• తాజా వార్తలు

రీచార్జి, బిల్ పే చేసేటప్పుడు డబ్బు ఆదా చేయడానికి 5 మార్గాలు

ఫోన్ బిల్లయినా, డీటీహెచ్ బిల్లయినా, కరెంటు బిల్లయినా, రీఛార్జయినా, మూవీ టిక్కెట్లయినా ఏదైనా సరే ఇప్పుడు దాదాపు అందరూ ఆన్ లైన్లోనే చెల్లింపులు చేస్తున్నారు. మరి ఇలాంటి చెల్లింపుల సమయంలో ఎంతోకొంత డబ్బు ఆదా చేయడానికి ఎలాంటి మార్గాలున్నాయో చూడండి.
మొబైల్ బిల్లు.. టెలికాం ఆపరేటర్ వెబ్ సైట్ లేదా యాప్ నుంచి..
టెలికాం ఆపరేటర్ల వెబ్ సైట్లు, యాప్స్ నుంచి బిల్లు పేచేసేటప్పుడు, రీచార్జి చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ రూపంలో కొంత డబ్బు వెనక్కు ఇస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ ఇలా 5 శాతం క్యాష్ బ్యాక్ గా రూ.25 వరకు ఇస్తోంది. ఐడియా కూడా 5 శాతం టాక్ టైం అదనంగా ఇస్తోంది.
ఆన్ లైన్ రీచార్జి వెబ్ సైట్స్, యాప్ నుంచి..
పేటీఎం, ఫ్రీఛార్జి, మొబిక్విక్ వంటి ఆన్ లైన్ రీచార్జి ఫ్లాట్ ఫాంస్ కూడా క్యాష్ బ్యాక్ లు ఇస్తున్నాయి. పేటీఎం, ఫ్రీ చార్జి వంటివి రూ.50 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. మొబిక్విక్ కూడా అందులో తొలిసారి రీచార్జి చేసిన వారికి కొంత మొత్తం క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తోంది. అయితే.. ఎయిర్ టెల్ రీచార్జిలు, బిల్లులపై ఆఫర్ లేదు.
క్యాష్ బ్యాక్ వెబ్ సైట్స్
కొన్ని వెబ్ సైట్ల వేరే గా క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తాయి. యూజర్లు వాటి నుంచి పేమెంట్ వెబ్ సైట్లోకి వెళ్లి పేమెంటు చేసుకోవచ్చు. దీనివల్ల కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది.
యూఎస్ ఎస్ డీ ద్వారా
టెలికాం ఆపరేటర్లు ఇచ్చే ఆఫర్ తో యూఎస్ ఎస్ డీ ద్వారా రీచార్జి చేస్తే కొందరు ఫుల్ టాక్ టైం వస్తుంది. ఒక్కోసారి ఫుల్ టాక్ టైం కంటే ఎక్కువ కూడా వస్తుంది. డాటా విషయంలోనూ అంతే.
క్రెడిట్, డెబిట్ కార్డు ఆఫర్లు
ప్రత్యేకించి కొన్ని డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులపై 5 శాతం, 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక్కోసారి ఇది వెంటనే తగ్గింపు వర్తిస్తుంది. ఒక్కోసారి మూడు నెలల తరువాత అదే కార్డులో ఆ అమౌంట్ చేరుతుంది.

జన రంజకమైన వార్తలు