• తాజా వార్తలు
  •  

 వైర్‌లెస్ డాంగిల్స్‌తో ఉండే మూడు సాధార‌ణ స‌మ‌స్య‌లు వాటిని సాల్వ్ చేసే టిప్స్

ఎక్క‌డైనా ఇంట‌ర్నెట్‌ను  వాడుకునేందుకు వీలుగా వైర్‌లైస్ డాంగిల్స్ బాగా వాడుక‌లోకి వ‌చ్చాయి.  యూఎస్‌బీ ఫ్లాష్‌డ్రైవ్‌లా ఉండే ఈ డాంగిల్స్‌ను డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్ దేనికైనా క‌నెక్ట్ చేసుకుని నెట్ వాడుకోవ‌చ్చు.  ఇంట్లో, ఆఫీసులో కాకుండా బ‌య‌ట ఎక్క‌డైనా నెట్‌తో ప‌ని చేయాల‌నుకునేవారు ఈ డాంగిల్స్ మీదే ఆధార‌ప‌డుతున్నారు. అయితే ఈ డాంగిల్స్ వాడ‌కంలో కొన్ని ప్రాబ్ల‌మ్స్ కూడా ఉన్నాయి. అవేంటి?  వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ప‌దండి.   
1. వైర్‌లెస్ ఇంట‌ర్‌ఫియ‌రెన్స్ 
వైఫై డివైస్‌లు 2.4 GHz, 5GHz బాండ్ ల‌తో క‌మ్యూనికేట్ చేస్తాయి. 2.4 GHz బాండ్ విడ్త్‌తో  ఓల్డ్ వెర్ష‌న్ కాబ‌ట్టి స్లోగా ఉంటుంది. అదే 5GHz అయితే కొత్త వెర్ష‌న్. స్పీడ్‌గా ఉంటుంది.  కొత్త‌గా వ‌చ్చే వైర్‌లైస్ డాంగిల్స్  రెండు బాండ్ల‌ను స‌పోర్ట్ చేస్తున్నాయి.  కాబ‌ట్టి ఇలాంటివే తీసుకోవాలి.  మీరు ఇంకా 2.4 GHz బాండ్‌విడ్త్  ఉన్నడాంగిల్ వాడుతుంటే దానిలో legacyలేదా mixed మోడ్‌కు బ‌దులు ఎన్ మోడ్ వాడండి.  దానికంటేబెస్ట్  ఆప్ష‌న్ 5గిగా హెర్ట్జ్ బాండ్‌విడ్త్‌తో న‌డిచే వాటికి మారిపోవ‌డం.  
2. ఇంట‌ర్న‌ల్ యాంటెన్నా 
వైర్‌లెస్ డాంగిల్స్ కాంపాక్ట్ వ‌న్స్‌, బ‌ల్కీ వ‌న్స్ అనే రెండు  ర‌కాలుగా వ‌స్తాయి.  బ‌ల్కీ వ‌న్స్‌లో ఎక్స్‌ట‌ర్న‌ల్ యాంటెన్నా ఉంటే కాంపాక్ట్ ర‌కంలో ఇంట‌ర్న‌ల్ యాంటెన్నాస్ ఉంటాయి. కాంపాక్ట్ డాంగిల్స్‌ను ఎక్కువ మంది ప్రిఫ‌ర్ చేస్తారు. చిన్న‌గా ఉండ‌డం, చూడ‌డానికి బాగుండ‌డం ఇందుకు కార‌ణాలు. అయితే పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో ఇవి వీకే.  అదే ఎక్స్‌ట‌ర్న‌ల్ యాంటెన్నా ఉంటే పెర్‌ఫార్మెన్స్ బాగుంటుంది.  కాబ‌ట్టి బ‌ల్కీవ‌న్స్‌నే తీసుకోవాలి.  ఎక్సెట‌ర్న‌ల్  యాంటెన్నా ఉంటే చూడ‌డానికి అందంగా ఉండ‌దు. అయినా పెర్‌ఫార్మెన్సే ముఖ్యం అనుకుంటే ఇదే బెట‌ర్ ఛాయిస్‌.  
3. హార్డ్‌వేర్ స‌మ‌స్య‌లు
* 600 ఎంబీపీఎస్ లేబుల్‌తో ఉన్న డాంగిల్ మీకు ఫుల్ బాండ్‌విడ్త్ ఇవ్వ‌దు. దీని బ‌దులు 2.4 గిగాహెర్ట్జ్‌పైన 150 ఎంబీపీఎస్‌, 5 గిగాహెర్ట్జ్‌పైన 450 ఎంబీపీఎస్ స్పీడ్ ఇచ్చే డ్యూయ‌ల్ బాండ్ ఉన్న డాంగిల్ యూజ్ చేస్తే స్పీడ్‌, పెర్‌ఫార్మెన్స్ బాగుంటుంది. 
* యూఎస్‌బీ 2.0 పోర్ట్ ఉంటే మ్సాక్జిమం 480 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప‌ని చేయాలి. అయితే హార్డ్‌వేర్ ప్రోటోకాల్ ఇష్యూస్‌తో స్పీడ్ 320 ఎంబీపీఎస్‌కే ప‌రిమిత‌మ‌వుతుంది. అందుకే మీరు ఫుల్ స్పీడ్ పొందాలంటే యూఎస్‌బీ 3.0 పోర్ట్ ఉన్న డాంగిల్ తీసుకోవాలి. 
* మీరు 25 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న క‌నెక్ష‌న్ తీసుకుని నా డాంగిల్ స్పీడ్‌గా ప‌ని చేయ‌డం లేద‌న‌డం కూడా క‌రెక్ట్ కాదు.  ఎందుకంటే నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్లు చెప్పిన స్పీడ్ 100% ఎప్పుడూ రాదు. అందుకే  40 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ఉండే క‌నెక్ష‌న్ తీసుకోవాలి.   

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు