• తాజా వార్తలు

రోజుకు 1 జీబీ 4జీ డేటా ప్లాన్ల‌లో బెస్ట్ ఏది?

మొబైల్ డేటాను కేబీల్లో, ఎంబీల్లో వాడే రోజులు పోయాయి. జియో పుణ్య‌మా అని రోజుకు 1 జీబీ రాక‌తో  మొబైల్ ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు పండ‌గ చేసుకుంటున్నారు.  కాంపిటీష‌న్ త‌ట్టుకోవ‌డానికి అన్ని టెల్కోలు ఇప్పుడు రోజుకు 1జీబీ 4జీ డేటా ఇస్తున్నాయి. ఇలాంటి వాటిలో బెస్ట్ ఆఫ‌రేంటో చూద్దాం.  
జియో  
ఇండియాలో మొబైల్ ఇంట‌ర్నెట్ యూసేజ్ గ‌తిని మార్చిన పేరు జియో.  దీనిలో పోస్ట్‌పెయిడ్‌, ప్రీ పెయిడ్ రెండింటిలోనూ రోజుకు 1జీబీ 4జీ డేటా అందించే ప్లాన్స్ ఉన్నాయి.  
ప్రీ పెయిడ్‌:  309 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్, మెసేజ్‌లు కూడా ఫ్రీ. వ్యాలిడిటీ 49 రోజులు.  399 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే ఇదే ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. 499తో రీఛార్జి చేసుకుంటే సేమ్ ప్లాన్ 91 రోజుల వ్యాలిడిటీతో వాడుకోవ‌చ్చు. రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్, మెసేజ్‌లు కూడా ఫ్రీ. వ్యాలిడిటీ. 
పోస్ట్‌పెయిడ్‌:  జియోకు పోస్ట్‌పెయిడ్‌లో ఒకే ఒక ప్లాన్ ఉంది. 309 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్, మెసేజ్‌లు కూడా ఫ్రీ. వ్యాలిడిటీ నెల రోజులు. 
ఎయిర్‌టెల్ 
399 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్ ఫ్రీ. రోజూ 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 56 రోజులు.  అయితే ఫ్రీ కాల్స్‌ను రోజుకు 250 కాల్స్‌కు, వారానికి 1000 కాల్స్‌కు ప‌రిమితం చేసింది.  448 రూపాయ‌ల రీఛార్జితో 70 రోజులు, 509 ప్యాక్‌తో రీ ఛార్జి చేస్తే 84 రోజులు  సేమ్ ఆఫ‌ర్ ప‌నిచేస్తుంది.  
వొడాఫోన్ 
458  రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్ ఫ్రీ. రోజూ 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 70 రోజులు.  అయితే ఫ్రీ కాల్స్‌ను రోజుకు 250 కాల్స్‌కు, వారానికి 1000 కాల్స్‌కు ప‌రిమితం చేసింది.  509 రూపాయ‌ల సూప‌ర్ ప్లాన్‌తో ఇదే ఫెసిలిటీస్‌ను 84 రోజుల‌పాటు పొంద‌వ‌చ్చు. అయితే సెలెక్టెడ్ వొడాఫోన్ క‌స్ట‌మ‌ర్ల‌కే ఈ ఆఫ‌ర్ల‌ను కంపెనీ ఇస్తోంది. 
ఐడియా 
309 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోమింగ్ కాల్స్ ఫ్రీ. రోజూ 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. వ్యాలిడిటీ 56 రోజులు.  అయితే ఫ్రీ కాల్స్‌ను రోజుకు 250 కాల్స్‌కు, వారానికి 1000 కాల్స్‌కు ప‌రిమితం చేసింది. ఈ లిమిట్ దాటితే కాల్స్‌కు సెక‌న్‌కు పైసా చొప్పున ఛార్జి ప‌డుతుంది. 398 రూపాయ‌ల రీఛార్జితో 70 రోజులు, 509 ప్యాక్‌తో రీ ఛార్జి చేస్తే 84 రోజులు  సేమ్ ఆఫ‌ర్ ప‌నిచేస్తుంది.  

జన రంజకమైన వార్తలు