• తాజా వార్తలు
  •  

టెలిగ్రామ్ మెసెంజ‌ర్‌లో త‌ప్ప‌క ట్ర‌య్ చేయాల్సిన ట్రిక్స్ ఇవే

భార‌త్‌లో ఎక్కువ‌మంది వాడే మెసెంజ‌ర్ వాట్స‌ప్‌. ఈ వ‌రుస‌లో ఇప్పుడు టెలిగ్రామ్ కూడా చేరింది. వాట్స‌ప్ వాడుతున్నా కూడా టెలిగ్రామ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు. అయితే చాలామందికి దీనిలో ఉన్న అద్భుత‌మైన ఫీచ‌ర్ల గురించి తెలియ‌దు. అస‌లు టెలిగ్రామ్‌ను వాడుకునే వాళ్లు ఉంటారు కానీ దాన్ని లోతు అధ్య‌య‌నం చేయ‌రు. ఏదో పైన పైన వాడేస్తుంటారు. అయితే టెలిగ్రామ్‌ను స‌మ‌ర్థంగా వాడుకోవ‌డానికి కొన్ని కూల్ ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

చాట్‌ను లాక్ చేయ‌డం
ప్రైవ‌సీ గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెందేవాళ్లు ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ స‌ర్వీసు వ‌ల్ల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. ఇదో బిల్ట్ ఇన్ ఫీచ‌ర్‌.ఇది చాట్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లాక్ చేస్తుంది. దీనికో పాస్‌కోడ్ ఉంటుంది. మీ చాటింగ్‌ను అనాథ‌రైజ్డ్  యాక్సెస్ చేయ‌కుండా ఉండ‌డం కోసం చాట్‌ను లాక్ చేసుకోవ‌చ్చు.

మ‌ల్లీపుల్ ప్రొఫైల్ ఫొటోలు
టెలిగ్రామ్‌లో ఉన్న మ‌రో ఆప్ష‌న్ మ‌ల్లిపుల్ ఫొటోలు అప్‌లోడ్ చేయ‌డం. దీని కోసం సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి కెమెరా ఆప్ష‌న్ ట్యాప్ చేసి ఫొటో తీసుకోవాలి. మ‌ళ్లీ ఇదే ప్రాసెస్ చేయ‌డం ద్వారా రెండో ఫొటో కూడా అప్‌లోడ్ చేయాలి. ఇందులో విశేషం ఏమిటంటే మొద‌టి ఫొటోను రిమూవ్ చేయ‌కుండానే రెండో ఫొటోను అప్‌లో్డ్ చేయ‌డం. 

ఒక‌టికి మించి అకౌంట్లు
మ‌ల్లీపుల్ థీమ్స్ మాత్ర‌మే కాదు మ‌ల్టీపుల్ అకౌంట్లు కూడా వాడే అవ‌కాశాన్నిఇస్తోంది టెలిగ్రామ్‌.  మీరు ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా మూడు అకౌంట్లు యాడ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. మూడు అకౌంట్లు మూడు ఫోన్ నంబర్ల‌ను వాడుకోవ‌చ్చు. వ‌ర్క్ లేదా ప‌ర్స‌న‌ల్ చాట్స్ విడిగా ఉండాల‌ని భావించేవాళ్ల‌కు ఇదో మంచి ఫీచ‌ర్‌. 

మ్యూట్ మెసేజ్‌లు పంప‌డం
మ్యూట్ మెసేజ్‌ల‌ను పంప‌డానికి టెలిగ్రామ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. సైలెంట్‌గా మెసేజ్‌ల‌ను పంప‌డం కోసం ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కొంత‌మందికి అర్జెంట్‌గా మెసేజ్ పంపాలి కానీ ఆ మెసేజ్ వారిని డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌దు అనుకునేవాళ్ల‌కు ఈ ఫీచ‌ర్ చాలా ప‌నికొస్తుంది. ఈ మెసేజ్ పంపినా ఎలాంటి సౌండ్ లేకుండానే అవ‌త‌లి వాళ్ల డివైజ్‌లోకి వెళ్లిపోతుంది. 

ఫొటో ఎడిటింగ్‌
అమ్మాయిల‌కు బాగా న‌చ్చే ఫీచ‌ర్ ఇది. ఇన్‌బిల్ట్‌గా ఫొటో ఎడిటింగ్ యాప్‌ను అందిస్తోంది టెలిగ్రామ్‌. అమేజింగ్, క్వాలిటీ ఫొటోల కోసం ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంటే మ‌నం ఫొటోను ఎడిటింగ్ చేయ‌డానికి మాత్ర‌మే కాదు.. క్రాప్ చేయ‌డానికి, క్యాప్ష‌న్ పెట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

జన రంజకమైన వార్తలు