• తాజా వార్తలు
  •  

జియో యాప్ లో ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనపడలేదా? అయితే ఇలా చేయండి.

రిలయన్స్ జియో యొక్క ప్రైమ్ మెంబర్ షిప్ యొక్క గడువు నిన్నటితో పూర్తి అయింది. అయితే ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్ లుగా సబ్ స్క్రైబ్ చేసుకున్నవారికి మరొక 12 నెలల పాటు ఉచితంగా మెంబర్ షిప్ ఉంటుందని జియో ప్రకటించింది. ఈ రెన్యూవల్ ప్రక్రియ ఆటోమాటిక్ గా ఉండదు. జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను మరొక సంవత్సరం పాటు పొడిగించుకోవడానికి అప్లై చేసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవలసిందిగా మీ మై జియో యాప్ లో మీకు ఒక మెసెజ్ వస్తుంది. అయితే జియో కు ఉన్న 175 మిలియన్ల యూజర్ ల సంఖ్య ను దృష్టి లో ఉంచుకుంటే అంత పెద్ద నెట్ వర్క్ లో అందరికీ మెసేజ్ రాకపోవచ్చు. అంటే ఈ ప్రైమ్ మెంబర్ షిప్ పొడిగింపు కు సంబందించిన మెసేజ్ కొంతమందికి రాకపోవచ్చు. మరి అలాంటి సందర్భాలలో ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

జియో మెంబర్ షిప్ పొడిగింపు మెసేజ్ రాకపోతే ఏం చేయాలి ?

మీ యొక్క జియో ప్రైమ్ మెంబర్ షిప్ పొడిగింపు సంబందించిన బ్యానర్ మెసేజ్ మీకు రాకపోతే ముందుగా మై జియో యాప్ ను క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు లేదా అంతకంటే ఎక్కువసేపు వీడియో స్ట్రీమింగ్ చేయాలి. ఇదంతా మీరు ఏ నెంబర్ అయితే పొడిగించాలి అనుకుంటున్నారో ఆ జియో నెంబర్ నుండి చేయాలి. అలా చేసిన తర్వాత మీ మొబైల్ లోని మై జియో యాప్ ను మరొక్కసారి స్టార్ట్ చేసి అదే నెంబర్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీ నెంబర్ యొక్క జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను పొడిగించుకోవలసిందిగా బ్యానర్ మెసేజ్ మీకు కనిపిస్తుంది. ఒక్కసారి మీకు అ మెసేజ్ కనపడిన తర్వాత స్టాండర్డ్ రెన్యూవల్ ప్రాసెస్ ను ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఆ మెసేజ్ లో గెట్ నౌ అనే బటన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ మెంబర్ షిప్ మరొక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లుగా మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న నెంబర్ ల లిస్టు కూడా వస్తుంది. వాటిలో మీకు అవసరమైన నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు గంటలలో మీ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

జన రంజకమైన వార్తలు