• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ చేసేట‌ప్పుడు చేయ‌కూడ‌ని ప‌నులివే..

స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్... రోజూ మ‌న‌కు నిత్యకృత్యం. కొంత‌మంది రాత్రే ఫోన్‌ను ఛార్జ్ పెట్టేసి ప‌డుకుంటే... మ‌రికొంద‌రు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఛార్జింగ్  చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అస్త‌మానం ఛార్జింగ్ అయిపోతూ ఒక్కోసారి ఈ ఛార్జింగ్ పెద్ద త‌లనొప్పిగా కూడా మారుతుంది.  అయినా కూడా చాలామంది ఛార్జ‌ర్ల‌ను వెంట‌బెట్టుకుని మ‌రీ ఛార్జింగ్ చేసుకుంటారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేసేట‌ప్పుడు కొన్ని విష‌యాలు గుర్తుంచుకోవాలి. ఛార్జింగ్ చేసే స‌మ‌యంలో కొన్ని నియ‌మాల‌ను త‌ప్ప‌క పాటించాలి.. అవేంటో చూద్దాం..

1.స్మార్ట్‌ఫోన్ ప‌ని చేయాలంటే బ్యాట‌రీ చాలా కీల‌కం. అందుకే బ్యాట‌రీని  ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాట‌రీ లైఫ్ అయిపోయినా చాలామంది వాడుతుంటారు. ఈ నిర్ల‌క్ష్యం ప్ర‌మాదాల‌కు దారి తీయ‌చ్చు. ఎందుకంటే మందుల‌కు ఎక్స‌పైరీ డేట్ ఉన్న‌ట్లే బ్యాట‌రీల‌కు కూడా ఉంటుంది. మ‌నం ఈ డేట్ గ‌మ‌నించాలి

2. మీ సొంత  ఛార్జ‌ర్‌తోనే ఫోన్‌ను వీలైనంత ఎక్కువ‌గా ఛార్జ్ చేయాలి. ఎందుకంటే ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌కు యూనివ‌ర్స‌ల్ ఛార్జింగ్ ఇంట‌ర్‌ఫేస్ ఉంటుంది.  మీ ఛార్జ‌ర్ మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌కు మ్యాచ్ కాక‌పోతే ఇబ్బందులు త‌లెత్తుతాయి. బ్యాట‌రీ ఫెర్మార్‌మెన్స్ మీద ప్ర‌భావం ప‌డుతుంది. ఓవ‌రాల్ లైఫ్ స్పాన్ త‌గ్గుతుంది. 

3. స్మార్ట్‌ఫోన్ల‌ను చీఫ్ ఛార్జ‌ర్ల‌తో ఉప‌యోగించ‌కూడ‌దు. ఎందుకంటే త‌క్కువ ధ‌ర‌తో దొరికే ఛార్జ‌ర్ల‌తో ఎలాంటి సేఫ్టీ మెకానిజం ఉండ‌దు. ఇవి ప‌వ‌ర్ హెచ్చుత‌గ్గుల‌ను త‌ట్టుకోలేవు. అడాప్ట‌ర్ ఫెయిల్ అయితే మీ బ్యాట‌రీ శాశ్వ‌తంగా పాడ‌య్యే ప్ర‌మాదం ఉంది.

4. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ ప్రొటెక్టివ్ కేస్‌ను తీసేసి చేయ‌డం ఉత్త‌మం. వేడెక్క‌డం బ్యాట‌రీ స‌హ‌జ ల‌క్ష‌ణం. కేస్ అడ్డుగా ఉండ‌డం వ‌ల్ల ఛార్జింగ్ ప్ర‌క్రియ‌కు అడ్డుగా మారే అవ‌కాశం ఉంది. అందుకే కేస్ తీసేసి ఒక మెత్త‌టి క్లాత్ మీద ఫోన్ వెల్లికిలా పెట్టి ఛార్జ్ చేస్తే ఇంకా మంచింది.

5. వేగంగా ఛార్జ్ అయ్యే ఛార్జ‌ర్ల‌ను వాడ‌డం ఫోన్‌కు, బ్యాట‌రీకి మంచింది కాదు. ఇది బ్యాట‌రీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఒక్కోసారి బ్యాట‌రీకి ఎక్క‌వ ఓల్టేజ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. 

6. రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టొద్దు.  దీని వ‌ల్ల ఫోన్ ఓవ‌ర్‌హీట్ అయ్యి పేలే అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాదు బ్యాట‌రీ ఫెర్మార్‌మెన్స్ మీద కూడా ఇది ప్ర‌భావం చూపిస్తుంది. 

7. థ‌ర్డ్ పార్టీ బ్యాట‌రీ యాప్స్ వాడ‌డం కూడా మంచిది కాదు.  చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ మెమెరీ ఆక్ర‌మించ‌డ‌మే కాక‌.. నెగిటివ్‌గా వ‌ర్క్ చేసే అవ‌కాశాలున్నాయి.  అందుకే రిక‌మండేడ్ బ్యాట‌రీ యాప్‌ల‌నే వాడ‌డం మంచిది.

8. మీ బ్యాట‌రీని క‌నీసం 80 శాతం ఛార్జింగ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాలి. దీని వ‌ల్ల ఎక్కువ సేపు మ‌న‌కు బ్యాట‌రీ నిల్వ ఉంటుంది. లేక‌పోతే వెంట‌నే అయిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. దీనికి కార‌ణం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లే.

9. సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌రుచుగా రీచార్జ్‌లు చేయ‌డం మంచిది కాదు. 20 శాతం వ‌ర‌కు  బ్యాట‌రీ అయిపోతేనే ఛార్జ్ చేయ‌డం మేలు.  అన‌వ‌స‌రంగా ఛార్జ్ చేయ‌డం వ‌ల్ల మీ బ్యాట‌రీ లైఫ్‌స్పాన్ త‌గ్గిపోతుంది. 

10. ప‌వ‌ర్ బ్యాంకులు ఎక్కువ‌గా వాడాలి. పవ‌ర్ బ్యాంకుల వ‌ల్ల వోల్టేజ్‌లో హెచ్చు త‌గ్గులు, షార్ట్ స‌ర్కూట్, ఓవ‌ర్ ప‌వ‌ర్‌ల నుంచి బ్యాట‌రీని సేవ్ చేసుకోవ‌చ్చు. 

11 మీ హ్యాండ్‌సెట్ ప‌వ‌ర్ బ్యాంక్‌తో క‌నెక్ట్ అయి ఉన్న‌పుడు ఉప‌యోగించ‌కూడ‌దు.  దీని వ‌ల్ల ఇంట‌ర్నెల్ టెంపరేచ‌ర్ పెరిగిపోయి.. బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది.

జన రంజకమైన వార్తలు