ఆండ్రాయిడ్ ఫోన్.. మనం ప్రతి రోజూ ఎక్కువగా ఉపయోగించే సాధనం. కానీ దీని బాగోగులు మాత్రం ఎక్కువగా పట్టించుకోం. వాడతాం..వదిలేస్తాం. ఆరంభంలో బాగానే ఉన్నా ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫోన్లు మొరాయిస్తాయి. డిస్ప్లేలు పోతాయి. లేదా ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా డిస్ప్లే ప్రాబ్లమ్స్‌ను తరుచూ ఎదుర్కొంటుంటా. మరి ఆండ్రాయిడ్ ఫోన్లో డిస్ప్లే మెరుగుపడటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటో చూద్దామా..
ఎస్ఆర్జీబీ మోడ్
ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ దాదాపు ఆర్జీబీ అనేబుల్డ్ స్క్రీన్స్గానే ఉంటున్నాయి. అంటే మన ఫోన్‌కు సంబంధించిన డిస్ప్లేలో రెడ్, గ్రీన్, బ్లూ మిక్స్తోనే కలిసి ఉంటాయి. అయితే దీని వల్ల కొన్ని రోజులకు డిస్ప్లే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే అదృష్టం ఏమిటంటే ప్రస్తుతం వస్తున్న ఫోన్లలో ఎస్ఆర్జీబీ ఆప్షన్ ఉంటుంది. దీనికి స్విచ్ అయితే చాలు. పిక్చర్ కలర్ మోడ్ ఆప్షన్‌లోకి వెళ్లి స్టాండర్డ్ ట్యునింగ్ను సెలక్ట్ చేయాలి.
నైట్ మోడ్
మనం రాత్రి వేళ్లలోనూ ఒక విధమైన బ్రైట్నెస్, కాంట్రాస్ట్‌తో ఫోన్‌ను ఉపయోగిస్తాం. ఇది రాత్రివేళల్లో మన కళ్లకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇలాంటప్పుడు మీరు నైట్ మోడ్ ఆప్షన్‌ను ఉపయోగించాలి. దీని వల్ల బ్లూ లైట్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. డిస్ప్లే సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఓఈఎంలో ఈ ఆప్షన్ లేకపోతే ట్విల్ట్ అనే యాప్ప్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యాప్స్‌ను ఉపయోగించడంలో ఆరంభంలో ఇబ్బంది ఉన్నా.. ఒకటి రెండు నిమిషాల్లో సర్దుకోవచ్చు.
డిస్ ప్లే సైజు
ఒకేసారి ఎక్కువ కంటెంట్‌ను మీ స్క్రీన్‌లో చూడాలని అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ డెన్సిటీని ఛేంజ్ చేయండి. ఇది ఫోన్ స్క్రీన్ సైజును మీ అవసరాలకు తగ్గట్టుగా అడ్జెస్ట్ చేస్తుంది. అలాగే మీ వాట్సప్ చాట్స్‌ను మరిన్నిరోస్లో చూడాలన్నా కూడా ఇదే టెక్నిక్ వాడాలి. ఇది డిస్ ప్లే సైజు లేదా డీపీఐ ఆప్షన్లో ఉంటుంది.
స్క్రీన్ డిమర్
మీ ఫోన్లో డిస్ప్లే బ్రైట్నెస్ డిమ్ చేయడానికి హద్దు ఉంటుంది. అయితే స్క్రీన్ డిమర్ అనే యాప్ ద్వారా మీరు అనుకున్నంత డిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక అదనపు లేయర్‌ను యాడ్ చేయడం ద్వారా పని చేస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోడిఫై చేసుకోవచ్చు. నాచురల్‌గా ఉండడం కోసం బ్లాక్ కలర్‌ను ఎంచుకోవడం మంచింది. పీఆర్వో వెర్షన్ కూడా ఒకే.
రౌండెడ్ కార్నర్స్
చాలా స్మార్ట్ఫోన్ల చాసిస్ రౌండ్‌గా ఉంటాయి. స్క్రీన్లు రెక్టాంగ్యులర్ షేప్‌లో ఉంటాయి. అయితే దీని వల్ల స్క్రీన్ పూర్తిగా మనకు కనబడదు. దీని వల్ల మనం ఒక పిక్చర్‌ని, లేదా వీడియోను పూర్తిగా చూడడం కష్టం. అయితే ఇలాంటి ఇబ్బందిని తొలగించడం కోసం ప్లే స్టోర్‌లో కొన్ని యాప్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే పూర్తి స్క్రీన్‌ను మనం చూసే అవకాశం ఉంది.