• తాజా వార్తలు
  •  

టిప్స్ అండ్ ట్రిక్స్‌: వాట్స‌ప్ గ్రూప్‌లు వాడేవాళ్లు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన ట్రిక్స్

వాట్స‌ప్‌..ఈ యాప్‌ను వాడ‌ని వాళ్లు దాదాపు ఉండ‌రు. ఐతే చాలామంది వాట్స‌ప్ వాడ‌తారు కానీ దాన్ని ఎలా ఉప‌యోగించాలో తెలియ‌దు.  జ‌స్ట్ మెసేజ్‌లు పంప‌డం... ఫొటోలు, వీడియోలు పంప‌డం మాత్ర‌మే చేస్తుంటారు. కానీ దీనిలో ఉన్న ఉప‌యోగాల‌ను గుర్తించరు. ముఖ్యంగా గ్రూప్‌ల‌లో చాటింగ్ చేసేట‌ప్పుడు ఏ ఫీచ‌ర్లు ఉంటాయో.. వాటిని ఎలా ఉప‌యోగించుకోవాల‌నే దానిపై చాలామందికి అవ‌గాహ‌న ఉండ‌దు. అలాంటి వారు త‌ప్ప‌క గుర్తించాల్సిన కొన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి అవేంటంటే..

ఎప్పుడు మెసేజ్ చ‌దివారో తెలుసుకోండి
గ్రూప్‌ల‌లో చాలామంది మ‌న‌కు స్నేహితులు ఉంటారు. వారిలో ఎవ‌రు ఎప్పుడు మ‌న మెసేజ్‌లు చ‌దివారో తెలియ‌దు. ఇది తెలుసుకోవ‌డం కోసం కూడా కొన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి.  మీ వాట్స‌ప్ గ్రూప్ చాటింగ్‌లోకి వెళ్లి  మీరు పంపిన మెసేజ్‌ను ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి. ఇన్ఫో మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు పంపిన మెసేజ్‌లు గ్రూప్‌లో ఉన్న వాళ్లు ఎవ‌రు ఏ టైమ్‌లో చ‌దివారో అర్ధం అయిపోతుంది.

గ్రూప్ అడ్మిన్‌ను ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌డం
ఏ గ్రూప్‌కైనా అడ్మిన్ ఉంటారు.  ఒక గ్రూపులో ఒకరికి మించి అడ్మిన్‌లు ఉండే అవ‌కాశం ఉంది. మీరు కూడా అడ్మిన్‌గా కొంత‌కాలం ఉన్నారు. కానీ మీకు అడ్మిన్‌గా కొన‌సాగ‌డం ఇష్టం లేదు. అప్పుడేం చేస్తారు. ఏముంది డిలీట్ చేస్తాం అంటారు. లేదా ఎగ్జిట్ అయిపోతాం అంటారు. కానీ దీని వ‌ల్ల స్నేహితుల‌తో బంధం చెడే అవ‌కాశాలుంటాయి. అందుకే మ‌న అడ్మిన్‌ను వేరే వాళ్లకు బ‌దిలీ చేయ‌చ్చు. మీ గ్రూప్ పార్టిసిపెంట్ లిస్ట్‌లోకి వెళ్లి మీరు ఎవరినైతే అడ్మిన్‌గా చేయాల‌నుకుంటున్నారో వారిని ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత మేక్ గ్రూప్ అడ్మిన్ ఆప్ష‌న్ క్లిక్ చేసి వారి పేరుపై క్లిక్ చేస్తే చాలు.

మెసేజ్‌ల‌ను డిలీట్ చేయ‌డం
గ్రూప్‌ల‌లోనూ మెసేజ్‌ల‌ను మ‌నం డిలీట్ చేయ‌చ్చు.  వాట్స‌ప్‌ను ఓపెన్ చేసి చాట్‌లోకి వెళ్లాలి. మీరు డిలీట్ చేయాల‌నుకుంటున్న మెసేజ్ మీద ట్యాప్ చేయాలి. అప్పుడు డిలీట్  ఫ‌ర్ ఎవ్రీవ‌న్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేస్తే చాలు.  మీరు గ్రూప్‌లో ఉంచిన మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అయితే ఈ యాక్ష‌న్ 7 నిమిషాల్లోపే చేయాల్సి ఉంటుంది.

గ్రూప్‌ను డిలీట్ చేయ‌డం
వాట్స‌ప్ గ్రూప్‌లో కొన‌సాగ‌డం ఇష్టం లేక‌పోతే గ్రూప్‌ను డిలీట్ చేయ‌చ్చా?  కానీ అంత సుల‌భంకాదు. మీరు అడ్మిన్ అయితే మాత్ర‌మే  గ్రూప్‌ను డిలీట్ చేసే అవ‌కాశం ఉంటుంది. లేక‌పోతే గ్రూప్ మొత్తాన్ని ఎగ్జిట్ చేయాలంటే ముందుగా మీరు అడ్మిన్ కావాలి. ఒక్కో పార్టిసిపెంట్ ఎగ్జిట్ చేసుకుంటూ  చివ‌రికి మీరు కూడా ఎగ్జిట్ కావాలి. 

సైలెంట్ చేయాలంటే..
వాట్స‌ప్ గ్రూప్‌ను సైలెంట్ చేసుకోవ‌చ్చు. అప్పుడు మీకు ఎలాంటి మెసేజ్‌లు రావు. అంటే టెక్నిక‌ల్‌గా దీన్ని మ్యూట్ చేయ‌డం అంటారు. ఒక గ్రూప్‌ను మీరు మినిమం 8 గంట‌ల పాటు మ్యూట్ చేయ‌చ్చు.  మాగ్జిమం ఒక ఏడాది పాటు మ్యూట్ చేసుకోవ‌చ్చు. కానీ మీరు పార్టిసిపేష‌న్ మిస్ అవుతారు. 

జన రంజకమైన వార్తలు