ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెయిల్ ఏంటంటే వెంటనే గుర్తొచ్చేది జీమెయిల్ మాత్రమే. అంతగా జనాల్లోకి వెళ్లిపోయింది. దాదాపు 1.2 బిలియన్ యూజర్లు ప్రతి నెల జీమెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. మనకు సంబంధించిన దాదాపు అన్ని ఆన్లైన్ అకౌంట్స్‌కు జీమెయిల్‌కే అనుసంధానం చేస్తాం. అయితే అన్ని కీలకమైన అకౌంట్లకు మనం జీమెయిల్ ఇస్తున్నాం. మరి జీమెయిల్‌కు మనం ఎంత రక్షణ కల్పిస్తున్నాం. జీమెయిల్ ఉపయోగించేటప్పుడు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జీమెయిల్ వాడేటప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన ఒక ట్రిక్ పాటిస్తే మీ మెయిల్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవచ్చు అది ఏంటో తెలుసుకుందామా...
టు స్టెప్ వెరిఫికేషన్
జీమెయిల్ సెక్యూర్‌గా ఉండాలంటే కచ్చితంగా టు స్టెప్ వెరిఫికేషన్ ట్రిక్ పాటించాలి. 2ఎస్వీ ట్రిక్ మీరు పాటిస్తే చాలు. మీ జీమెయిల్‌కు రక్షణ కల్పించుకోవచ్చు. దీని కోసం మీరు సింపుల్ స్టెప్స్ పాటిస్తే చాలు. మీ ఈమెయిల్ అడ్రెస్‌తో సైన్ ఇన్ కావాలి. ఆ తర్వాత మీకో వన్‌టైమ్ యూజ్ కోడ్ ఒకటి వస్తుంది. ఇది టెక్ట్ మెసేజ్ రూపంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుతుంది. లేకపోతే గూగుల్ అథంటికేటర్ యాప్ ద్వారా మీరు కోడ్‌ను జనరేట్ చేసుకోవచ్చు.
హ్యాకర్లకు చిక్కకుండా..
టు స్టెప్ వెరిఫికేషన్ వల్ల మనం పొందే ముందు ప్రయోజనం ఫిషింగ్ అటాక్‌ల నుంచి బయటపడడం. దీని వల్ల హ్యాకర్లు మీ అకౌంట్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినా వారికి పాస్‌వర్డ్‌ను ఛేదించడం కష్టం అవుతుంది. మీ ఫోన్ సిమ్‌ను హైజాక్ చేయడం, మీకు సంబంధించిన టెక్ట్ మెసేజ్‌లను, కాల్స్‌ను లాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి టు స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ తొలి స్టెప్‌ను హ్యాకర్లు ఛేదించగలిగినా... రెండో స్టెప్ దాటకుండా మీ ఇన్‌బాక్స్‌ను టచ్ చేయలేరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నఉత్తమమైన సెక్యూర్ సిస్టమ్ టు స్టెప్ వెరిఫికేషన్ అని నిపుణుల మాట.