సెల్ రూ.348 ప్లాన్
ఎయిర్‌సెల్ 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్న ప్రీ పెయిడ్ ప్లాన్ ఇది. అయితే 3జీ డేటా మాత్రమే ఇవ్వడం మైనస.
ధర: 348 రూపాయలు
డేటా: రోజుకు 1జీబీ 3జీ డేటా
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: లోకల్, ఎస్టీడీ అన్లిమిటెడ్ కాల్స్
8. బీఎస్ఎన్ఎల్ రూ.395 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఎస్టీవీ 395తో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 3జీ డేటా మాత్రమే ఇస్తున్నా రోజుకు 2జీబీ డేటా ఇవ్వడం ఆలోచించాల్సిన విషయం. అయితే ప్రీకాల్స్పై లిమిట్ ఉంది.
ధర: 395 రూపాయలు
డేటా: రోజుకు 2 జీబీ 3జీ డేటా
వ్యాలిడిటీ: 71 రోజులు
కాల్స్: బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ కాల్స్ 3వేల నిముషాలు, అదర్ నెట్‌వర్క్‌లకు 1800 నిముషాల కాల్స్ ఫ్రీ
9. బీఎస్ఎన్ఎల్ రూ.444 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఎస్టీవీ 444తో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. డేటా ఆఫర్ బాగున్నా కాల్స్‌కు ఛార్జి చేస్తుండడం దీనికి మైనస్ పాయింట్. అయితే కేవలం డేటా కోసమే అయితే దీన్ని వాడుకోవచ్చు.
ధర: 444 రూపాయలు
డేటా: రోజుకు 4 జీబీ 3జీ డేటా
వ్యాలిడిటీ: 90 రోజులు
కాల్స్: ఫ్రీ కాల్స్ లేవు. అన్నింటికీ ఛార్జి పడుతుంది.
10 ఐడియా రూ.453 ప్లాన్
ఐడియా యూజర్ల కోసం 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్యాక్ ఇది. అయితే 3జీ డేటా కావడం, ప్రీకాల్స్పై లిమిట్ ఉండడం మైనస్ ధర: 453 రూపాయలు
డేటా: రో జుకు 1 జీబీ 3జీ డేటా
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: రోజుకు 300 నిముషాలు,వారానికి 1200 నిముషాల వరకు మాత్రమే ఫ్రీ కాల్స్, తర్వాత కాల్‌కు 30 పైసలు పడుతుంది.