• తాజా వార్తలు
  •  

తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ పార్ట్ -2

గూగుల్ పేమెంట్ యాప్స్ తేజ్ యూజ‌ర్ల‌కు భారీగా ఆఫ‌ర్లు ఇస్తోంది.  బిల్ పేమెంట్‌, మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌తోపాటు రెంట్ పే చేసినా కూడా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు ఇస్తుంది. ఈ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి కొన్ని టిప్స్ గురించి గతంలో ఓ ఆర్టిక‌ల్లో చెప్పుకున్నాం. అలాంటివే మ‌రికొన్ని ఆఫ‌ర్ల గురించి ఈ ఆర్టిక‌ల్‌లో చ‌దవండి.
ల‌క్కీ ఫ్రై డేస్ ఆఫ‌ర్‌
ఏదైనా అకౌంట్‌కు తేజ్ యాప్ ద్వారా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే స్క్రాచ్ కార్డ్ వ‌స్తుంది. దానిలో రివార్డ్‌గా ఎంతో కొంత క్యాష్ కూడా వ‌స్తుంది. అదే శుక్ర‌వారం 500 కంటే ఎక్కువ అమౌంట్‌ను ఎవ‌రైనా తేజ్ యూజ‌ర్‌కు పంపితే ఓ స్క్రాచ్ కార్డ్ వ‌స్తుంది. దీన్ని రాత్రి 7త‌ర్వాత స్క్రాచ్‌చేస్తే లక్ష రూపాయ‌ల వ‌ర‌కు క్యాష్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అందుకే దీన్ని ల‌క్కీ ఫ్రైడే ఆఫ‌ర్ అంటున్నారు. వారానికి ఒకసారి మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌ను మీరు వాడుకోగ‌లుతుతారు.
ఉబెర్‌, రెడ్‌బ‌స్‌, గో ఐబిబో ఆఫ‌ర్‌
ఉబెర్‌, రెడ్‌బ‌స్‌, గోఐబిబో పేమెంట్‌కు తేజ్ యూపీఐ ఐడీని ఉప‌యోగిస్తే మీకు స్క్రాచ్ కార్డ్ వ‌స్తుంది. అయితే 150 రూపాయ‌ల‌కంటే ఎక్కువ అమౌంట్‌తో మూడు ట్రాన్సాక్ష‌న్లు చేస్తేనే  ఈ స్క్రాచ్ కార్డ్ ఇస్తారు. దీని ద్వారా మీరు 50 రూపాయ‌ల నుంచి 500 రూపాయ‌ల వ‌ర‌కు మ‌నీ పొంద‌వ‌చ్చు.
పీవీఆర్‌లో పే చేయండి..200 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొందండి
పీవీఆర్‌లో మినిమం 300 రూపాయ‌ల ట్రాన్సాక్ష‌న్‌ను తేజ్ ద్వారా చేస్తే స్క్రాచ్ కార్డ్ వ‌స్తుంది. దీన్ని స్క్రాచ్ చేస్తే 75 రూపాయ‌ల నుంచి 200 రూపాయ‌ల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్ ఒక్క‌సారి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.
తేజ్ యాప్‌ను మ‌ర్చంట్ సైట్స్‌లో వాడ‌డం ఎలా? 
ఆన్‌లైన్ మ‌ర్చంట్‌ సైట్లు, ఈ కామ‌ర్స్ సైట్ల‌లో కూడా తేజ్ యాప్‌ను వాడొచ్చు. ఆ సైట్ లేదా యాప్‌ పేమెంట్ పేజీలో మీ తేజ్ యూపీఐ ఐడీని ఎంట‌ర్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు మీ తేజ్ యాప్ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేయొచ్చు.

జన రంజకమైన వార్తలు