• తాజా వార్తలు
  •  

రూ 200/- ల లోపు 4 జి ప్లాన్స్ అన్నీ ఓ చోట మీ కోసం

ప్రస్తుతం మన దేశం లో డేటా వార్  నడుస్తుంది అనే విషయం మనందరికీ తెలిసినదే! సందర్భం దొరికితే చాలు ఆకర్షణీయమైన ప్లాన్ లతో హోరెత్తిస్తున్నాయి. రిపబ్లిక్ డే ఆఫర్ లు తాజా ఉదాహరణ. తన యొక్క ఎకనామికల్ ప్లాన్ లతో రిలయన్స్ జియో ఎప్పటిలానే ముందు ఉండగా ఎయిర్ టెల్, వోడా ఫోన్, ఐడియా లు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీ ప్లాన్ లను ప్రకటించి బరిలో నిలిచాయి. ఈ నేపథ్యం లో రూ 200/- లలోపు లభించే దాదాపు అన్ని బెస్ట్ 4 జి ప్లాన్ లను అన్నింటినీ ఒక చోట మీకోసం ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.

ఎయిర్ టెల్ 149 మరియు 199

రూ 149/- ల ప్లాన్ ఇప్పటికే ఎయిర్ టెల్ లో ఉన్నప్పటికీ తాజాగా దానిని అప్ గ్రేడ్ చేసింది. ఇంతకుముందు ఈ ప్లాన్ లో వాయిస్ కాల్స్ కేవలం ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ యూజర్ లకు మాత్రమే ఉండేది. అయితే తాజా అప్ డేట్ లో రూ 149/- ప్లాన్ తో రోజుకి 1 జిబి డేటా తో పాటు అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ లోకల్ STD వాయిస్ కాల్స్, SMS,  రోమింగ్ కాల్స్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం కొన్ని సర్కిల్ లలో మాత్రమే అందుబాటులో ఉన్నది. అలాగే తన రూ 199/- ల ప్లాన్ లో ఎయిర్ టెల్ రోజుకి 1.4 జిబి ని రోజుకి అందిస్తుంది. అంటే ఇంతకుముందు ఈ ఆఫర్ తో నెలకు 28 జిబి డేటా లభిస్తే అది ప్రస్తుతం 39.2 జిబి కి పెరిగింది అన్నమాట. మిగతా సర్వీస్ లన్నీ మామూలే.

రిలయన్స్ జియో 149 మరియు 198

రిపబ్లిక్ డే ఆఫర్ లో భాగంగా అప్పటికే ఉన్న తన ఆఫర్ లకు సరికొత్త హంగులను జోడించడం ద్వారా తమ యూజర్ లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది రిలయన్స్ జియో. రూ 149/- లో భాగంగా జియో రోజుకి 1.5 జిబి డేటా ను అందిస్తుంది. అంటే నెలకు 42 జిబి డేటా అన్నమాట. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అలాగే తన రూ 198/- ల ప్లాన్ తో జియో రోజుకి 2 జిబి డేటా ను అందిస్తుంది. అంటే నెలకు 56 జిబి డేటా లభిస్తుంది. మిగతా సర్వీస్ లు అయిన అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు SMS , జియో యాప్స్ కు యాక్సెస్ లతో ఇది 28 రోజుల వ్యాలిడిటీ ని కలిగి ఉంటుంది. అయితే ఇంతకుముందు ఇది కేవలం రోజుకి 1.5 జిబి డేటా ను మాత్రమే అందించేది.

వోడా ఫోన్

వోడా ఫోన్ తన రూ 199/- ల రీఛార్జి తో రోజుకి 1 జిబి డేటా ను అందిస్తుంది. దీనితో పాటు అన్ లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్, ఫ్రీ రోమింగ్ ను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

ఐడియా 199

డేటా ప్లాన్ ల విషయం లో ఐడియా కూడా జియో, ఎయిర్ టెల్ లు అనుసరించిన మార్గాన్నే అనుసరిస్తుంది. రూ 199/- ప్రీ పెయిడ్ ప్లాన్ లో రోజుకి 1.4 జిబి డేటా ను అందిస్తుంది. దీనితో పాటు అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్, ఫ్రీ అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్, రోజుకి 100 SMS లు ఇస్తుంది. కొన్ని సర్కిల్ లలో 10 రోజుల వ్యాలిడిటీ  తో కూడిన రూ 93/- ల ఆఫర్ ను కూడా అందిస్తుంది.దీనిలో భాగంగా రోజుకి 1 జిబి డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMS లభిస్తాయి.

జన రంజకమైన వార్తలు