• తాజా వార్తలు
  •  

రెడ్‌మీ ఫోన్ల‌కు బెస్ట్ కాల్ సెట్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ 

షియోమి ఫోన్లు అమ్మ‌కాల్లో ఇప్పుడు ఇండియాలో నెంబ‌ర్‌వ‌న్.  రెడ్‌మీ నుంచి నాలుగైదు నెల‌ల‌కో కొత్త మోడ‌ల్ లాంచ్ అవుతూ యూజ‌ర్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. వీటిలో కాల్ సెట్టింగ్స్‌కు చాలా ఇంట‌రెస్టింగ్ టిప్స్ ఉన్నాయి.  ఇవి గ‌నుక మీరు తెలుసుకుని యాక్సెస్ చేసుకుంటే ఫ్రెండ్స్‌,కొలీగ్స్ ముందు టెక్నాల‌జీ ఎక్స్‌ప‌ర్ట్‌లా క‌నిపించ‌వ‌చ్చు కూడా. అవేంటో, ఎలా చేయాలో ఈ ఆర్టిక‌ల్‌లో వివ‌రంగా చెబుతోంది కంప్యూట‌ర్ విజ్ఞానం.. చూడండి మ‌రి. 
రెడ్‌మీ ఫోన్ల‌లో కాల్ సెట్టింగ్స్‌ను రెండు ర‌కాలుగా యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  
* ఫోన్ యాప్‌ను ఓపెన్ చేసి  లెఫ్ట్ సైడ్ కింద ఉన్న త్రీ లైన్స్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పాప్ అప్ విండో వ‌స్తుంది.  దానిలో Settings క్లిక్ చేయండి.
*  ఇక రెండో పద్ధ‌తి ఫోన్‌లో Settingsలోకి వెళ్లి System appsను టాప్ చేయండి.  వ‌చ్చిన మెనూలో నుంచి Call settings ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.

టిప్స్ అండ్ ట్రిక్స్‌
1.ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్‌

షియోమిలో కాల్  రికార్డింగ్‌కు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ప్ర‌తి కాల్‌ను మాన్యువ‌ల్‌గా రికార్డ్ చేయొచ్చు లేదా ఆటోమేటిగ్గా రికార్డ్ చేసుకోవ‌చ్చు. మాన్యువ‌ల్‌గా రికార్డ్ చేయాలంటే మీరు నెంబ‌ర్ డ‌య‌ల్ చేశాక రైట్ సైట్ మధ్య‌లో క‌నిపించే Record ఆప్ష‌న్‌ను టాప్ చేయండి. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కావాలంటే Call settingsలోకి వెళ్లి Call recording ఆప్ష‌న్‌ను టాప్ చేయండి. దానిలో రెండో ఆప్ష‌న్‌గా  క‌నిపించే Record calls automaticallyని యాక్సెస్ చేయండి. ఏ నెంబ‌ర్ల నుంచి వ‌చ్చే కాల్స్‌ను రికార్డ్ చేయాలి వంటి ఆప్ష‌న్లు కూడా ఉన్నాయి.

2.ఫ్లిప్ టు సైలెన్స్‌
సాధార‌ణంగా ఇన్‌క‌మింగ్ కాల్స్ సౌండ్ త‌గ్గించాలంటే వాల్యూమ్ బ‌ట‌న్స్‌తో త‌గ్గిస్తాం. రెడ్ మీ డివైస్‌ల్లో మీకు కాల్ వ‌స్తున్న‌ప్పుడు పైకి ఫ్లిప్ చేస్తే కాల్ సైలెంట్ అయిపోతుంది. ఈ  ఫీచ‌ర్ ప‌ని చేయాలంటే మీరు కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఇన్‌క‌మింగ్ కాల్ సెట్టింగ్స్‌ను టాప్ చేయండి. వ‌చ్చే మెనూలో నుంచి Flip to silence ringer ఆప్ష‌న్ క్లిక్ చేయండి.  

3. ఫ్లాష్ నోటిఫికేష‌న్ లైట్ ఫ‌ర్ ఇన్‌క‌మింగ్ కాల్స్ 
కాల్ సెట్టింగ్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి ఇన్‌క‌మింగ్ కాల్స్ సెట్టింగ్స్‌ను టాప్ చేయండి. దానిలో నుంచి  Flash when ringing ఆప్ష‌న్ క్లిక్‌చేస్తే ఇన్‌క‌మింగ్ కాల్ వ‌స్తున్న‌ప్పుడు ఫ్లాష్ లైట్‌తో నోటిఫికేష‌న్ వ‌స్తుంది.

4.ఆటోమేటిక్ రీ డ‌య‌ల్‌
ఎవ‌రికైనా కాల్ చేస్తే బిజీ వ‌చ్చింది.  ఇంపార్టెంట్ అయితే మ‌నం ప‌దే ప‌దే కాల్‌చేస్తూనే ఉంటాం. రెడ్‌మీలో దీనికో మంచి ఆప్ష‌న్ ఉంది. Call Settingsలో Advanced settingsలోకి వెళ్లి  Redial automatically ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేయండి. అప్పుడు మీరు కాల్ చేసిన వ్య‌క్తి ఫోన్ బిజీ  వ‌స్తే ఆటోమేటిగ్గా మీ ఫోన్ వాళ్ల‌కు రీడ‌య‌ల్ చేస్తుంది. 

5. డ‌య‌ల్ ప్యాడ్ ట‌చ్ టోన్స్ మార్చుకోండి
డ‌య‌ల్ ప్యాడ్‌లో నెంబ‌ర్ టైప్ చేస్తున్న‌ప్పుడు సౌండ్ వ‌స్తుందా అయితే దాన్నిడిజేబుల్ చేసుకోండి. కాదు కూల్ సౌండ్‌తో వ‌చ్చినా ప‌ర్వాలేదు అనుకుంటే Call Settingsలోకి వెళ్లి  Advanced settings టాప్ చేయండి. Dial pad touch tonesనుక్లిక్ చేసి  Piano keysని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు నెంబ‌ర్ డ‌య‌ల్ చేస్తుంటే పియానో వాయిస్తున్న‌ట్లుగా కూల్ సౌండ్ వ‌స్తుంది.

6. ఇన్‌క‌మింగ్ కాల్ బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోండి
ఇన్‌క‌మింగ్ కాల్స్ ఒక‌టే బ్యాక్‌గ్రౌండ్ చూసి బోర్ కొట్టేసిందా? అయితే రెడ్‌మీ యూజ‌ర్లు ఇన్‌క‌మింగ్ కాల్ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా మార్చుకోవ‌చ్చు. అయితే ఇందులో రెండే ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి డిఫాల్ట్..రెండోది మీ లాక్ స్క్రీన్ వాల్‌పేప‌ర్‌లో ఏది ఉంటే అదే మీ ఇన్‌క‌మింగ్ కాల్ బ్యాక్‌గ్రౌండ్‌గా వ‌స్తుంది. అంటే మీరు ఇన్‌క‌మింగ్ కాల్ బ్యాక్‌గ్రౌండ్‌గా ఏ ఫోటో పెట్టుకోవాలంటే దాన్ని ముందు లాక్ స్క్రీన్ వాల్ పేప‌ర్‌గా పెట్టుకోవాలి. త‌ర్వాత కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లో   Incoming call backgroundని క్లిక్ చేసి Lock screen wallpaperని టాప్ చేయండి.

7.మిస్డ్ కాల్ రిమైండ‌ర్స్ 
మీరు కాల్ వ‌స్తే చూసి తర్వాత మాట్లాడ‌దాంలే అని మ‌ర్చిపోయే ర‌క‌మా? అయితే మీలాంటివారికోస‌మే రెడ్‌మీ మంచి ఫీచ‌ర్ తెచ్చింది. మిస్డ్ కాల్ రిమైండ‌ర్‌ను 1,2,3,5,10 ఇలా ఎక్కువ సార్లు రిమైండ్ చేసేలా ఆప్ష‌న్ ఉంది.  Call Settingsలోకి వెళ్లి  Advanced settings టాప్ చేయండి.   Missed call remindersను క్లిక్ చేసి  కావాల్సిన నెంబ‌ర్‌ను సెలెక్ట్ చేసుకోండి.  రిమైండ‌ర్ అవ‌స‌రం లేద‌నుకుంటే నో రిమైండ‌ర్‌ను క్లిక్ చేసుకుంటే చాలు.

8. మీ నెట్‌వ‌ర్క్ పేరును ఎడిట్ చేసుకోవాలంటే..
మీ ఫోన్ స్క్రీన్ మీద మీ నెట్‌వ‌ర్క్ పేరు (జియో, ఎయిర్‌టెల్‌, ఐడియా) పెట్టుకోవ‌చ్చు. ఇది అన్నిఫోన్ల‌లోనూ ఉంటుంది. అయితే రెడ్‌మీ ఫోన్ల‌లో ఈ నెట్‌వ‌ర్క్ పేరును కూడా ఎడిట్‌చేసి మీకు న‌చ్చిన పేరు పెట్టుకోవ‌చ్చు. Settingsలోకి వెళ్లి Notifications & status bar ఆప్ష‌న్‌ను టాప్ చేయండి. ఆప్ష‌న్ల‌లో నుంచి Edit carrier nameను క్లిక్ చేసి మీకు కావాల్సిన పేరు పెట్టుకోవ‌చ్చు. ఇప్పుడు బ్యాక్‌కు వెళ్లి షో కేరియ‌ర్ నేమ్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. లాక్ స్క్రీన్ నోటిఫికేష‌న్‌లో ఆ పేరురావాలా, హోం స్క్రీన్‌లో రావాలా?  రెండింటిలోనూ రావాలా సెట్ చేసుకోవ‌చ్చు. 

9. ప‌వ‌ర్ బ‌ట‌న్‌తో కాల్ ఎండింగ్‌
కాల్ ఎండ్ చేయాలంటే రెడ్ బ‌ట‌న్ నొక్క‌డం అంద‌రికీ తెలుసు. రెడ్ మీ ఫోన్ల‌లో ప‌వ‌ర్ బ‌ట‌న్ నొక్కి కూడా కాల్ ఎండ్‌చేయ‌వ‌చ్చు. SettingsలోAdditional settingsలోకి వెళ్లి  Accessibilityని టాప్‌చేయండి.  దానిలో Power button ends call ఆప్ష‌న్‌ను అనేబుల్ చేస్తే చాలు.

10. కాల్ మాట్లాడుతుండ‌గా నోట్స్ రాసుకోండి
కాల్ మాట్లాడుతుండ‌గా అవ‌తలి వారు దఏదైనా చెబితే రాసుకోవ‌డానికి పెన్నో, కాగిత‌మో లేక చాలా ఇబ్బంది ప‌డుతుంటాం. దీనికి రెడ్‌మీ లో ప‌రిష్కారం ఉంది. కాల్ మాట్లాడుతున్న‌ప్పుడు డ‌య‌ల‌ర్ యాప్‌లో ఉన్న Note సింబ‌ల్‌ను టాప్‌చేసి దానిలో రాసుకోవ‌చ్చు. అంతేకాదు ఈ నోట్ మ‌నం ఎవ‌రితో మాట్లాడుతున్నామో వాళ్ల పేరు మ‌న కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటే అదే పేరుతో ఆటోమేటిగ్గా సేవ్ అవుతుంది.

జన రంజకమైన వార్తలు