• తాజా వార్తలు
  •  

స్కైప్ లవర్స్ కి ఈ ట్రిక్స్ తెలుసా?

వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసుకోవడానికీ ,ఇన్ స్టంట్ మెసేజింగ్ కూ స్కైప్ ఒక బెస్ట్ టూల్ . అయితే ఇవి మాత్రమే గాక ఇందులో ఇంకా అనేక రకాల బెస్ట్ ఫీచర్ లు ఉంటాయి. మీరు ఎవరితోనైతే చాట్ చేస్తున్నారో వారితో మీ స్క్రీన్ ను షేర్ చేసుకోవచ్చు. 25 మంది వ్యక్తులతో ఒకే సారి గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. ఇలా అనేకరకాల ఆకర్షణీయమైన ఫీచర్ లు స్కైప్ లో మరెన్నో ఉంటాయి. కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్ ను ఫాలో అవడం ద్వారా మీ స్కైప్ వాడకాన్ని మరింత ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. వాటి గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఎడిట్ సెంట్ మెసేజెస్

చాలా సార్లు మనం మెసేజ్ లు పంపేటపుడు అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటాము. అది సరిదిద్దే లోపే చూసుకోకుండా మెసేజ్ ను సెండ్ చేస్తాము. ఆ తర్వాత అయ్యో అనుకుంటాము. అయితే స్కైప్ లో ఇలా సెండ్ చేసిన మెసేజ్ లను కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు పంపిన మెసేజ్ దగ్గర కర్సర్ ఉంచి రైట్ క్లిక్ ఇవ్వడం ద్వారా కానీ అప్ యారో ద్వారా గానీ ఈ మెసేజ్ లను ఎడిట్ చేయవచ్చు. రైట్ క్లిక్ లేదా అప్ యారో చేసినపుడు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది.

మీ టైపింగ్ స్టేటస్ ను హైడ్ చేయండి

ఎవరైనా మీకు మెసేజ్ టైపు చేస్తుంటే అది మీకు తెలిసిపోతుంది, అలాగే మీరు టైపు చేస్తున్నా అవతలి వారికీ కూడా తెలిసిపోతుంది. ఇది మంచి ఫీచరే అయినప్పటికే చాలా మంది తమ టైపింగ్ స్టేటస్ ను హైడ్ చేయాలి అనుకుంటారు. అలంటి వారి కోసం ఈ ట్రిక్. టూల్స్>ఆప్షన్స్ > షో అడ్వాన్సు ఆప్షన్స్ >షో వెన్ ఐ యామ్ టైపింగ్ ద్వారా మీ టైపింగ్ స్టేటస్ ను హైడ్ చేసుకోవచ్చు.

మల్టిపుల్ చాట్ విండోస్

ఒకేసారి అనేకమందితో చాట్ చేసేటపుడు ఎడమవైపు నుండి వారి పేర్లు అన్నీ వరుసగా ఉండి ఒక్కోసారి చికాకును కలిగిస్తాయి. ఇలా పేర్లకు బదులు వారందరినీ వేరు వేరు విండో లలో సెట్ చేసుకోవచ్చు.  

మీ కాంటాక్ట్ లకు కస్టమ్ నేమ్స్ ను సెట్ చేసుకోండి

మనకు ఉండే కాంటాక్ట్ లలో ఒకే పేరుతో ఎక్కువమంది ఉన్నపుడు ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. వారి పేర్లకు ఏదైనా  అదనంగా యాడ్ చేయడం ద్వారా ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు. ఏదైనా కాంటాక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే రీ నేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనకు నచ్చిన పేరును టైపు చేసుకోవడమే. ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ఎడిట్ చేసే పేరు యూజర్ నేమ్ అయి ఉండకూడదు.

చాట్ హిస్టరీ ని బ్యాక్ అప్ తీసుకోండి.

మన pc ని ఫార్మాట్ చేసేటపుడు గానీ స్కైప్ ను అన్ ఇన్ స్టాల్ చేసేటపుడు కానీ చాట్ హిస్టరీ ని బ్యాక్ అప్ తీసుకోకపోతే కష్టం అవుతుంది.అయితే అదృష్టవశాత్తూ స్కైప్ బ్యాక్ అప్ ఫీచర్ ను కూడా అందిస్తుంది.ctrl+R ద్వారా రన్ విండో ను ఓపెన్ చేసి %appdata%\skype ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ  యూజర్ నేమ్ ను కనుగొని ఓపెన్ చేయండి. ఆ ఫోల్డర్ ను ఓపెన్ చేసిన తర్వాత  Main.db ని కనుగొనండి. మీ బ్యాక్ అప్ హిస్టరీ కనిపిస్తుంది.

కాంటాక్ట్ లను ఒక ఎకౌంటు నుండి మరొక ఎకౌంటు కు ట్రాన్స్ ఫర్ చేయండి

కొన్ని సార్లు మన పాత స్కైప్ ఐడి ని క్లోజ్ చేసి మరొక కొత్త స్కైప్ ఐడి ని క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడేం చేస్తాము? మన కాంటాక్ట్ లన్నీ కొత్త ఎకౌంటు కు యాడ్ చేసుకుంటాము. అంతమందికి ఒకేసారి రిక్వెస్ట్ పెట్టాలంటే కష్టం గా ఉంటుంది. మీ కాంటాక్ట్ లన్నీ కొత్త స్కైప్ ఎకౌంటు కు ట్రాన్స్ ఫర్ చేసుకునే ఫీచర్ ను స్కైప్ కలిగిఉంది.  కాంటాక్ట్స్>అడ్వాన్స్డ్ >బ్యాక్ అప్ కాంటాక్ట్స్ టు ఫైల్  ద్వారా మీ కాంటాక్ట్ లను బ్యాక్ అప్ తీసుకుని మీ కొత్త ఎకౌంటు లో రీస్టోర్ చేసుకోవడమే.

స్క్రీన్ షేరింగ్

ఫైల్స్ ను, ఇమేజెస్ ను స్కైప్ చాట్ లో సెండ్ చేయడం అనేది దాదాపు అన్ని మెసేజింగ్ సాఫ్ట్ వేర్ ల లోనూ ఉండేదే, అయితే స్కైప్ వీటికి భిన్నంగా స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కూడా అందిస్తుంది. మీరు ఎవరితోనైతే చాట్ చేస్తున్నారో వారితో మీ స్క్రీన్ ను షేర్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు షేర్ స్క్రీన్స్ అనే ట్యాబ్ పై క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ స్టార్ట్ పై క్లిక్ చేస్తే చాలు మీరు చాట్ చేస్తున్న పర్సన్ కు మీ స్క్రీన్ షేర్ చేయబడుతుంది.

 చాట్ కమాండ్ లను ఉపయోగించండి

స్కైప్ లో మీరు అనేక రకాల చాట్ కమాండ్ లను ఉపయోగించవచ్చు.

/kick [Skype Name] => గ్రూప్ లో నుండి ఎవరైనా మెంబర్ ను తీసివేయడానికి ఈ కమాండ్ ఉపయోగపడుతుంది.

/showmember => ఒకే గ్రూప్ లేదా ఒకే చాట్ లో ఉన్న మెంబర్ ల యొక్క పేర్లను ఇది చూపిస్తుoది.

/showplaces =>  మీరు లాగ్ ఇన్ అయిన డివైస్ లను ఇది చూపిస్తుంది.

/info =>  గ్రూప్ లో ఉన్న మెంబర్ లిస్టు ను ఇది చూపిస్తుంది.

/leave =>  ఏదైనా గ్రూప్ లో నుండి బయటకు రావడానికి ఈ కమాండ్ ఉపయోగపడుతుంది.

 ఎమోటికన్స్ ను ఉపయోగించండి.

స్కైప్ లో డిఫాల్ట్ గా అనేక ఎమోటికన్స్  ఉంటాయి. ఇవి గాక కొన్ని హిడెన్ ఎమోటికాన్స్ కూడా ఉంటాయి. స్కైప్ యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో వీటి లిస్టు ను చూడవచ్చు.

నోటిఫికేషన్ లకు కీ వర్డ్స్ సెట్ చేయండి

ప్రతీ ఇన్ కమింగ్ మెసేజ్ కీ నోటిఫికేషన్ లు రావడం మనకు ఇష్టం ఉండకపోవచ్చు. గ్రూప్ చాట్ లో మీ పేరు ప్రస్తావించబడినపుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వచ్చేలా మీరు సెట్ చేసుకోవచ్చు. కాన్వర్జేషన్స్ > నోటిఫికేషన్ సెట్టింగ్స్ > నోటిఫై మి ఓన్లీ ఇఫ్ దీజ్ వర్స్ ఆర్ మెన్షన్ ద్వారా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ను టైపు చేస్తే చాట్ లో ఆ పదాలు వచ్చినపుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

 

జన రంజకమైన వార్తలు