• తాజా వార్తలు
  •  

వాట్స్ యాప్ లో చాలామందికి తెలియని 6 ఫీచర్లు


ప్రపంచవ్యాప్తంగా, భారత్ లో అత్యధికంగా వినియోగించే ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్ యాప్ లో ఉండే అనేక ఫీచర్లను యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. యాప్ అప్ డేట్ చేసుకోక కొందరు.. అవగాహన లేక కొందరు అందులోని ఫీచర్లను పరిమితంగానే వాడుతున్నారు. సో... ఇప్పు వాట్స్ యాప్ లోని కొన్ని అద్భుతమైన ఫీచర్లు మీ కోసం అందిస్తోంది కంప్యూటర్ విజ్ఞానం అందిస్తోంది మీకోసం...

* టూ ఫేక్టర్ అథెంటిఫికేషన్

వాట్స్ యాప్ రీసెంటుగా ఈ ఫీచర్ తీసుకొచ్చింది. గతంలో కేవలం ఫోన్ నంబర్ కొట్టి ఓటీపీతో వాట్స్ యాప్ ఖాతా ఓపెన్ చేసే వీలుండేది. అంతేకానీ... యూజర్ నేమ్, పాస్ వర్డ్ అవసరం ఉండేది కాదు. దానివల్ల పొరపాటున ఎవరిచేతికైనా మన ఫోన్ దొరికితే.. ఆ ఫోన్ లాక్ అయిపోయినా కూడా వారు సిమ్ కార్డు తీసి వేరే ఫోన్లో వేసి మన వాట్స్ యాప్ అకౌంట్ యాక్సెస్ చేసుకునే ప్రమాదం ఉండేది. కానీ.. ఇప్పుడు 6 డిజిట్ పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు.ప్రతిసారీ మన ఖాతాను రీ వెరిఫై చేసేటప్పుడు ఇది పాస్ కోడ్ అడుగుతుంది. దీన్ని ఈమెయిల్ నుంచి రీసెట్ చేసుకోవచ్చు.

* గ్రూప్ చాట్ లో ప్రత్యేకంగా ఒక మెసేజ్ కే రిప్లయ్ ఇచ్చే అవకాశం.
ఒకప్పుడు స్పెసిఫిక్ మెసేజ్ కు రిప్లయ్ ఇచ్చే అవకాశం వాట్స్ యాప్ లో ఉండేది కాదు. అప్పుడు గందరగోళంగా ఉండేది. ఎప్పుడో ఎవరో పెట్టిన మెసేజికి రిప్లయ్ ఇవ్వలేని పరిస్థితి.. ఒక వేళ ఇచ్చినా అది దేనికి రిప్లయో తెలిసేది కాదు. కానీ... ఇప్పుడు ఏ మెసేజ్ కు కావాలంటే దానికే రిప్లయ్ ఇవ్వొచ్చు. దీనికోసం మనం కావాల్సిన మెసేజ్ వద్ద కాసేపు వేలితో టచ్ చేసి ఉంచితే అది హైలైట్ అవుతుంది. అప్పుడు పైన ఉన్న బార్ లో సెండ్ ఆప్షన్ కు కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్టన్ లో ఉండే ఒక యారో వంటిది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశాక.. చాట్ బాక్స్ లో మనం రిప్లయ్ ఇవ్వాల్సిన మెసేజ్.. దానికింద టెక్స్స్ లేదా ఎమోజీలు టైప్ చేయడానికి బాక్స్ వస్తుంది. అందులో ఎంచక్కా రిప్లయ్ టైప్ చేసి సెండ్ చేయొచ్చు.

* గ్రూప్ చాట్లో మన మెసేజ్ ను ఎవరెవరు చూశారో చూడొచ్చు..

నేరుగా ఒక్కరికే పంపిన మెసేజ్ అయితే వారు చదివారో లేదో చెప్పడానికి అక్కడ కనిపించే బ్లూ కలర్ టిక్ మార్క్స్ ఉపయోగపడతాయి.. కానీ, గ్రూప్ చాట్ లో అయితే.. మన మెసేజ్ ను ట్యాప్ చేసి పైనున్న i బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఎంతమంది చూశారో తెలిసిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ లో పాటించే మెథడ్. కానీ.. ఐఫోన్ లో అయితే.. పైనున్న ఇన్ఫో బటన్ క్లిక్ చేయాలి.
* వాయిస్ మెసేజ్ డైరెక్టుగా వినపడకుండా..
కొందరు వాయిస్ మెసేజిలు పంపుతారు. అవి కొన్ని ఫోన్లలో డైరెక్టుగా బయటకు వినిపించేస్తాయి. అందరి మధ్యా ఉన్నప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు వెంటనే ఫోన్ ను చెవి దగ్గర పెడితే మైక్రోఫోన్ డిస్ కనెక్టు అయి అది ఆగిపోతుంది.

* బోల్డ్ చేయాలంటే.. వాట్సాప్ మెసేజెస్ లో కొంత టెక్స్ట్ ను బోల్డ్ చేయాలంటే ఆ పదానికి రెండువైపులా * టైప్ చేయాలి. కావాల్సిన పదం లేదా వాక్యానికి రెండు వైపులా _ టైప్ చేస్తే అది ఇటాలిక్ లో కనిపిస్తుంది.

* వాట్స్ యాప్ గ్రూప్ చాట్లో ఒక్కోసారి కేవలం ఒకరినే ఉద్దేశించి మెసేజ్ పెడతాం. అలాంటప్పుడు @పేరు రాస్తే అది వారికే అని తెలుస్తుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు