• తాజా వార్తలు
  •  

ఉచిత యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి.

మొబైల్ ఫోన్ల‌లో వెన‌కా ముందూ చూడ‌కుండా ఫ్రీ యాప్స్ డౌన్లోడ్ చేసేస్తున్నారాఇలాంటి చాలా ఫ్రీ యాప్స్‌లో మాలిషియ‌స్ సాఫ్ట్‌వేర్ లేదా మాల్ వేర్ ఉండొచ్చు. అది హ్యాక‌ర్ల‌కు మీ ఫోన్లో ఉన్న డేటాను అంతా ట్రాన్స్‌ఫ‌ర్ చేసే ప్ర‌మాద‌ముంది.  ఢిల్లీలో దీప‌క్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇలా ఓ గేమింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయ‌గానే ఫోన్ స్లో అయిపోయింది. నెమ్మ‌దిగా మిగిలిన యాప్స్ క్రాష్ అయిపోయి, చివ‌రికి ఫోన్ హ్యాంగ‌యిపోయింది. ఇలాగే చాలా యాప్స్ ప‌ని చేస్తుంటాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 4 ల‌క్ష‌ల యాప్స్‌లో 10% యాప్స్ మీ సెన్సిటివ్ డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫ‌ర్ చేసేస్తాయట‌. 50% యాప్స్ మీ ఫోన్ నెంబ‌ర్‌, ఐఎంఈవై నెంబ‌ర్‌, కాల్ లాగ్స్‌, లొకేష‌న్స్ అన్నీషేర్ చేసే ప్ర‌మాద‌ముంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ నౌ సెక్యూర్ చెప్పింది. మిలియ‌న్ కంటే ఎక్క‌వు డౌన్లోడ్ చేసుకున్నయాప్స్‌ను స్ట‌డీ చేస్తే 16వేల‌కు పైగా యాప్స్‌లో హై రిస్క్ ఇష్యూస్ ఉన్నాయని తేల్చింది. 

  ఇలాంటి యాప్స్ ఎలా ప‌ని చేస్తాయంటే..

1. డేటా స్టీల‌ర్‌:  మొబైల్‌లో ఉన్న ఇన్ఫ‌ర్మేష‌న్‌ను రిమోట్ యూజ‌ర్‌కు సెండ్ చేస్తాయి. దీన్ని వాళ్లు ఎలాగైనా వాడుకోవ‌చ్చు. 

2. ప్రీమియం స‌ర్వీస్ ఎబ్యూజ‌ర్‌:  యూజ‌ర్‌కు తెలియ‌కుండానే ప్రీమియం స‌ర్వీసుల‌ను యాక్టివేట్ చేసేస్తాయి. దీంతో ఫోన్ బిల్లు పేలిపోతుంది. 

3. క్లిక్ ఫ్రాడ్‌స్ట‌ర్‌:   యూజ‌ర్‌కు తెలియ‌కుండానే ఆన్‌లైన్ యాడ్స్‌ను క్లిక్ చేసేస్తాయి. సైబ‌ర్ క్రిమినల్స్ దీని ద్వారా ప్రాఫిట్ పొందుతారు. 

4. మాలిషస్ డౌన్‌లోడర్‌:  ఇత‌ర మాలిష‌స్ ఫైల్స్ లేదా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి మీ ఫోన్ మ‌రింత ఇన్‌ఫెక్ట్ చేసేస్తాయి. 

5. స్పైయింగ్ టూల్స్:   జీపీఎస్ డేటా ద్వారా యూజ‌ర్ లొకేష‌న్‌ను ట్రాక్ చేసి థ‌ర్డ్‌పార్టీల‌కు పంపిస్తాయి. సైబ‌ర్ క్రిమిన‌ల్స్ చేతిలో ఇలాంటి వివ‌రాలు ప‌డితే చాలా లాస్ అవుతాం. 

6. రూట‌ర్‌:  ఫోన్ మీద‌, దాని ఫంక్ష‌న్స్ మీద పూర్తి కంట్రోల్ తీసేసుకుంటాయి. ఇది మొబైల్ యూజ‌ర్‌కు మ‌రింత థ్రెట్‌. 

రెమిడీ ఏంటి?

* పిన్‌, పాస్‌వ‌ర్డ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ లాక్‌.. ఇలా ఫోన్‌లో అందుబాటులో ఉన్న అన్ని సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ను వాడుకోండి.

* యాప్‌ను డౌన్‌లోడ్ చేసేట‌ప్పుడు ఆండ్రాయిడ్ మార్కెట్ లాంటి అఫీషియ‌ల్ యాప్ స్టోర్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. 

* మాలిష‌స్ యాప్స్ బోల్డ‌న్ని ప‌ర్మిష‌న్లు అడుగుతాయి. ఎక్కువ ప‌ర్మిష‌న్లు అడుగుతుంటే దాన్ని అనుమానించాల్సిందే. యాప్‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చేట‌ప్ప‌డు ప‌ర్స‌న‌ల్‌, డివైస్ ఇన్ఫో ప‌ర్మిష‌న్లు అడిగితే ఎవాయిడ్ చేయ‌డం బెట‌ర్‌. 

* స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు దాదాపు పీసీ అంత ప‌ని చేస్తున్నాయి.  కాబ‌ట్టి మీరు కంప్యూట‌ర్‌ను వాడేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా సైట్ల‌ను చూస్తారో ఫోన్‌ను కూడా అలాగ వాడండి.  

* మొబైల్ సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫ్రీ కంటే కొద్దిగా ప్రైస్ పెట్టి అయినా స్టాండ‌ర్డ్ సెక్యూరిటీ యాప్స్ తీసుకోవ‌డం బెట‌ర్ 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు