• తాజా వార్తలు

జియో , ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు అందిస్తున్న అతి చవకైన ప్లాన్ లపై ఒక కంపారిజన్

మొన్నటిదాకా డేటా ప్లాన్ లతో కొట్టుకున్న టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ పంథాను మార్చాయి. అతి తక్కువ ధర లో అంటే అతి చవకైన ప్లాన్ లను అందించడం పై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యం లో ప్రముఖ టెలికాం ఆపరేటర్ లు అయిన జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు తమ అతి చవకైన ప్లాన్ లను ఎలా ఇస్తున్నాయో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో రూ 19/- లతో అతి చవకైన ప్లాన్ ను అందిస్తుంది. దీనితో రీఛార్జి చేసుకుంటే రోజుకి 0.15 GB డేటా లభిస్తుంది. డేటా లిమిట్ దాటినా తర్వాత ఇంటర్ నెట్ స్పీడ్ 64kbps కు తగ్గించబడుతుంది. దీనికి అదనంగా జియో యాప్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 20 sms లు కూడా ఈ ప్లాన్ లో లభిస్తాయి. అయితే దీని వ్యాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.

వోడాఫోన్

వోడాఫోన్ రూ 21/- ల రీఛార్జి తో తన చవకైన ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా ఇది అన్ లిమిటెడ్ 3జి/4జి ఇంటర్ నెట్ ను అందిస్తుంది. యితే ఈ అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ కేవలం ఒక గంట సేపు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. అంటే ఒక గంట లో మీరు ఎంత ఇంటర్ నెట్ వాడగలిగితే అంత వాడుకోవచ్చు అన్నమాట. రీఛార్జి చేసిన ఒక రోజు లోపు దీనిని వాడుకోవాలి.

ఎయిర్ టెల్

ఎయిర్ టెల్ రూ 29/- రీఛార్జి తో అతి చవకైన ప్లాన్ ను అందిస్తుంది. ఇందులో భాగంగా 150 MB 3జి/4జి ఇంటర్ నెట్ లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజుల;ఉ ఉంటుంది.

ఐడియా

రూ 21/- ల రీఛార్జి తో ఐడియా తన అతి చవకైన ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే 150 MB 3 జి డేటా , అన్ లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది.

జన రంజకమైన వార్తలు