• తాజా వార్తలు
  •  

జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా ఐడియా సరికొత్త ప్లాన్

మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్లకు పోటీగా ఐడియా కూడా తన సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటిదాకా నెల రోజుల ప్లాన్ తో అలరించిన ఐడియా 84 రోజుల ప్లాన్ తో దూసుకొచ్చింది. ప్లాన్ వివరాలపై ఓ లుక్కేయండి.

వినియోగదారులు రూ. 509తో రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 3జీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్‌(హోమ్‌, నేషనల్‌ రోమింగ్‌), రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను 84 రోజుల పాటు సేవలు లభించనున్నాయి.

రిలయన్స్‌ జియో రూ.459 ప్యాక్‌కు, ఎయిర్‌టెల్‌కు రూ.509 ప్యాక్‌కు ఇది డైరెక్ట్‌ పోటీగా మారనుందని టెలికాం విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రిలయన్స్‌ జియో తన రూ.459 ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, ఉచిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.

అయితే జియోకు కూడా రూ.509 ప్యాక్‌ ఉంది. కానీ ఈ ప్యాక్‌ కింద రోజుకు 2జీబీ డేటాను 49 రోజుల పాటే అందిస్తోంది. అదేవిధంగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు కూడా రూ.509 ప్యాక్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఐడియా ప్రీపెయిడ్‌ కస్టమర్లు రూ.300, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై వచ్చే ఏడాదిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

అదేవిధంగా ఐడియా తన రూ.198 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను ఇటీవల అప్‌గ్రేడ్‌ చేసింది. రూ.198 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ డేటా కాకుండా 1.5జీబీ 3జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

 దీంతో ఒకే రకమైన టారిఫ్‌తో ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌లు పోటీపడనున్నాయి.

జన రంజకమైన వార్తలు