• తాజా వార్తలు

గుర‌క‌ర‌హిత నిద్ర‌కి టెక్నాల‌జీ అందిస్తున్న ప‌రిష్కారాలు

గుర‌క ఎంత ఇబ్బందిక‌ర‌మో దాన్ని అనుభ‌విస్తున్న వారికే తెలుసు. ఇంట్లో ఎవ‌రన్నా గుర‌క పెట్టేవారుంటే ఆ ఇంట్లో అంద‌రికీ నిద్ర లేని రాత్రులే. గుర‌క‌ను కంట్రోల్ చేయ‌డానికి ఏం చేయాలో చెప్పే కొన్ని వెబ్‌సైట్లు, యాప్స్ వివ‌రాలివీ..

అమెరిక‌న్ స్లీప్ అసోసియేష‌న్ వెబ్ సైట్

గుర‌క‌ను కంట్రోల్ చేసుకోవాలంటే ముందు అస‌లు స‌మ‌స్య ఎందుకు వ‌స్తుందో తెలుసుకోవాలి. గుర‌క‌కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారాన్ని అందించేందుకు అమెరిక‌న్ స్లీప్ అసోసియేష‌న్ ( American Sleep Association - ASA) త‌న వెబ్‌సైట్‌లో ఒక సెక్ష‌న్ మొత్తాన్ని దీనికే కేటాయించింది. గుర‌క ఎందుకు వ‌స్తుంది? ఎలా వ‌స్తుందికార‌ణాలు, రెమిడీస్ ఏమింటి వంటివ‌న్నీ ఇందులో ఉంటాయి.

మీ ఏజ్‌, ఫుడ్ హ్యాబిట్స్‌, జీన్స్‌.. ఇలాంటివ‌న్నీ గుర్తించి మీ గుర‌క‌కు కార‌ణాలేమింటిరెమిడీస్ ఏంటో సూచిస్తారు. 

ఎక్స‌ర్‌సైజ్‌తో త‌గ్గుతుంది

గుర‌క‌ను త‌గ్గించుకోవ‌డానికి నోరు, ఫారింక్స్‌తో  6 ర‌కాల ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తే త‌గ్గ‌తుంద‌ని సైన్స్ నిరూపించింది. దీనికి సిస్ట‌మేటిక్ డిమానిస్ట్రేష‌న్ వెబ్‌సైట్ల‌లో దొరుకుతుంది. 

స్నోర్‌ల్యాబ్ యాప్  (SnoreLab) 

మీ ప‌క్క‌నున్న వాళ్లు నిద్ర‌లో నువ్వు గుర‌క పెడుతున్నావు అని చెప్పినా మీకు న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదా? అయితే స్నోర్ ల్యాబ్ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లో కూడా దొరుకుతుంది. ఈ యాప్  ప్ర‌తి రాత్రి మీ గుర‌క‌ను రికార్డ్ చేసి మీ గుర‌క ఏ స్థాయిలో ఉందో (స్నోర్ స్కోర్‌) చూపిస్తుంది. అంతేకాదు  మీ స్కోర్‌ను బ‌ట్టి ఎలాంటి ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తే మీ గుర‌క త‌గ్గుతుందో కూడా స‌జెస్ట్ చేస్తుంది. 

స్నోర్ నేష‌న్ వెబ్‌సైట్‌

గ‌తంలో బాగా గుర‌క‌పెట్టి ఎక్స‌ర్‌సైజెస్ లేదా ట్రీట్‌మెంట్ ద్వారా త‌గ్గించుకున్న‌వారి స‌ల‌హాలు కూడా మీకు ప‌నికొచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాటికోసం స్నోర్ నేష‌న్ అనే వెబ్‌సైట్ ఉంది. రాబ‌ర్ట్ హ‌డ్స‌న్ అనే వ్యక్తి త‌న విపరీత‌మైన గుర‌క‌తో ప‌డిన ఇబ్బందులు, దాన్ని ఎలా త‌గ్గించుకున్న‌ది ఈ  సైట్‌లో రాశారు. ఇలాంటి చాలా అనుభ‌వాలు మీకు గుర‌క త‌గ్గించుకోవ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

 

జన రంజకమైన వార్తలు