• తాజా వార్తలు
  •  

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు ఇప్ప‌టిదాకా తెలియ‌ని ర‌హ‌స్యాలు

ఆండ్రాయిడ్ ఫోన్లో ఎన్నో ఆప్ష‌న్లు ఉంటాయి. వాటిలో మ‌నం కొన్ని మాత్ర‌మే వాడ‌తాం. కొన్ని ఆప్ష‌న్లు అస‌లు ట‌చ్ కూడా చేయం. అస‌లు కొన్ని ఆప్ష‌న్లు ఉన్నాయ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలియ‌దు. అలా మ‌న ఆండ్రాయిడ్ ఫోన్లో ర‌హాస్యంగా ఉన్న తెలియ‌ని ఆప్ష‌న్లు ఏం ఉన్నాయో చూద్దామా..

కొంత‌మందికే కాల్స్ వెళ్లేలా చేయ‌డం
ఆండ్రాయిడ్ ఫోన్లో డోంట్ డిస్ట్ర‌బ్ ఆప్ష‌న్ గురించి మీకు తెలుసు. అలాగే వీటిలో ప్ర‌యారిటీ వోన్లీ అనే మ‌రో ఆప్ష‌న్ ఉంది. ఈ మోడ్ ఆన్ చేసుకుంటే మీరు మీటింగ్ ఉన్నా లేదా అర్జెంట్ ప‌నిలో ఉన్నా మిమ్మ‌ల్ని ఇబ్బందిపెట్టే కాల్స్ రావు. మీకు అత్య‌వ‌స‌ర‌మైన ఫోన్లు మాత్ర‌మే వ‌చ్చేలా దీనిలో ఆప్ష‌న్ ఉంది. ఆ ఫంక్ష‌న్‌ను యాక్టివేట్ చేయ‌డానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి సౌండ్స్ ఆప్ష‌న్ క్లిక్ చేసి ఆ తర్వాత ప్ర‌య‌రిటీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత కాల్స్ మీద ట్యాప్ చేసి మీకు ఎవ‌రు కాల్స్ చేయాలో సెట్ చేసుకోవాలి.

ఆటోమెటిక్‌గా ఫోన్ అన్‌లాక్ చేయ‌డం
సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మీరు ఫోన్ లాక్ చేసుకుంటారు. కానీ ఇంటి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు అవ‌స‌రం లేదు. కానీ అన్‌లాక్ ఆప్ష‌న్ వ‌ల్ల అది సాధ్యం కాదు. ఇలాంటి సంద‌ర్భంలో ఆటోమెటిక్‌గా అన్‌లాక్ కావ‌డం కోసం స్మార్ట్‌లాక్ ఆప్ష‌న్ మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ట్ర‌స్ట్‌డ్ ప్లేసెస్‌లో జీపీఎస్‌ను ఉప‌యోగించుకుని ఇది ఆటోమెటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.

ప‌ర్స‌న‌లైజ్డ్ యాడ్స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం
మీ ఫోన్లో ఏదైనా సెర్చ్ చేస్తే చాలు దానికి సంబంధించిన యాడ్స్ చూస్తే చాలు. మ‌ళ్లీ మ‌నం ఎప్పుడు బ్రౌజ్ చేసినా దానికి సంబంధించిన యాడ్స్ మ‌న ఫోన్లో వ‌స్తాయి. ఇది ఒక ర‌కంగా ఎంతో డిస్ట‌ర్బ్‌గా అనిపిస్తుంది. ప్రైవ‌సీకి భంగంగా మీరు భావిస్తే మీరు సుల‌భంగా ఈ ఫంక్ష‌న్‌ను డిజేబుల్ చేసుకోవ‌చ్చు. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాడ్స్ అండ్ అనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత ఆప్ట్ ఔట్ యాడ్స్ ఫెర్మార్‌మెన్స్ మీద క్లిక్ చేస్తే చాలు. మీకు యాడ్స్ త‌ల‌నొప్పి ఉండ‌దు.

మీ హృద‌య స్పంద‌న తెలుసుకోవ‌చ్చు
ఆండ్రాయిడ్ ఫోన్ సాయంతో మీ హృద‌య స్పంద‌న తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లే స్టోర్‌కు వెల్లి ఇన్‌స్టంట్ హార్ట్‌రేట్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. మీ ఫోన్ కెమెరా లెన్స్ మీద మీ చూపుడు వేలు కాసేపు ఉంచాలి. ఆ త‌ర్వాత కొన్ని సెక‌న్ల‌కు మీ హార్ట్ రేట్ ఎంతో మీ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. దీని ద్వారా మీ హృద‌య స్పంద‌న ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చు.

స్క్రీన్ మాగ్నిఫైయ‌ర్‌
ఐ సైట్ పూర్‌గా ఉన్న వాళ్ల‌కు స్క్రీన్ మాగ్నిఫ‌య‌ర్ బాగా ఉప‌యోప‌డుతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్సిసెబిలిటీ మీద క్లిక్ చేయాలి. త‌ర్వాత మాగ్నిఫికేష‌న్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌ను ఏ పార్ట్‌లో అయినా జూమ్ చేసుకుని చూసుకోవ‌చ్చు. ఫింగ‌ర్‌ని మూడుసార్లు అన‌డం ద్వారా వీలైనంత ఎక్కువ జూమ్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు