• తాజా వార్తలు
  •  

ఈ గూగుల్ ఫ్లైట్స్ ట్రిక్ .. మీ ప్ర‌యాణం సూప‌ర్ ఈజీ చేయ‌డానికి

వెకేష‌న్‌కి ఎక్క‌డికో ఫ్లైట్‌లో వెళ్ళాల‌నుకున్నారు. లేదా అర్జంట్ ప‌నిమీద ఎయిర్ ట్రావెల్ చేయాల్సి వ‌చ్చింది. కానీ ర‌ష్ ఎక్కువ ఉంటే దానికి త‌గ్గ‌ట్లే ఫేర్ కూడా భారీగానే ఉంటుంది.  త‌ప్ప‌దు క‌దా అని స‌రిపెట్టుకోవాల్సిన ప‌ని లేదు. దీనికి గూగుల్ ఫ్లైట్స్ యాప్ దీనికి చ‌క్క‌ని పరిష్కారం చూపిస్తుంది.
      ఇత‌ర గూగుల్ సెర్చ్ ఆప్ష‌న్ల మాదిరిగానే గూగుల్ ఫ్లైట్ సెర్చ్‌కూడా బెస్ట్ రిజ‌ల్ట్స్ ఇస్తుంది.  ర‌ష్ ఎక్కువ ఉన్న రోజు అయితే ఆల్ట‌ర్నేట్‌గా వేరే రోజు మీరు ప్ర‌యాణం పెట్టుకుంటే టికెట్ ఎంత త‌క్కువ‌కు వ‌స్తుందో .. పీక్‌లో వెళితే ఎంత ఛార్జి ప‌డుతుందో చూపిస్తుంది.
 గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్
     హైద‌రాబాద్ నుంచి  ముంబ‌యి వెళ్లాలంటే ర‌ష్ ఎక్కువ ఉంటుంది కాబ‌ట్టి ఫేర్ కూడా భారీగా ప‌డుతుంది.  అదే కాస్త ద‌గ్గ‌ర‌గా, బిజీ త‌క్కువ‌గా ఉండే మ‌రో ఎయిర్‌పోర్ట్‌ను తీసుకుంటే టిక్కెట్ ప్రైస్ త‌క్కువ ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉంటే స‌జెస్ట్ చేస్తుంది. దీన్ని గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్ అంటారు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ రెండింటిలోనూ ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. మీరు  ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్లాలి? ఏ రోజు వెళ్ల్లాలి వంటి డిటెయిల్స‌న్నీ ఎంట‌ర్ చేస్తే మీకు బెస్ట్ పాజిబుల్ ఆప్ష‌న్స్ చూపిస్తుంది.
 టిప్స్, ప్రైస్ గ్రాఫ్
     వీటితో పాటు టిప్స్‌, ప్రైస్ గ్రాఫ్ అనే రెండు ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి.  ఇన్‌సైట్స్ టాబ్  మీరు మ‌రో రోజున, మ‌రో ఎయిర్‌పోర్ట్ నుంచి వెళితే లేదంటే అదే రోజులో మ‌రో టైంలో బుక్ చేస్తే  ఎంత ఫేర్ తగ్గుతుందో చూపిస్తుంది.  ఈ గూగుల్ ఫ్లైట్ ఇన్‌సైట్స్ డెస్క్‌టాప్‌లో కూడ అందుబాటులో ఉంది.
Thanks to Google Flights, you can choose an alternate (often cheaper) airport for both your departure and arrival.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు