• తాజా వార్తలు
  •  

అమెజాన్‌లో  షాపింగ్ స్మార్ట్‌గా చేయ‌డానికి ర‌హ‌స్య‌చిట్కాలు మీకోసం పార్ట్‌ -2

అమెజాన్‌లో షాపింగ్ స్మార్ట్‌గా చేసి డ‌బ్బులు సేవ్ చేసుకోవ‌డానికి చాలా టూల్స్‌, వెబ్‌సైట్లు ఉన్నాయి. సాధార‌ణ యూజ‌ర్ల‌కు వీటి గురించి అస్స‌లు తెలియ‌దు. ఇలాంటి కొన్నిటూల్స్‌, సైట్ల గురించి గ‌త ఆర్టిక‌ల్‌లో చెప్పుకున్నాం. ఇప్పుడు అలాంటి మ‌రిన్ని వివ‌రాలు మీకోసం..
గోసేల్ (GoSale)
ప్రైస్ బ్లింక్ లాగే ఇది కూడా ప్రైస్ కంపారిజ‌న్ సైట్‌, బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్. మీరు అమెజాన్‌లో ప్రొడ‌క్ట్ సెలెక్ట్ చేయ‌గానే ఇత‌ర ఆన్‌లైన్ స్టోర్ల‌లో ఆ ప్రొడ‌క్ట్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తుంది. మ్యాగ్జిమం సేవింగ్స్ చేయాలంటే ఏ స్టోర్‌లో కొనుక్కోవ‌చ్చో మీకు చూపిస్తుంది. ఇంత‌కు ముందు  ఆ ప్రొడ‌క్ట్ ప్రైస్ డేటా ఇస్తుంది. ప్రైస్ త‌గ్గితే అల‌ర్ట్స్ పంపిస్తుంది. ప్రైస్‌బ్లింక్‌తోపాటు గోసేల్‌ను కూడా యాడ్ చేసుకుంటే బెట‌ర్ ప్రైస్ ఏ ఈకామ‌ర్స్ సైట్ ఇస్తుందో ఈజీగా క‌నిపెట్టొచ్చు.
వికీ బై (WikiBuy)
ఇది అమెజాన్ షాపింగ్ చేసేవారికి అల్టిమేట్, మోస్ట్ యూజ్‌ఫుల్ టూల్‌.ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఆర్టిక‌ల్స్‌లో మ‌నం చెప్పుకున్న అన్ని టూల్స్‌కు సంబంధించిన ఫీచ‌ర్లు ఇందులో ఉంటాయి. ఈ కీ బోర్డు ఎక్స్‌టెన్ష‌న్‌ను యాడ్‌చేసుకుంటే మీరు అమెజాన్‌లో షాపింగ్ చేస్తున్న‌ప్పుడు అంత‌కంటే బెట‌ర్ ప్రైస్ ఎక్క‌డ దొరుకుతుందో చూపిస్తుంది.చెక్ అవుట్ టైమ్‌లో కూప‌న్లు,ప్రోమో కోడ్స్ ఉంటే ఆటోమేటిగ్గా అప్ల‌యి చేస్తుంది.  ప్రొడ‌క్ట్ కొనుక్కోవ‌డానికి మీకు ఫ్లాట్‌ఫారంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి ప‌ర్చేజ్ 100% మ‌నీ బ్యాక్ గ్యారంటీతో వ‌స్తుంది. కాబట్టి ప్రొడ‌క్ట్ బాగోలేక‌పోయినా మీకు ఇబ్బంది ఉండ‌దు. మీకు ఫుల్ రిఫండ్ వ‌చ్చేస్తుంది. అంతేకాదు మీ పేమెంట్ ఇన్ఫోను మ‌ర్చంట్స్‌కు చేర‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. 
డ‌జ్ అమెజాన్ షిప్ టు (Does Amazon Ship to…?)
డ‌జ్ అమెజాన్ షిప్ టు అనేది ఒక బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌.  అయితే క్రోమ్ బ్రౌజ‌ర్‌కే మాత్ర‌మే ప‌నిచేస్తుంది. ఈ ఎక్స్‌టెన్ష‌న్  ప్ర‌తి అమెజాన్ ప్రొడ‌క్ట్ పేజీకి ఓ సింగిల్ బ‌ట‌న్‌ను యాడ్ చేస్తుంది. ఈ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఆ ప్రొడ‌క్ట్ మీ దేశానికి షిప్ అవుతుందో లేదో చూపిస్తుంది.  అంతేకాదు ఇత‌ర సైట్ల‌తో ప్రైస్ కంపేర్ చేసి చూపిస్తుంది. ఆ సైట్ల‌లో మీరు కోరుకున్న ప్రొడ‌క్ట్ మీరుండే ప్రాంతానికి షిప్ అవుతుందో లేదో కూడా చూపిస్తుంది. Amazon.com, Amazon.co.uk, Amazon.fr, and Amazon.de సైట్స్‌కు ఇది ప‌నిచేస్తుంది.
రివ్యూ మెటా (ReviewMeta)
ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే టూల్ ఇది. అమెజాన్ ప్రొడ‌క్ట్ యూఆర్ఎల్‌నుకాపీ చేసి ఈ సైట్‌లో ఉన్న సెర్చ్‌బాక్స్‌లో  పేస్ట్ చేస్తే ఆ ప్రొడ‌క్ట్‌కు ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన రివ్యూల‌న్నింటినీ విశ్లేషిస్తుంది.  త‌ర్వాత అందులో నిజంగా న‌మ్మ‌ద‌గిన రివ్యూలు ఎన్ని?  ఫేక్ రివ్యూలుఎన్ని?అస‌లు ఆ ప్రొడక్ట్ ఒరిజిన‌ల్ రేటింగ్ ఎంత‌నేది విశ్లేషిస్తాయి. ఈ రివ్యూమెటాను వాడితే అమెజాన్‌లో 4.5కంటే ఎక్కువ రేటింగ్‌లు వ‌చ్చిన‌వాటిలో ఎన్నిఫేక్, ఎన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేరివ్యూలు  ఉన్నాయో తెలిసి ఆశ్చ‌ర్య‌పోతారు.
ఫేక్ స్పాట్ (FakeSpot)
రివ్యూ మెటా మాదిరిగానే అమెజాన్ ప్రొడ‌క్ట్స్ రివ్యూల గురించి అన‌లైజ్ చేసే మ‌రో టూల్ ఫేక్ స్పాట్‌. ఇందుకోసం డిఫ‌రెంట్ ఆల్గ‌రిథ‌మ్స్‌ను ఉప‌యోగించుకుంటుంది.  కాబట్టి  రివ్యూమెటా, ఫేక్ స్పాట్ రెండింటినీ యూజ్ చేసుకుంటే బెట‌ర్ రిజ‌ల్ట్స్ పొంద‌వ‌చ్చు.

జన రంజకమైన వార్తలు