• తాజా వార్తలు

ఏ ఏరియాలో ఏ టెలికం నెట్‌వ‌ర్క్ బెస్టో చెప్పే యాప్‌.. టిక్‌టిక్

ఎయిర్‌సెల్ నెట్‌వ‌ర్క్ త‌మిళ‌నాడు, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో బాగుంటుంది. కొన్నిచోట్ల ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ బాగా వ‌స్తే మ‌రికొన్ని చోట్ల జియో సూప‌ర్‌గా ప‌ని చేస్తుంది. అలాగే కొన్ని రూర‌ల్ ఏరియాల్లో ఇప్ప‌టికీ బీఎస్ఎన్ ఎల్ క‌వ‌రేజి బాగుండొచ్చు. కానీ ఏ ఏరియాలో ఏ నెట్‌వ‌ర్క్ బాగుందో వాడితేనేగానీ తెలియ‌దు. అలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఏరియాలో ఏ నెట్‌వ‌ర్క్ బాగా ప‌ని చేస్తుందో చెప్ప‌డానికి టిక్‌టిక్ (tiktik ) అనే యాప్ వ‌చ్చింది.

ఏమిటీ యాప్‌

ఎయిర్‌టెల్ మార్కెటింగ్ హెడ్ వై ర‌వి ఉద్యోగాన్నివ‌దిలేసి ఇండియాలో ఫ‌స్ట్ టెలికం కంపేరిజ‌న్ ఫ్లాట్‌ఫామ్‌గా టిక్‌టిక్ యాప్‌ను బిల్డ‌ప్ చేశారు. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగ‌ళూరుల నుంచి గ్రాడ్యుయేష‌న్ చేసిన ర‌వి ఈ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ఎంసీఏ చేసిన అనిల్  ఈ టిక్‌టిక్ యాప్‌ను క్రియేట్ చేశారు.  ఏ ఏరియాలో ఏ టెలికం నెట్‌వ‌ర్క్ బాగా ప‌ని చేస్తుందో చెప్ప‌డం ఈ యాప్ టార్గెట్‌. 

బెస్ట్ రీఛార్జి ప్లానేంటో కూడా చెబుతుంది

మీ ఏరియాలో బెస్ట్ నెట్‌వ‌ర్క్ అనేది చెప్ప‌డాన‌కి ట్రాయ్ పోర్టల్‌లో ఉన్న ఆప‌రేట‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ బేస్ చేసుకుంటారు. బాగా ప‌ని చేసే నెట్‌వ‌ర్క్‌ల‌కు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను ఈ యాప్ ఇస్తుంది. అంతేకాదు మీ యూసేజ్‌కు సూట‌బుల్ అయ్యే బెస్ట్ రీఛార్జి ప్లాన్ ఏంటో కూడా స‌జెస్ట్ చేస్తుంది. ప్లే స్టోర్‌లో ఈ యాప్ దొరుకుతుంది. ట్రై చేసి చూడండి.

జన రంజకమైన వార్తలు