• తాజా వార్తలు
  •  

ఏ ఫోన్ ఐనా స్లోగా ఛార్జింగ్ కావ‌డానికి ఈ ఐదు కార‌ణాలు మాత్రమే ..

స్మార్ట్‌ఫోన్ అన‌గానే మన‌కు గుర్తొచ్చేది ఛార్జింగే. మ‌నం ఎక్కువ‌సేపు వాడ‌క‌పోయినా ఛార్జింగ్ మాత్రం నిల‌వ‌దు. కార‌ణం ఇంట‌ర్నెట్‌. 24 గంట‌లు ఇంట‌ర్నెట్ ఆన్‌లో ఉండ‌డం వ‌ల్ల ఛార్జింగ్ కూడా వేగంగా హ‌రించుకుపోతుంది.  ఎంత‌సేపు ఛార్జింగ్ పెట్టినా కూడా కాసేప‌టికే అది అయిపోతుంది. పోనీ ఛార్జింగ్ పెడ‌దామ‌ని అనుకుంటే ఫోన్ వేగంగా ఛార్జ్ ఎక్క‌దు. మ‌రి స్మార్ట్‌ఫోన్ స్లోగా ఛార్జ్ కావ‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా?

నాసిర‌కం యాక్సెస‌రీస్‌
మ‌నం స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయ‌డానికి వాడే యాక్సెస‌రీస్ నాణ్య‌మైన‌వి కాక‌పోవ‌డం వల్లే ఛార్జింగ్ స్లో అయిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పొచ్చు. అంతేకాదు మీ ఛార్జింగ్ కార్డ్ స‌రిగా లేక‌పోవ‌డం, వీక్ అడాప్ట‌ర్‌, వీక్ ప‌వ‌ర్ సోర్స్ ఉండ‌డం వ‌ల్ల కూడా ఛార్జింగ్ చాలా నెమ్మ‌దిగా అవుతుంది. ముఖ్యంగా మ‌న ఇళ్ల‌లో ఒక డివైజ్‌ను ఎక్కువ‌మంది ఉప‌యోగించుకుంటారు. ఇలాంటి కేబుల్స్ అస్త‌మానం వంగిపోవ‌డం, మ‌ధ్య‌లోనే డ్యామేజ్ కావ‌డం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. 

పోర్ట్ వ‌ల్ల కూడా..
ఛార్జింగ్ స‌రిగా కాక‌పోవ‌డానికి కార‌ణం మీ కేబులే. అందులోనూ మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ స‌రిగా లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన స‌మస్య‌. అంటే మ‌న‌కు తెలియ‌కుండానే అది డ్యామేజ్ కావ‌డమే ఇక్కడ స‌మ‌స్య‌. అందుకే మీ డివైజ్ ఎక్కువ‌సేపు ఛార్జింగ్ కావ‌డానికి కార‌ణం ఇదే. ఒక్కోసారి మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో ఏదైనా అబ్జెక్ట్ (డ‌స్ట్‌, లింట్‌) ఇరుక్కోవ‌డం వ‌ల్ల కూడా ప్రాబ్ల‌మ్ త‌లెత్తుతుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు
ఫోన్లో మ‌న‌కు తెలియ‌కుండానే కొన్న యాప్‌లు ప‌ని చేస్తూ ఉంటాయి. అలంటి యాప్‌లే మ‌న ఛార్జింగ్ వేగాన్ని అడ్డుకుంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్నింగ్ అయ్యే యాప్‌ల‌ను క‌నుగోవ‌డానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. దీని కోసం సెట్టింగ్స్‌లో బ్యాట‌రీ మెనూలోకి వెళ్లాలి. అక్క‌డ మీకు మీ బ్యాట‌రీని ఎక్కువ‌గా ఉప‌యోగించుకుంటున్న యాప్‌లు క‌నిపిస్తాయి. అందులో అవ‌స‌రం లేని యాప్‌లు తీసేయాలి. 

పాత బ్యాట‌రీ
చాలామంది ఏళ్ల త‌ర‌బ‌డి ఒకే బ్యాట‌రీని వాడుతుంటారు. ఛార్జింగ్ స్లోగా కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఇదొక‌టి. బ్యాట‌రీకి కొంత జీవిత కాలం ఉంటుంది. దాన్ని దాటితే వాడితే అది ఎక్కువ‌సేపు ఛార్జింగ్ అవుతుంది. అంటే గంట ఛార్జింగ్ పెట్టినా త‌క్కువ పాయింట్లే ఎక్కుతుంది. అందుకే అలాంటి బ్యాట‌రీల‌ను వీలైనంత త్వ‌ర‌గా మార్చేయాలి. ఇలాంటి బ్యాట‌రీలు పేలే ప్ర‌మాదాలు కూడా ఉంటాయి. అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాలి. 

మీరే స‌మ‌స్య‌!
అదేంటి అంటారా? అవును ఛార్జింగ్ స్లోగా ఎక్క‌డానికి మ‌నం కూడా కార‌ణ‌మే. అంటే ఛార్జింగ్ పెట్టే స‌మ‌యంలోనూ మ‌నం ఫోన్‌ను ఉప‌యోగిస్తూనే ఉంటాం. దీని వ‌ల్ల ఫుల్ ఛార్జింగ్ కావ‌డానికి డివైజ్ ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. అందుకే ఛార్జింగ్ పెట్టిన‌ప్పుడు వీలైనంత మ‌నం ఫోన్ వాడ‌కుండా ఉండాలి. 

జన రంజకమైన వార్తలు