• తాజా వార్తలు

రూ 200/- ల లోపు ప్రీ పెయిడ్ ప్లాన్స్ అన్నీ మీ కోసం

మన దేశం లోని టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ తదితర కంపెనీలు నిరంతరం తమ యొక్క టారిఫ్ ప్లాన్ లను మారుస్తూ యూజర్ లకు ఆకర్షణీయమైన ఆఫర్ లను అందిస్తూ ఉంటాయి. వీటిమధ్య ఉన్న పోటీ వలన వినియోగదారుడు భారీ స్థాయి లో లాభపడుతున్నాడు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా ఆఫర్స్, ఉచిత sms లు ఇలా అన్నిరకాల సౌకర్యాలూ దాదాపుగా అన్ని టారిఫ్ లలోనూ లభిస్తున్నాయి. అన్ని టెల్కో లు రూ 200/- లలోపు టారిఫ్ లను అందిస్తున్నాయి. వీటి గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఎయిర్ టెల్ రూ 199/- ల ప్లాన్

ఎయిర్ టెల్ తన రూ 199/- ల ప్లాన్ లో 39.2 GB హై స్పీడ్ 4 జి ఇంటర్ నెట్ ను అందిస్తుంది. అంటే రోజుకి 1.4 GB అన్నమాట. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్ కూడా ఇందులో లభిస్తాయి. ఇంతకుముందు ఈ ప్లాన్ లో రోజుకి కేవలం 1 GB డేటా మాత్రమే లభించేది. ప్రస్తుతం రోజుకి 100 ఉచిత sms లు కూడా లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

రిలయన్స్ జియో యొక్క  149/- మరియు 198/- ల ప్లాన్ లు

రూ 149/- ల ప్రీ పెయిడ్ ప్లాన్ లో జియో రోజుకి 1.5 GB 4 జి డేటా చొప్పున నెలకు 42 GB హై స్పీడ్ ఇంటర్ నెట్ ను అందిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 sms లు కూడా లభిస్తాయి. ఇక జియో యొక్క రూ 199/- ల ప్లాన్ లో రోజుకి 2 GB డేటా చొప్పున మొత్తం 56 GB డేటా లభిస్తుంది. ఉచిత లోకల్ మరియు నేషనల్ రోమింగ్, 100 sms లు కూడా ఇందులో భాగంగా లభిస్తాయి. ఈ రెండు ప్లాన్ ల యొక్క వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది.

వోడాఫోన్ యొక్క రూ 198/- ల ప్లాన్

వోడాఫోన్ యొక్క రూ 198/- ల ప్లాన్ లో ఎయిర్ టెల్ మాదిరిగానే రోజుకి 1.4  GB డేటా లభిస్తుంది.దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్స్, sms లు, రోమింగ్ కూడా ఎయిర్ టెల్ మాదిరిగానే ఉంటాయి.

ఐడియా సెల్యూలర్ యొక్క రూ 199/- ల ప్లాన్

ఐడియా సెల్యూలర్ కూడా ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ ల మాదిరిగానే రోజుకి 1.4 GB చొప్పున మొత్తం 39.2 GB డేటా ను అందిస్తుంది.మిగతావన్నీ కూడా పై రెండింటి మాదిరిగానే ఉంటాయి.

BSNL యొక్క రూ 118/- మరియు రూ 186/- ల ప్లాన్ లు

BSNL కూడా పోటీ ఆఫర్ లను ప్రకటిస్తుంది. STV లో భాగంగా రూ 118/- ల ప్లాన్ ను ఇది అందిస్తుంది. ఇందులో వ్యాలిడిటీ పీరియడ్ కు అన్ లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్, పర్సనలైజ్ద్ రింగ్ బ్యాక్ టోన్ సర్వీస్ ;అభిస్తాయి. అంతేగాక 1 GB డేటా కూడా లభిస్తుంది. రూ 186/- ల ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు అన్ లిమిటెడ్ డేటా కూడా లభిస్తుంది. అయితే రోజువారీ యూసేజ్ 1 GB దాటినా తర్వాత ఇంటర్ నెట్ స్పీడ్ 40 kbps కు తగ్గించబడుతుంది. ఢిల్లీ, ముంబై రీజియన్ లకు తప్ప మిగతా అన్ని ప్రాంతాలకూ ఉచిత రోమింగ్ కూడా లభిస్తుంది. దీని  వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

జన రంజకమైన వార్తలు