• తాజా వార్తలు
  •  

మీ పిల్ల‌లు ఫోన్లో యాప్స్ ఇన్‌స్టాల్ చేయ‌కుండా కంట్రోల్ చేసే ట్రిక్స్‌

టెక్నాల‌జీ జ‌నాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఎల్‌కేజీ పిల్ల‌లు కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఈజీగా ఆప‌రేట్ చేసేస్తున్నారు. ఇది చూసి త‌ల్లిదండ్రులు మురిసిపోయే రోజులు పోయాయి. ఫోన్ పిల్ల‌ల చేతికి వెళితే వాళ్లు ఏం చేసేస్తారో, ఏం డౌన్‌లోడ్ చేసేస్తారో, వాట్స‌ప్‌లో ఎవ‌రికి ఏం మెసేజ్‌లు పంపేస్తారోన‌ని భ‌య‌పడుతున్నారు పేరెంట్స్‌. ముఖ్యంగా పిల్ల‌లు ప్లే స్టోర్‌లోకి వెళ్లిపోయి త‌మ‌కు న‌చ్చిన గేమ్స్ఉన్న యాప్స్ డౌన్‌లోడ్ చేసేస్తున్నారు.ఇది డేటా లాసే కాదు ఫోన్ మీద భారం పెంచుతుంది.ఒక్కోసారి ఇలాంటి గేమింగ్ యాప్స్‌లో బ‌గ్స్ కూడా ఉండే ప్ర‌మాద‌ముంది. అందుకే మీ పిల్ల‌లు మీ ఫోన్ తీసుకుని ఆడుకునేట‌ప్పుడు యాప్స్ అవీ డౌన్‌లోడ్ చేయ‌కుండా చేసేందుకు ఆండ్రాయిడ్‌లో ఆప్ష‌న్స్ ఉన్నాయి. అవేంటో చూడండి.
ఫింగ‌ర్ ప్రింట్ బ్లాక్ (Fingerprint block)
మీ ఫోన్‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ ఉంటే దానిని ఉప‌యోగించి మీరు యాప్స్ డౌన్‌లోడ్‌ను అడ్డుకోవ‌చ్చు.  ప్లే స్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి    User Controls > Fingerprint authenticationను ఆన్ చేసుకుంటే మీ ఫింగ‌ర్ ప్రింట్ వేస్తేనే త‌ప్ప యాప్ డౌన్‌లోడ్ కాదు.                     .
పేరెంటల్ కంట్రోల్ పిన్ (Parental control PIN)
పిల్ల‌లు యాప్స్ డౌన్‌లోడ్ చేయ‌కుండా పిన్ కూడా సెట్ చేయొచ్చు.  ప్లే స్టోర్‌యాప్ ఓపెన్‌చేసి Settings > User Controls > Parental controls ఆన్‌చేసి పిన్ నెంబ‌ర్ సెట్ చేసుకోవ‌చ్చు.  ఆ పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తేనే యాప్ డౌన్‌లోడ్ చేయ‌గ‌ల‌రు.
మెచ్యూర్ కంటెంట్ ఫిల్ట‌ర్ 
పెద్ద‌వాళ్లు మాత్ర‌మే చూడ‌గలిగే, వాడ‌గ‌లిగే యాప్స్‌ను మీ పిల్ల‌లు డౌన్‌లోడ్ చేయ‌కుండా ఉండడానికి ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్లే స్టోర్‌లోకి వెళ్లి Settings > User Controls > Parental controls > Set content restrictionsవెళ్లాలి.  Teen, Mature, and Adults Only appsను ఆఫ్ చేస్తే ఆ యాప్స్ డౌన్‌లోడ్ కావు. 

జన రంజకమైన వార్తలు