• తాజా వార్తలు

జియో ఫోన్ మూడేళ్లు వాడాల్సిందే.. లేక‌పోతే డిపాజిట్ ద‌క్క‌దు !!!

ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న రిల‌య‌న్స్ జియో త‌న 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫీచ‌ర్ ఫోన్‌తో మ‌రోసారి  యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోబోతోంది.  60 ల‌క్ష‌ల మంది ప్రీ బుకింగ్ చేసుకున్న ఈ ఫోన్ ఇప్ప‌టికే యూజ‌ర్ల చేతికి అందాల్సి ఉంది. అయితే హెవీ ఆర్డ‌ర్ల‌తో డెలివ‌రీ లేట‌వుతుంద‌ని జియో చెబుతోంది. దీపావ‌ళిలోగా తొలి విడ‌త బుక్ చేసుకున్న 60 ల‌క్ష‌ల మందికి డెలివరీ చేయాల‌న్న‌ది జియో టార్గెట్‌.  ఇప్ప‌టికే కొన్ని ఫోన్లు డెలివ‌రీకి సిద్ధం చేశామని చెబుతున్నందున  ఈ వారంలోనే కొంత‌మందికి డెలివ‌రీ రావ‌చ్చు. అయితే ఈ స్మార్ట్  ఫీచ‌ర్ ఫోన్ మూడేళ్లు వాడితేనే మీరు క‌ట్టిన సెక్యూరిటీ డిపాజిట్ 1500 మొత్తం వెన‌క్కి ఇస్తుంది. 

ఇదీ రిఫండ్ పాల‌సీ

రిల‌య‌న్స్ ఇన్ఫోకామ్ (జియో) త‌న 4జీ ఫీచ‌ర్ ఫోన్ రిఫండ్ పాల‌సీని రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌ను 1500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి కొనుక్కోవాలి. ఇప్ప‌టికే 500 క‌ట్టి ప్రీబుకింగ్ చేసుకున్న‌వారు మిగిలిన అమౌంట్ చెల్లించి   ఫోన్ తీసుకోవాలి.  అయితే   ఆ ఫోన్‌ను మూడేళ్లు వాడి, త‌ర్వాత తిరిగిస్తేనే మీరు క‌ట్టిన డిపాజిట్ 1500 మీకు తిరిగి ఇస్తారు.

మీరు ఏడాదిలోపే జియో ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే మీకు ఎలాంటి రిఫండ్ రాదు.

* 12 నుంచి 24 నెల‌ల్లోపు రిఫండ్ చేస్తే 500 రూపాయ‌లు తిరిగిస్తారు.

* 24-36 నెల‌ల్లోగా రిఫండ్ ఇస్తే 1000 రూపాయలు చెల్లిస్తారు.

* 36 నెల‌లు అంటే మూడేళ్లు పూర్త‌య్యాక తిరిగి ఇస్తేనే మీరు క‌ట్టిన మొత్తం డిపాజిట్ (1500) తిరిగి ఇస్తారు. 

మిస్‌యూజ్‌ను అరిక‌ట్ట‌డానికే రిఫండ్ పాల‌సీని ఇంత ప‌క్కాగా ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు.   ఈ రిఫండ్ పాల‌సీని జియో అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌క‌పోయినా ప‌క్కాగా ఇదే ఉంటుంద‌ని జియో సోర్సెస్ చెబుతున్నాయి.

జన రంజకమైన వార్తలు