• తాజా వార్తలు
  •  

ఐ ఫోన్ టెన్‌లో మాత్ర‌మే ఉండే 5 సూప‌ర్ ఫీచ‌ర్లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందే ట్రిక్స్ తెలుసా?

ఐ ఫోన్ టెన్త్ యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా లాంచ్ చేసిన ఐ ఫోన్ టెన్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.  ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌, ఇన్‌బిల్ట్ ఏఆర్ స‌పోర్ట్‌, యానిమోజీస్ ఇవ‌న్నీ ఐ ఫోన్ టెన్ ప్ర‌త్యేక‌త‌లు. కానీ ధ‌ర చూస్తే ల‌క్ష‌పైనే. అంత పెట్టి ఐ ఫోన్ టెన్ కొన‌లేమ‌ని నిరాశ‌ప‌డేవాళ్ల‌కు ఓ గుడ్ న్యూస్‌. ఐ ఫోన్ టెన్‌లో ఉన్న టాప్ 5 ఫీచ‌ర్ల‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే..
యానిమోజీస్ Animojis
ఐఫోన్ టెన్‌లో యాపిల్ ఆనిమోజీస్ స్పెష‌ల్‌. మీరు ఫొటో తీస్తే దాన్ని మంకీ, పిగ్‌, ఇలా ర‌క‌ర‌కాల జంతువుల ఫేస్‌ల‌తో క‌లిపే యానిమోజీస్ ఐ ఫోన్ టెన్ క్రియేట్ చేస్తుది. అదీ లైవ్‌గా.  Animoji for phone X +Live Emoji Face Swap Emoticon అనే ఆండ్రాయిడ్ యాప్‌తో కూడా ఈ ఫీచ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. అయితే యానిమోజీ క్వాలిటీ కొద్ది త‌క్కువ‌గా ఉంటుంది.  
ఆగ్యుమెంటెడ్ రియాల్టీ (AR)
ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఇన్‌బిల్ట్‌గా ఉన్న అతికొద్ది స్మార్ట్‌ఫోన్ల‌లో ఐఫోన్ టెన్ ఒక‌టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేష‌న్ రెండింటికీ ప‌నికొచ్చే ఈ ఫీచ‌ర్‌ను   Holo – Holograms for Videos in Augmented Reality  అనే ఆండ్రాయిడ్ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా పొంద‌వ‌చ్చు. దీనిలో చాలా ఏఆర్ క్యారెక్ట‌ర్స్ క‌లెక్ష‌న్ ఉంది.  రెజ్ల‌ర్‌, టైగ‌ర్‌, స్పైడ‌ర్‌మ్యాన్‌లాంటి ఏఆర్ క్యారెక్ట‌ర్స్ ఇందులో చాలా ఉన్నాయి.
ఫేస్ అన్‌లాక్ (Face Unlock)
ఇక పోతే యాపిల్ త‌న ఐఫోన్ టెన్‌కు అత్యంత కీల‌క‌మైన ఫీచ‌ర్‌గా చెప్పుకొంటున్న ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌. ఫింగ్‌ప్రింట్ స్కాన‌ర్‌, ప్యాట్ర‌న్ కాకుండా యూజ‌ర్ ఫేస్ రీడింగ్ చేసి ఫోన్ అన్‌లాక్ చేయ‌డం ఈ ఫీచ‌ర్ గొప్ప‌త‌నం.  ఫేస్ ఐడీ టెక్నాల‌జీని ఉప‌యోగించుకునే మ‌ల్టిపుల్ సెన్స‌ర్ల‌తో ఇది ప‌ని చేస్తుంది.  ఆండ్రాయిడ్ లాలీపాప్ నాటి నుంచే ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో కూడా ఈ ఫీచ‌ర్ ఉంది.  మీ ఫోన్  Security settings లోకి వెళ్లి Smart lock లోకి వెళితే ట్ర‌స్టెడ్ ఫేస్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దీన్ని అనేబుల్ చేసుకుంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఫేస్ రీడ్ చేసి ఫోన్ అన్‌లాక్ చేస్తుంది.  
పోట్రెయిట్ లైటింగ్  (Portrait Lighting)
ఐఫోన్ 8 ప్ల‌స్‌, టెన్‌ల్లో కెమెరాలో పోట్రెయిట్ లైటింగ్ స్టూడియో ఎఫెక్ట్‌ను తీసుకొచ్చింది యాపిల్‌.  ఐఫోన్‌లో కెమెరాలు బెస్ట్ ఇన్ క్లాస్‌లో ఉంటాయి కాబ‌ట్టి ఇన్‌స్టంట్‌గా, లైవ్ క్వాలిటీతో వ‌స్తుంది.  ప్లే స్టోర్‌లోSnapseed  అనే ఫొటో ఎడిటింగ‌హ్ యాప్ ఉంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా పోట్రెయిట్ లైటింగ్‌, డాడ్జ్ అండ్ బ‌ర్న్ బ్ర‌షెస్ మీ ఇమేజ్‌కు మంచి ఇంటెన్సిటీని ఇస్తాయి.  
స్వైప్ టూ హోం గెస్చ‌ర్ (Swipe to home gesture)
ఐఫోన్ టెన్‌లో హోం బ‌ట‌న్ లేదు. హోం స్క్రీన్‌ను పైకి స్వైప్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. రైట్‌కు స్వైప్ చేస్తే రీసెంట్ యాప్స్ మెనూలోకి ఎంట‌ర్ అవుతాం.  All in one Gestures పేరుతో ఉన్న ఆండ్రాయిడ్ యాప్‌తో ఈ ఫీచ‌ర్స్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈజీగా పొంద‌వ‌చ్చు.   ఈయాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీ ఫోన్ నావిగేష‌న్ బ‌ట‌న్స్‌ను హైడ్ కూడా చేయొచ్చు. 
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు