• తాజా వార్తలు
  •  

అన్ని టెల్కో లు అందిస్తున్న రూ 50/- లలోపు ప్లాన్ ల వలన ఏమైనా లాభం ఉందా?

దేశం లోని మేజర్ టెలికాం ఆపరేటర్ లు అందిస్తున్న అతి చవకైన ఆఫర్ ల గురించి నిన్నటి ఆర్టికల్ లో చదువుకుని ఉన్నాము. ఈ రోజు ఈ టెలికాం ఆపరేటర్ లు అందిస్తున్న రూ 50/- ల లోపు ఉన్న ప్లాన్ లలో అత్యుత్తమ మైన వాటిని అందిస్తున్నాం.

రిలయన్స్ జియో

నిన్నటి ఆర్టికల్ లో చెప్పుకున్నట్లు రూ 19/- లలో జియో ఒకరోజు వ్యాలిడిటీ తో ఒక ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో 0.15 GB డేటా తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా లభిస్తాయి. దీనితో పాటు రూ 49/- లకు మరొక ప్లాన్ ను జియో అందిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు 1 GB డేటా, అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్ మరియు 50 sms లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవాలి అంటే మీ దగ్గర జియో ఫోన్ ఉండాల్సిందే.

ఎయిర్ టెల్

కేవలం రూ 9/- లతో అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, 100 MB డేటా మరియు 100 sms లను ఎయిర్ టెల్ అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. రూ 23/- తో రీఛార్జి చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, 200 MB డేటా మరియు 100 sms లు రెండు రోజుల వ్యాలిడిటీ తో లభిస్తాయి. అదే రూ 49/- తో రీఛార్జి చేసుకుంటే 1 GB డేటా లభిస్తుంది. కొంచెం ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఉండే ప్లాన్ లు కావాలంటే రూ 23/- తో రీఛార్జి చేసుకోవాలి. ఇందులో భాగంగా 150 MB డేటా 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తుంది.

వోడాఫోన్

రూ 21/- తో రీఛార్జి చేసుకుంటే అన్ లిమిటెడ్ 3జి/4జి ని వోడాఫోన్ అందిస్తుంది. అయితే దీని వ్యాలిడిటీ కేవలం ఒక గంట సేపు మాత్రమే. రూ 29/- ల ప్యాక్ లో 150 MB ఇంటర్ నెట్ 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తుంది. మీ డేటా అయిన తర్వాత 4p/10kb ఛార్జ్ చేయబడుతుంది. రూ 44/- ల ప్యాక్ లో 450 MB డేటా 7 రోజులవ్యలిదితి తో లభిస్తుంది,

ఐడియా

రూ 21/- ల రీఛార్జి తో 150 MB డేటా, అన్ లిమిటెడ్ లోకల్.STD కాల్స్ ను ఐడియా అందిస్తుంది. దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే. రూ 47/- తో రీఛార్జి చేసుకుంటే అన్ లిమిటెడ్ లోకల్.std ఐడియా టు ఐడియా కాల్స్ మరియు 250 MB డేటా లు వారం రోజుల వ్యాలిడిటీ తో లభిస్తాయి. రూ 51/- ల ప్యాక్ లో 28 రోజుల వ్యాలిడిటీ తో 1 GB డేటా లభిస్తుంది.  

జన రంజకమైన వార్తలు