• తాజా వార్తలు
  •  

ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కి వెయిటింగ్ లేకుండా డైరెక్ట్‌గా క‌నెక్ట్ కావ‌డానికి ట్రిక్

పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ క‌స్ట‌మ‌ర్ కేర్‌లో ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ (ఐవీఆర్‌) సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అందులో క‌స్ట‌మ‌ర్ల సాధార‌ణ స‌మ‌స్య‌ల‌న్నింటికీ సిస్ట‌మే స‌మాధానం చెప్పేస్తుంది. కానీ అన్ని సందర్భాల్లోనూ అది వ‌ర్క‌వుట్ కాదు క‌దా.  అలాంటప్పుడు కస్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడ‌డం త‌ప్ప‌నిస‌రి. కానీ ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాలంటే ఎంత ప్ర‌యాస‌ప‌డాలో, ఎంత టైం వేస్ట్ చేయాలో ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లంద‌రికీ తెలుసు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందంటే దానికోసం క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడ‌డానికి లైన్లో వెయిట్ చేయ‌లేక చాలామంది దానికి దూరంగా ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే దీనికి ప‌రిష్కారం ఉంది. నేరుగా నాలుగైదు స్టెప్స్‌లో ఒక‌టి, రెండు నిముషాల్లోనే మీరు క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు ఓ ట్రిక్ ఉంది. అదెలాగో చూడండి.
 

ఇలా చేయండి..
1. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 198 లేదా 121కి కాల్ చేయండి. (121కి కాల్ చేస్తే మూడు నిముషాల‌కు 50 పైస‌లు చార్జీ ప‌డుతుంది)

2. ఐవీఆర్ వాయిస్ విన్నాక  మొబైల్ స‌ర్వీస్‌ల కోసం 1 నొక్కండి

3. ఇప్పుడు మీకు ఓ ఆడ గొంతు లేటెస్ట్ ఆఫ‌ర్స్ అవీ వినిపిస్తుంది. వెంట‌నే other services కోసం 2 నొక్కండి .  

4. మ‌ళ్లీ లేడీ వాయిస్ మీ మెయిన్ బ్యాల‌న్స్‌,ఎక్స్‌ప‌యిరీ డేట్ అన్నీ చెబుతుంది. వెంట‌నే 2 నొక్కండి.

5. ఐవీఆర్ చెప్పే సూచ‌న‌లేవీ విన‌కుండా నేరుగా 5 ప్రెస్ చేయండి.

6. ఇప్పుడు 9 నొక్కితే మీ కాల్ వెంట‌నే ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కి క‌నెక్ట్ అవుతుంది.
ఈ ట్రిక్‌ను వాడిన చాలామందికి 121 కి కాల్ చేస్తే 1నుంచి 2నిమిషాల్లోనే కాల్ క‌నెక్ట్ అయింది.
 

జన రంజకమైన వార్తలు