• తాజా వార్తలు
  •  

రెస్ట్రిక్ష‌న్స్ ఉన్న ప‌బ్లిక్ వైఫైలోనూ అన్‌లిమిటెడ్‌గా యూజ్ చేయ‌డానికి ట్రిక్స్ 

మొబైల్ డేటా ఎంత చౌక అయినా కూడా జ‌నానికి వైఫై మీద ఉన్న మోజు పోలేదు. ఫాస్ట్‌గా ఉండ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అందుకే ఇప్పుడు చాలా కేఫ్‌లు, రెస్టారెంట్స్‌, బ్యూటీ క్లినిక్స్ వంటి ఫ్రీ వైఫై అని ఆఫ‌ర్ చేస్తూ ఎట్రాక్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఈ ఫ్రీ ప‌బ్లిక్ వైఫైకి కూడా లిమిట్స్ ఉంటాయి.  కొన్నిచోట్ల కొంత డేటా లిమిట్ పెడితే, మ‌రికొన్ని చోట్ల అర‌గంట లేదా గంట‌పాటు మాత్ర‌మే మీరు వైఫై యాక్సెస్ చేయ‌గ‌లుగుతారు. ఇలాంటి రెస్ట్రిక్ష‌న్స్ ఏమీ లేకుండా ప‌బ్లిక్ వైఫైను అన్‌లిమిటెడ్‌గా వాడుకోవ‌డానికి ట్రిక్స్ ఉన్నాయి.  చూద్దాం ప‌దండి 
మ్యాక్ అడ్ర‌స్‌ను స్ఫూఫ్ చేయడం 
మీడియా యాక్సెస్ కంట్రోల్  (MAC)అడ్ర‌స్‌ను స్పూఫ్ చేయ‌డం ద్వారా మీరు ప‌బ్లిక్ వైఫైను కూడా అన్‌లిమిటెడ్‌గా వాడుకోవ‌చ్చు.  మీ డివైస్‌ను గుర్తించ‌డానికి మ్యాక్ అడ్ర‌స్‌నే నెట్‌వ‌ర్క్‌లు యూజ్ చేసుకుంటాయి. సాధార‌ణంగా ప‌బ్లిక్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్‌లు దీని ద్వారానే మీ డివైస్‌ను గుర్తించి కొంత డేటా లేదా టైమ్ లిమిట్ వ‌ర‌కే ప‌ర్మిట్ చేస్తాయి. ఇలా కాకుండా మీ డివైస్ మ్యాక్ అడ్రస్‌ను మార్చి వాళ్ల‌ను బోల్తా కొట్టించ‌డానికి ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి. Change My MAC – Spoof Wifi MAC ఇందులో బెస్ట్‌.  ఇందులో మీ మ్యాక్ అడ్ర‌స్‌లో ఏదో ఒక్క డిజిట్‌ను మార్చినా కూడా అది స్పూఫ్ అయిపోతుంది. మీరు కావాల్సినంత సేపు, కావాల్సినంత డేటాను వాడుకోవ‌చ్చు. 
డీఎన్ఎస్ ట‌న్నెలింగ్‌
సాధార‌ణంగా చాలా రెస్టారెంట్స్‌, కేఫ్స్ ఒక లాంగిన్ పేజ్ లేదా డిఫాల్ట్ హోం పేజీలోకి రీడైరెక్ట్ చేస్తాయి. అక్క‌డ మీరు మీ పేరు లేదా మొబైల్ నెంబ‌ర్‌తో లాగిన్ అయితే ఓటీపీ ద్వారా పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది.  అప్పుడు మీరు ఫ్రీ వైఫైను యాక్సెస్ చేయ‌గ‌లుగుతారు. సికింద్రాబాద్ లాంటి రైల్వేస్టేష‌న్ల‌లో కూడా ఇలాంటి సిస్ట‌మే ఉంది.  ఇలాంటి స‌ర్వీసుల్లో  మీ ఫోన్ నుంచి వ‌చ్చే హెచ్‌టీటీపీ రిక్వెస్ట్‌ల‌ను డిఫాల్ట్ హోం పేజీకి లేదా లాగిన్ పోర్ట‌ల్‌కు పంపిస్తాయి. కానీ మీ డీఎన్ఎస్ రిక్వెస్ట్‌ల‌ను రీరూట్ చేయ‌వు. కాబ‌ట్టి మీరు డీఎన్ఎస్ అడ్ర‌స్‌ను ట‌న్నెల్ చేస్తే మీ డివైస్‌ను నెట్‌వ‌ర్క్ గుర్తించ‌లేదు. అంటే దాన్ని డిఫాల్ట్ హోం పేజీ లేదా లాగిన్ పోర్ట‌ల్‌కు పంపించ‌దు. కాబ‌ట్టి మీరు ఎంత సేపైనా, ఎంత డేటా అయినా ఫ్రీగా వాడుకోవ‌చ్చు.  DNS Changer లాంటి ఆండ్రాయిడ్ యాప్స్ డీఎన్ఎస్ ట‌న్నెలింగ్‌కు బాగా ప‌నికొస్తాయి. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు