• తాజా వార్తలు

ఫోన్లో ఫాస్టుగా టైప్ చేయడానికి 9 సింపుల్ టిప్స్ మీకోసం

స్మార్ట్‌ఫోన్ కీబోర్డు మీద ఫాస్ట్‌గా టైప్ చేయాలనుకుంటున్నారా? ఎంత ప్రయత్నించినా  చేతులు స్పీడ్ గా కదలడం లేదా? టచ్ స్క్రీన్ డివైస్‌, హార్డ్ వేర్ డివైస్‌ల‌పై ఫాస్ట్‌గా ఎలా టైప్ చేయాలో తెలుసుకోవ‌డానికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవీ..  
ఇప్పుడున్న గూగుల్ కీబోర్డును గతంలో జీబోర్డును అని పిలిచేవారు. ఇది ఆండ్రాయిడ్ కీబోర్డుల్లో  అత్యధిక అప్షన్లు ఉన్న కీబోర్డు. జీబోర్డులో ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. వాటిని ఓసారి చూద్దాం.
1.ఎమోజీలను ఫాస్ట్ గా పంపించడం
అక్షరాలకంటే చూడ‌గానే అర్ధ‌మ‌య్యే ఎమోజీలు  బాగా క్లిక్క‌య్యాయి.   యూజ‌ర్స్‌ను ఎట్రాక్ట్ చేయ‌డానికి కంపెనీలు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఎమోజీల‌ను తీసుకొస్తున్నాయి.  మీరు ఫోన్లో స్క్రోల్ చేస్తుంటే వందల సంఖ్యలో ఎమోజీలు కనిపిస్తుంటాయి. కానీ మీకు కావాల్సిన ఎమోజీ కోసం అన్నింటినీ చెక్ చేయాల్సిన పని లేదు. జీబోర్డ్ లో ఎమోజీని సెర్చ్ చేసేందుకు  ఎమోజీ ఐకాన్‌పై  లాంగ్ టాప్ చేయండి. ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తున్న ఎమోజీకి సంబంధించిన సెర్చ్ బార్ కనపడుతుంది. దానిలో ఒక పదాన్ని టైప్ చేసిన తర్వాత, ఆ ఎమోజీలో దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రెస్ చేయండి. అంతే మీకు కావాల్సిన ఎమోజీ వచ్చేస్తుంది.
2. ఆన్ –స్క్రీన్ కర్సర్‌ను కంట్రోల్ చేయండి
ఎంత జాగ్రత్తగా టైప్ చేస్తున్నా కొన్ని సందర్భాల్లో అక్షరదోషాలు వస్తూనే ఉంటాయి. అయితే కర్సర్‌ను అక్షరాలపై నావిగేట్ చేయడం చిన్న స్క్రీన్లో ఈజీ కాదు.  ఇలాంటి సమస్యల నుంచి బయటపడే ఫీచర్ జీబోర్డులో ఉంది. ఖాళీ బార్లో ఎడమ వైపు లేదా కుడి వైపునకు స్వైప్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆన్‌స్క్రీన్‌లో కర్సర్ మీ కంట్రోల్లో ఉంటుంది.
3. నంబర్స్,  ప్రత్యేక అక్షరాలు
జీబోర్డులో ఒక సంఖ్యను టైప్ చేయాలనుకుంటే 123 మోడ్‌ను కానీ లేదంటే తరచుగా నంబర్స్ టైప్ చేయాలనుకుంటే జీబోర్డులో వరుస సంఖ్యలను ప్రారంభించవచ్చు. జీబోర్డ్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఏ నెంబర్ కావాలనుకుంటున్నారో దానితో ప్రారంభించండి. కీబోర్డు టాప్‌లో సంఖ్య వరుసను గమనిస్తుండాలి. అంతేకాదు, !?,”/: వంటి సింబల్స్ ఎక్కువగా ఉపయోగించినట్లయితే  ఈ సింబల్స్ లిస్టును యాక్సెస్ చేయడానికి టైం కీని ప్రెస్ చేయవచ్చు. ఇది స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ ఎంటర్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
4. టెక్స్ట్ ప్రెడిక్షన్, పర్సనల్ సజెష‌న్స్‌
ఒక పదాన్ని టైప్ చేసిన తర్వాత మరొక పదాన్ని సూచించడానికి జీబోర్డ్స్ టెక్స్ట్ ప్రెడిక్షన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. మ్యానువల్‌గా దాన్ని టైప్ చేయడానికి బదులుగా పదంలోకి ఎంటర్ అయ్యేందుకు కొన్ని సజెష‌న్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించినా హ్యాంగ్ పొందడం ద్వారా టైపింగ్ స్పీడ్ పెరుగుతుంది. జీబోర్డ్ సెట్టింగ్స్‌కు వెళ్లి టెక్స్ట్ కరెక్షన్, ఎనేబుల్ నెక్స్ట్‌వ‌ర్డ్ సజెష‌న్స్‌ను ప్రారంభించడం ద్వారా దీని గురించి తెలుసుకోవచ్చు.  
5. షార్ట్ కట్స్ కోసం
మీరు తరచుగా కొన్ని పదాలను ఉపయోగిస్తుంటే వాటిని గుర్తుంచుకోవడానికి, ఒక షార్ట్‌క‌ట్‌ను సెట్ చేయవచ్చు. Hru అని టైప్ చేస్తే దాన్ని how are you  అని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌పాండ్‌ వెర్షన్ జీబోర్డు బార్‌లో చూపిస్తుంది. అప్పుడు వెంటనే ఎంటర్ నొక్కాలి. అంతే షార్ట్‌క‌ట్‌లో పదాలను సులభంగా  ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
స్పీడ్‌గా టైప్ చేయ‌డానికి కొన్ని ఇన్‌పుట్ టైప్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
6. గ్లైడ్ టైపింగ్
గ్లైడ్ టైపింగ్ ఫీచర్ ద్వారా కీబోర్డు కీస్‌ను  టైప్ చేయాల్సిన అవసరం లేదు. వేళ్లతో కీని టచ్ చేస్తే చాలు. పదాలు టైప్ అవుతాయి. అంతేకాదు అక్షరదోషాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. గ్లైడ్ టైపింగ్ కేవలం జీబోర్డుకే పరిమితం కాదు. Swiftkey కూడా బెస్ట్ స్వైప్ టైపింగ్ ఫీచర్స్‌లో ఒక‌టి.
7. వాయిస్ టైపింగ్
ఈ ఫీచర్ ద్వారా మీకు కావాల్సిన సమాచారం కోసం మీరు మాట్లాడితే చాలు. ఆటోమేటిగ్గా మీ ముందు ఉంచుతుంది. టెక్స్ట్‌ను మార్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ లో స్పీచ్ టు టెక్స్ట్‌తో మీరు అక్షరాలను వెతికి టైప్ చేయాల్సిన పనిలేదు. ఈ వాయిస్ టైపింగ్ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తుంది. కాన్ఫిగర్ చేయడానికి జిబోర్డ్ సెట్టింగ్స్‌కు వెళ్లి, వాయిస్ టైపింగ్ అని టైప్ చేసిన తర్వాత ఆఫ్‌లైన్ స్పీచ్ రికగ్నైజ్‌కు నావిగేట్ చేయండి. అయితే ఇక్కడ మీకు కావాల్సిన భాషను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.
8. ఇతర ఆండ్రాయిడ్ కీబోర్డులు
జీబోర్డ్ అనేది బెస్ట్ ఆండ్రాయిడ్ కీబోర్డ్‌లో  ఒకటి. దీన్నికన్నా మంచి ఆండ్రాయిడ్ కీబోర్డులు చాలా ఉన్నాయి. వేగంగా టైప్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కీబోర్డులు కూడా ఉన్నాయి.
9. ఆండ్రాయిడ్ లో టైపింగ్ గేమ్స్
మీరు ఎక్కువగా ఉపయోగించే ఆండ్రాయిడ్ కీబోర్డ్‌తో ఎలాంటి సంబంధం లేకుండా, మీకు సాధ్యమైనంత వేగంగా టైప్ చేయవచ్చు. టైపింగ్ చేస్తూ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీ టైపింగ్ స్కిల్స్ మరింత మెరుగవ్వడానికి ztype మీకు సహాయపడుతుంది.  టైపింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నట్లయితే ఇది బెస్ట్ కీబోర్డ్ .
ఆండ్రాయిడ్ కోసం బెస్ట్ కీబోర్డ్‌లు
గూగుల్ ప్లే స్టోర్‌లో  ఉన్న కొన్ని బెస్ట్ కీబోర్డులను చెక్ చేసి మీకోసం అందిస్తున్నాం.  
Swiftkey: ఈ కీబోర్డును ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. దీనిలో క‌చ్చితమైన టెక్స్ట్ ప్రెడిక్షన్‌తోపాటు స్వైప్ టైపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎమోజీ సజెషన్స్ కూడా అందిస్తుంది. 150 కంటే ఎక్కువ భాషల్లో ఈ కీబోర్డు ఉంటుంది.
Fleksy: ఈ కీబోర్డ్ ఒక శక్తివంతమైన టెక్ట్స్ ప్రొడక్షన్‌తో వస్తుంది. అంతేకాదు నాచురల్ సిగ్న‌ల్‌ టైపింగ్‌ను అందిస్తుంది. వేగంగా టైప్ చేయడంలో fleksy గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్దింది.
Swipe: ఈ కీబోర్డు ప్రతి యూజర్ కు ఉపయోగపడుతుంది. ఇందులో లివింగ్ లాంగ్వేజ్, హాట్ వర్డ్స్ అని పిలిచే ఒక ఆప్షన్ ఉంటుంది.  కొత్తగా వచ్చిన పదాలతో అప్ టు డేట్ అందిస్తుంది.
 

జన రంజకమైన వార్తలు