• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఓరియో 8.0 లుక్ మీ ఫోన్ లో కావాలా ? అయితే ఇలా చేయండి.

గత సంవత్సరం చివరి త్రైమాసికం లో గూగుల్ తన లేటెస్ట్ వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 8.0 ని లాంచ్ చేసింది. చాలా వరకూ స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఈ ఆపరేటింగ్ సిస్టం ను తమతమ ఫోన్ లలో ఉపయోగించడం మొదలుపెట్టేసారు. మీరు కూడా మీ ఫోన్ లలో ఈ ఓరియో లుక్ ను పొందాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదవండి. ఎంచక్కా మీ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓరియో లుక్ ను పొందండి.

సెట్టింగ్స్ లోనికి వెళ్ళండి.

అన్ నోన్ సోర్స్ లను సెర్చ్ చేయండి.అన్ నోన్ సోర్స్ లనుండి యాప్ లను డౌన్ లోడ్ చేసుకునే విధంగా మీ ఫోన్ ను అనుమతించండి.

- https://github.com/amirzaidi/Launcher3/releases ను బ్రౌజ్ చేయండి.

'Rootless Pixel Launcher 2.1' ను సెర్చ్ చేసి 'Launcher3-aosp-debug.apk' పై ట్యాప్ చేయండి.

apk ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఫైల్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత హోం స్క్రీన్ ను చేరుకునేందుకు హోం అనే బటన్ పై ట్యాప్ చేయండి.

ఈ లాంచర్ 3 యాప్ కోసం always అనే బటన్ పై ట్యాప్ చేయండి.

 సాధారణంగా ఇక్కడితో ఇది పూర్తి అవుతుంది. కానీ కొన్ని సార్లు మీరు మాన్యువల్ గా సెట్టింగ్ పేజి లోనికి ఎంటర్ అయ్యి లాంచర్ కోసం సెర్చ్ చేసి లాంచర్ 3 కి మార్చుకోవలిసి ఉంటుంది.

అంతే! ఎంచక్కా మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఓరియో లుక్ ను పొందవచ్చు. దీనిని అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం కూడా చాలా సులువు. సెట్టింగ్స్ లో ఉన్న యాప్స్ సెక్షన్ లోనికి వెళ్లి అన్ ఇన్ స్టాల్ చేసుకోవడమే.

 

జన రంజకమైన వార్తలు