• తాజా వార్తలు
  •  

ఫోన్ బ్యాట‌రీ లైఫ్‌ను బూస్ట‌ప్ చేయ‌డానికి నాలుగు బెస్ట్ టిప్స్

స్మార్ట్‌ఫోన్ ఎంత బాగున్నా, ఎన్ని ఫీచ‌ర్లున్నా అన్నింటికంటే ముందు చూసుకోవాల్సింది బ్యాట‌రీ బ్యాక‌ప్‌.  ఫోన్ పెర్‌ఫార్మెన్స్  ఎంత సూప‌ర్ అయినా బ్యాట‌రీ నిల‌బ‌డ‌క‌పోతే  గంట‌కోసారి ఫోన్‌ను ఛార్జ‌ర్‌కు త‌గిలించలేం క‌దా.  అందుకే ఫోన్ బ్యాట‌రీ లైఫ్‌ను పెంచ‌డానికి ఈ నాలుగు టిప్స్ మీకోసం. .
1. లిథియం అయాన్ బ్యాట‌రీ ఎలా ప‌ని చేస్తుంది? 
ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు లిథియం అయాన్ బ్యాట‌రీల‌తోనే ప‌ని చేస్తున్నాయి.  బ్యాట‌రీ సైజ్‌ను బ‌ట్టే దాని బ్యాక‌ప్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్ర‌తి బ్యాట‌రీ చిన్న చిన్న యూనిట్స్ (సెల్స్‌)తో రూపొందిస్తారు.  ప్ర‌తి సెల్ 3 నుంచి 4 వోల్ట్‌ల ప‌వ‌ర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 16 వోల్ట్‌ల  బ్యాట‌రీ కావాలంటే అందులో క‌నీసం నాలుగు సెల్స్ ఉండాలి. అందుకే బ్యాట‌రీ ఎక్కువ బ్యాక‌ప్ ఇవ్వాలంటే దాని సైజ్ కూడా పెరుగుతుంది.  ప్ర‌తి బ్యాట‌రీ పోజిటివ్‌గా ఛార్జ్ అయిన అయాన్స్‌ను ప్రొడ్యూస చేస్తుంది. ఇవి ఎల‌క్ట్రాన్స్‌ను వ్య‌తిరేక దిశ‌లో నెట్ట‌డంతో ప‌వ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. ఈ అయాన్స్ ప్రొడ్యూస్ చేసే కెమిక‌ల్ రియాక్ష‌న్ ఎండ్ అయితే బ్యాట‌రీ మొత్తం ఖాళీ అయిపోయిన‌ట్లు. అంటే మ‌ళ్లీ ఛార్జింగ్ చేయాలి. అయాన్స్ అన్నీ ఛార్జింగ్ అయి ఇక ఛార్జి చేయ‌డానికి అయాన్స్ లేక‌పోతే మ‌నం ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా ఉప‌యోగం ఉండ‌దు. అందుకే ఎంత సేపు ఛార్జింగ్ అవ‌స‌ర‌మో అంత సేపు పెడితే చాలు. అంతేగానీ టైం ఉంది క‌దాని ఛార్జ‌ర్‌కు ఫోన్‌ను త‌గిలించాల్సిన ప‌ని లేదు. 
2. ప‌వర్‌ఫుల్ ఛార్జ‌ర్ వాడండి 
ఎంత ప‌వ‌ర్‌ఫుల్ ఛార్జ‌ర్ వాడితే మీ బ్యాట‌రీ అంత స్పీడ్‌గా చార్జ్ అవుతుంది.  2.4 యాంప్స్ లేదా 5 వోల్ట్స్ ఛార్జ‌ర్ మ‌న డివైస్‌ల‌న్నింటికీ స‌రిప‌డే చార్జ‌ర్‌. త‌క్కువ ఎంఏహెచ్ బ్యాట‌రీని 5 వోల్ట్స్ ఛార్జ‌ర్‌తో ఛార్జ్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు. 
3. మొత్తం అయిపోనివ్వండి
 మీ బ్యాట‌రీని పూర్తిగా వాడుకోండి. దాదాపు సున్నాకు వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేసి అప్పుడు ఫుల్‌గా 100% వ‌ర‌కు ఛార్జి చేయండి. ఇది ఉద్యోగ‌, వ్యాపారాల కోసం వెళ్లేవారికి కుద‌ర‌క‌పోవ‌చ్చు. కానీ ఇలా చేస్తే బ్యాట‌రీ లైప్ చాలా పెరుగుతుంది. అంతేకాదు కొద్దికొద్దిగా కొన్ని కొన్ని నిముషాలు ఛార్జింగ్ పెట్టి తీసేస్తే ఫోన్ బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతుంద‌ట‌. ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. 
4. బ్యాట‌రీ ఎందుకు డ్ర‌యిన‌వుతుందో గుర్తించండి 
మీ ఫోన్ త్వ‌రత్వర‌గా ఛార్జింగ్ అయిపోతుంటే కార‌ణాలు వెత‌కండి. మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ట్యాబ్‌లోకి వెళ్లి బ్యాట‌రీ మెనూ సెలెక్ట్ చేయండి. ఏ యాప్ ఎంత బ్యాట‌రీ వినియోగించుకుంటుందో తెలుస్తుంది. అలాంటి వాటిలో అన‌వ‌స‌ర‌మైన‌వి ఏమైనా ఉంటే అన్ఇన్‌స్టాల్ చేసేయండి. ఏదైనా డౌన్‌లోడ్ చేయ‌బోతే మ‌ధ్య‌లో ఆగిపోయింది. త‌ర్వాత దాన్ని మ‌ర్చిపోయినా అది ప‌దే ప‌దే రీస్టార్ట్ అవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటుంది. అప్పుడు బ్యాట‌రీ అన‌వస‌రంగా ఖ‌ర్చ‌వుతుంది.  ఇలాంటి వాటిని డీలెట్ చేసేయండి. స్క్రీన్ బ్రైట్‌నెస్ త‌గ్గించ‌డం,  కీ టోన్స్‌, ట‌చ్ సౌండ్స్‌ను డిజేబుల్ చేయ‌డం ద్వారా కూడా బ్యాటరీ వాడ‌కం త‌గ్గించ‌వ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు