• తాజా వార్తలు
  •  

బెస్ట్ ఆండ్రాయిడ్ టిప్స్ మీ కోసం..

ఎక్క‌డ చూసినా స్మార్ట్‌ఫోన్లే. అందులో 90% వ‌ర‌కు ఆండ్రాయిడ్‌వే.  మీరు చాలాకాలంగా ఆండ్రాయిడ్ వాడుతున్నా దాన్ని మ‌రింత ఎఫెక్టివ్‌గా వాడుకోవ‌డానికి ఉన్న ఈ కొన్ని టిప్స్ మీరు గ‌మ‌నించి ఉండ‌రు.   
1) డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడానికి.. 
సెల్‌ఫోన్ కంపెనీలు కెమెరాల‌పై బాగా దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ అయినా మీరు స్కాన‌ర్‌లో స్కాన్ చేయ‌క్క‌ర్లేదు. ప్లే స్టోర్‌లోకి వెళ్లి కామ్ స్కాన‌ర్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దాన్ని ఓపెన్ చేసి డాక్యుమెంట్‌ను క్లియ‌ర్‌గా, నీట్‌గా స్కాన్ చేసుకోవ‌చ్చు.  కావాలంటే దాన్ని ఎడిట్ కూడా చేసుకోవ‌చ్చు. గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకోవ‌చ్చు కూడా.
2)  ఏ సాంగ్ వింటున్నారు? 
ఆల్బ‌మ్‌లోదో, ఫ్రెండ్ షేర్‌చేసిందో సాంగ్ వింటున్నారు? ఆ సాంగ్ ఎక్క‌డిది?  ఎవ‌రు పాడారు లాంటి డిటెయిల్స్ కూడా ఇప్పుడు చాలా ఆండ్రాయిడ్ ఫోన్ మ్యూజిక్ యాప్స్‌లో వ‌చ్చేశాయి. ఆర్టిస్ట్, ఆల్బ‌మ్ ఆప్ష‌న్లలో ఈ వివ‌రాల‌న్నీ ఉంటాయి.  Soundhound యాప్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు.  
3) కాంటాక్ట్ డిటెయిల్స్ లాక్ స్క్రీన్‌మీద కావాలా? 
మీ కాంటాక్ట్ డిటెయిల్స్ లాక్ స్క్రీన్‌మీద పెట్టుకోండి.  ఒక‌వేళ మీరు ఎక్క‌డైనా ఫోన్ వ‌దిలేసినా మీ డిటెయిల్స్ లాక్ స్క్రీన్ మీద ఉంటే దాన్ని చూసిన‌వాళ్లు మీకు ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌గ‌లుగుతారు.  ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్ష‌న్ ఉంది. 
4) గూగుల్ క్యాలెండ‌ర్‌లో టైం జోన్ సెట్ చేసుకోండి 
మీరు వేరే దేశంలోకి వెళితే అక్క‌డి టైం జోన్  ఆండ్రాయిడ్  చేంజ్ చేసుకుంటుంది. అదే మీరు గూగుల్ క్యాలెండ‌ర్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి  మీ సొంత టైం జోన్‌ను సెట్ చేసుకుంటే మీరు ఎక్క‌డున్నా మీ ఏరియాలో ఏం జ‌రుగుతుందో అప్‌డేట్స్ వ‌స్తాయి. 
5) బ్లూటూత్‌, వైఫైను వాయిస్ ద్వారా ఆఫ్ చేయండి 
వైఫై, బ్లూటూత్‌ల‌ను వాయిస్ క‌మాండ్ ద్వారా ఆన్‌, ఆఫ్ కూడా చేసుకోవ‌చ్చు. Google Now app దీనికి ఉప‌యోగ‌పుతుంది. 
6) స్క్రీన్ షాట్ తీసుకోండి  
మీ మొబైల్ స్క్రీన్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా ఫొటో తీసుకోవ‌డ‌మే స్క్రీన్‌షాట్‌. ఇది ఒక్కో ఫోన్‌లో ఒక్కోలా ఉంటుంది.  ఎక్క‌వ ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో వాల్యూమ్ డౌన్‌, హోం బ‌ట‌న్‌ను ఒకేసారి ప్రెస్ చేస్తే స్క్రీన్‌షాట్ వ‌స్తుంది. 
7) అలారం సౌండ్ పెంచాలంటే..  
ఆలారం సౌండ్ మామూలుగా ఉంటే నిద్ర లేవ‌డం లేదా? అయితే వెళ్లే కొద్దీ సౌండ్ పెంచాల్సిందే.  సెట్టింగ్స్‌లో అలార‌మ్ ఆప్ష‌న్‌లోకి వెళితే  దీన్ని సెట్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు