• తాజా వార్తలు
  •  

అమెజాన్‌లో షాపింగ్ స్మార్ట్‌గా చేయ‌డానికి  ర‌హ‌స్య చిట్కాలు మీకోసం

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి అమెజాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒరిజిన‌ల్ ప్రొడ‌క్ట్ కావాలంటే అమెజాన్ అనేంత క్రెడిబిలిటీ ఆన్‌లైన్ యూజ‌ర్ల‌లో ఉంది. అమెజాన్ కూడా దానికి త‌గ్గ‌ట్లే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో ముందుకెళుతోంది. అయితే అమెజాన్ ఇస్తున్న ఆఫ‌ర్లు నిజంగానే వ‌ర్త్‌ఫుల్లేనా? అమెజాన్‌లో ఏదైనా ప‌ర్చేజ్ చేసిన‌ప్పుడు దానికంటే మంచి డీల్ వేరే సైట్‌లో ఉందా? ఏవైనా డిస్కౌంట్ కూప‌న్స్ ఉన్నాయా? అస‌లు ఆ ప్రొడ‌క్ట్ మీకు షిప్పింగ్ అయ్యే అవ‌కాశం ఉందా? ఇలాంటివ‌న్నీ తెలుసుకోవ‌డానికి చాలా మార్గాలున్నాయి. అలాంటి వివ‌రాల‌న్నీ మీకు అందించే సైట్లు, టూల్స్ గురించి ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.
1.కేమిల్‌కేమిల్‌కేమిల్ (CamelCamelCamel)
అమెజాన్‌లో ప్రైస్ వివ‌రాలు తెలుసుకోవ‌డానికి బెస్ట్ ట్రాకింగ్ టూల్ ఇది. మీరు కొనాలనుకున్న అమెజాన్ ప్రొడ‌క్ట్ యూఆర్ఎల్‌ను కాపీ చేసి CamelCamelCamelలో పేస్ట్ చేస్తే చాలు. ఆ ప్రొడ‌క్ట్ ప్రైస్ హిస్ట‌రీని మీ ముందు పెడుతుంది. అమెజాన్ ప్రైస్‌, థ‌ర్డ్ పార్టీ ఇస్తున్న ప్రైస్‌, థ‌ర్డ్ పార్టీ ఇంత‌కు ముందు ఆ ప్రొడ‌క్ట్‌ను ఎంత‌కు అమ్మిందో ఆ ప్రైస్‌ను చూపిస్తుంది. దీన్నిబట్టి అమెజాన్ చూపిస్తున్న ప్రైస్‌కు మీరు దాన్ని కొనుక్కోవ‌చ్చో లేదో డిసైడ్ అవ్వ‌చ్చు. అంతేకాదు ఈ వివ‌రాలు తెలుసుకోవ‌డానికి టైమ్ ఫ్రేమ్ నెల‌, మూడు నెలలు, ఆరు నెలలు, సంవ‌త్స‌రం వ‌ర‌కు మీరు క‌స్ట‌మైజ్ చేసుకోవ‌చ్చు. అంతేకాదు ప్రైస్ అల‌ర్ట్ కూడా సెట్ చేసుకోవ‌చ్చు. ఆ ఐట‌మ్ త‌క్కువ ప్రైస్‌కు వ‌చ్చిన‌ప్పుడు మిమ్మ‌ల్నిఅల‌ర్ట్ చేస్తుంది.
2.హ‌నీ (Honey)
ఇది ఒక బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌.  క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా, ఎడ్జ్‌, స‌ఫారీ బ్రౌజ‌ర్ల‌లో ఈ హ‌నీ ఎక్స్‌టెన్ష‌న్ ప‌నిచేస్తుంది. ఇది మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న‌ప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి వాచ్‌చేస్తుంది. త‌న డేటా బేస్ నుంచి ఆ ప్రొడ‌క్ట్‌కు రిలేటెడ్‌గా ఏమైనా డిస్కౌంట్ కూప‌న్లు, ప్రోమో కోడ్‌లు ఉన్నాయేమో సెర్చ్ చేస్తుంది. మీరు చెక్ అవుట్ చేసేస‌రికి ఆటేమేటిగ్గా ఆ కూప‌న్ల‌ను అప్ల‌యి చేస్తుంది.దీంతో మీకు మ‌నీ సేవ్ అవుతుంది.
3. రిటైల్ మీ నాట్ (RetailMeNot)
రిటైల్‌మీ నాట్ అనేది ఓ వెబ్‌సైట్‌. ఇది కూడా హ‌నీ లాంటిదే. అయితే హ‌నీ ప్రొడ‌క్ట్ కొనేట‌ప్పుడు కూప‌న్లు వెతికి మీకు మ‌నీ సేవ్ చేస్తుంది. రిటైల్ మీ నాట్ సైట్ మ‌రో అడుగు ముందుకేసి ఇంకా ఏ ప్రొడ‌క్ట్స్ కొంటే మీకు ఇంకెంత సేవింగ్ అవుతుందో చూపిస్తుంది.  డిస్కౌంట్ వోచ‌ర్లు, ప్రోమో కోడ్స్ అప్ల‌యి చేసేట‌ప్పుడు అవి ఎక్స్‌పైర్ అయిపోయాయ‌ని చూపిస్తుంటాయి. కానీ రిటైల్ మీ నాట్ ఆ వోచ‌ర్ లేదా కోడ్ ఎంత‌మంది వాడారు, లాస్ట్ టైమ్ దాన్ని ఎప్పుడు వెరిఫై చేసింది కూడా చూపిస్తుంది. దీంతో ఎక్స్‌పైర్డ్ కూప‌న్లు వాడే అవ‌కాశాలు తగ్గుతాయి.
4.కూప‌న్ ఫాలో (CouponFollow)
ఇది కూప‌న్ కోడ్స్‌,ప్రోమో కోడ్స్  ఎగ్రిగేట‌ర్‌. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఇది ప్రోమో కోడ్స్, డిస్కౌంట్స్ డీల్స్‌కు సంబంధించిన వివ‌రాల‌న్నీ ట్విట్ట‌ర్ నుంచి సేక‌రించి మ‌న‌కు అందిస్తుంది. ట్విట్ట‌ర్లో దానికి ఎన్ని లైకులు, రీట్వీట్లు వ‌చ్చాయ‌న్న‌దాన్ని బ‌ట్టి ఆ కూప‌న్ గ్యారంటీని అంచ‌నా వేసుకోవ‌చ్చు. జ‌స్ట్ మీరు కూప‌న్‌ఫాలోలోకి వెళ్లి ఫ‌ర్ అమెజాన్ అని సెర్చ్‌చేస్తే చాలు
5. ప్రైస్ బ్లింక్ (PriceBlink)
ప్రైస్ బ్లింక్ కూడా బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌నే. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది కూడా హ‌నీలాగానే బ్యాక్ గ్రౌండ్‌లో ఉంటుంది. కానీ మీరు ప్రొడ‌క్ట్‌ను క్లిక్‌చేయ‌గానే ప్రైస్ బ్లింక్ యాక్టివేట్ అవుతుంది.  మిగ‌తా ఈకామ‌ర్స్ సైట్ల‌లో ఆ ప్రొడ‌క్ట్ ఎంత ధ‌ర‌కు దొరుకుతుందో చూపిస్తుంది. దాన్ని బ‌ట్టి ప్రైస్ ఎక్క‌డ త‌క్కువ ఉంటే ఆ సైట్‌లో కొనుక్కోవ‌చ్చు. కూప‌న్ సెర్చ్‌, ప్రైస్ అల‌ర్ట్ ఫీచ‌ర్లు కూడా దీనికి అద‌న‌పు ఎట్రాక్ష‌న్లు.

 

జన రంజకమైన వార్తలు