• తాజా వార్తలు
  •  

ట్రిక్స్ అండ్ టిప్స్: వాట్స‌ప్  సెక్యూర్‌గా ఉండేందుకు చిట్కాలివే

వాట్సప్‌.. మ‌నం స్మార్ట్‌ఫోన్‌లో క‌చ్చితంగా వాడే సోష‌ల్ మీడియా యాప్‌.  కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది వాట్స‌ప్‌.  అయితే మ‌న వాట్స‌ప్ ఎంత‌వ‌ర‌కు సెక్యూర్‌. దీనికి మ‌నం స‌మాధానం చెప్ప‌లేం.  మ‌నం ఈ యాప్‌లో ఎంతో స‌మాచారాన్ని షేర్ చేస్తాం. దానిలో విలువైన స‌మాచారం కూడా ఉంటుంది. మ‌రి ఆ స‌మాచారాన్ని సెక్యూర్‌గా ఉంచుకోవ‌డం ఎలా? ..దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి.  మ‌రి చిట్కాలేమిటో చూద్దామా!

ఎన్‌క్రిప్ష‌న్ చెక్ చేసుకోండి
సెన్సిటివ్ క‌న్వ‌ర్షేష‌న్ జ‌రుగుతున్న‌పుడు దానికి ఎన్‌క్రిప్ష‌న్ ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే హ్యాక‌ర్లు జొర‌బ‌డేందుకే అదే స‌రైన సమ‌యం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు నంబ‌ర్లు, బ్యాంకు వివ‌రాలు ఎవరికైనా పంపేట‌ప్పుడు మీరు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. చాట్ విండోతో పాటు కాంటాక్ట్ పేరుపై క్లిక్ చేసి చూసుకోవాలి. ఏమైనా అనుమానం వ‌స్తే చాటింగ్ ఆపేయాలి. మీరు ఏ చాటింగ్ విండోలోనైనా ఎన్‌క్రిప్ష‌న్ చెక్ చేసుకుంటే 40 అంకెల డిజిట్ ఉన్న ప్యాట్ర‌న్ క‌నిపిస్తుంది. 

సెక్యూరిటీ నోటిఫికేష‌న్లు ఆన్ చేయాలి
సెక్యూరిటీ నోటిఫికేష‌న్ల‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. సెక్యూరిటీ కోడ్‌ల‌లో ఏమైనా  మార్పులు ఉంటే  వాట్స‌ప్ వెంట‌నే మీకు సెక్యూరిటీ అలెర్ట్స్ పంపిస్తుంది. మీరు మీ స్నేహితునితో ఈ ఎన్‌క్రిప్ష‌న్ కోసం చెక్ చేసుకోవ‌చ్చు. సెక్యూరిటీ నోటిఫికేష‌న్లు ఆఫ్‌లో ఉంటే వెంట‌నే ఆన్‌లోనే పెట్టుకోవాలి. అప్పుడు మీరు వెంట‌నే నోటిఫికేష‌న్లు పొందే అవ‌కాశం ఉంటుంది.

టు స్టెప్ వెరిఫికేఫ‌న్ అనేబుల్ చేయాలి
మీ వాట్సప్ సెక్యూర్‌గా ఉండాలంటే రెండంచెల విధానం ద్వారా ఎప్పుడూ సెక్యూరిటీ ఉండాలి.  దీనిలో ఉండే రెండంచెల వెరిఫికేష‌న్ ఆప్ష‌న్‌ను అనేబుల్ చేయాలి. అంటే  మీ వాట్స‌ప్‌లోకి ఎవ‌రు ప్ర‌వేశించాల‌న్నా ఆ  రెండు సెక్యూరిటీ చెక్‌లు అధిగ‌మించే  రావాలి. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ను క్లిక్ చేస్తే టు స్టెప్ వెరిఫికేష‌న్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని అనేబుల్ చేయాలి.

పాస్‌కోడ్ లేదా ట‌చ్ ఐడీ
మీ వాట్స‌ప్‌ను సెక్యూర్‌గా ఉంచ‌డం కోసం పాస్‌కోడ్ అవ‌స‌రం. అయితే వాట్స‌ప్‌కు నేరుగా పాస్‌వ‌ర్డ్ పెట్టుకునే అవ‌కాశం లేదు. అందుకే ఫోన్‌లో మ‌స్ట్‌గా ప్యాట్ర‌న్ లేదా పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్లు అనేబుల్ చేసుకోవాలి. ఇది ఇన్‌డైరెక్ట్‌గా వాట్స‌ప్‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. 

క్లౌడ్ బ్యాక్ అప్స్ డిజేబుల్ చేయాలి
మ‌నం వాట్స‌ప్‌లో చేసే చాటింగ్ అంతా గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్‌లో సేవ్ అవుతుంది. అయితే ఈ బ్యాక్ అప్‌కు ఎలాంటి ఎన్‌క్రిప్ష‌న్ ఉండ‌దు. అందుకే గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్‌లో దాచిన వాట్స‌ప్ చాట్‌ను డిజేబుల్ చేయ‌డం చాలా బెట‌ర్‌.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు