• తాజా వార్తలు
  •  

గూగుల్ తేజ్ యాప్‌తో మ్యాగ్జిమం లాభం పొంద‌డానికి టిప్స్ & ట్రిక్స్

పేమెంట్ యాప్ గూగుల్ తేజ్ వ‌చ్చీ రాగానే యూజర్ల‌కు బోల్డ‌న్ని ఆఫ‌ర్లు తెచ్చింది. యూపీఐలు, వాలెట్లు అవ‌స‌రం లేకుండా నేరుగా యూజ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లోనే మ‌నీ వేయ‌గ‌లిగే సౌక‌ర్యం దీని సొంతం. అంతేకాదు తేజ్‌లో చాలా ఆఫ‌ర్లు ఉన్నాయి. వాటి ద్వారా మ్యాగ్జిమం లాభం పొంద‌డం ఎలాగో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.
సైన్ అప్ అండ్ రిఫ‌ర‌ల్ ఆఫ‌ర్‌
గూగుల్ తేజ్  యాప్‌ను ఎవ‌రైనా మీకు రిఫ‌ర‌ల్ లింక్ ద్వారా పంపితే మీరు దాన్ని క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క‌నీసం ఒక్క రూపాయి ట్రాన్సాక్ష‌న్‌చేసినా  51 రూపాయ‌ల బోన‌స్ అందిస్తుంది. 
తేజ్ యాప్‌- ఎస్‌బీఐ యూపీఐ ఆఫ‌ర్‌
తేజ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ ఫ‌స్ట్ ట్రాన్సాక్ష‌న్ SBI upi ద్వారా చేస్తే 75 రూపాయ‌ల రివార్డ్ పాయింట్స్ వస్తాయి.  ఎస్‌బీఐ యూజ‌ర్లంద‌రికీ ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.  అయితే ట్రాన్సాక్ష‌న్ యూపీఐ మోడ్‌లోనే చేయాలి. ట్రాన్సాక్ష‌న్ పూర్త‌యిన మూడు రోజుల్లోనే మీకు 75 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. యూజ‌ర్ ఒక్క‌సారి మాత్ర‌మే దీన్ని వాడుకోగ‌లుగుతారు.
1000 రుపీస్ వ‌యా స్క్రాచ్ అండ్ విన్ ఆఫ‌ర్‌
1. తేజ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 
2. మీ లాంగ్వేజ్‌ను ప్రిఫ‌ర్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక‌యి ఉన్న రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయండి. 
3. మీ నెంబ‌ర్‌తో వెరిఫైచేయ‌గానే, అది మీ గూగుల్ అకౌంట్‌కు రీ డైరెక్ట్ అవుతుంది. అక్క‌డ మీరు సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి.
4. రూపీ ఐకాన్ మీద క్లిక్ చేయండి.. ఇది మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయ‌మ‌ని లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్‌లో నుంచి మీ బ్యాంక్‌ను సెలెక్ట్ చేసుకుని, అకౌంట్స్ డిటెయిల్స్ ఎంట‌ర్ చేసి, యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లోని చివ‌రి 6అంకెల‌ను ఎంట‌ర్ చేయాలి. 
5.మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేశాక క‌నీసం 150 రూపాయ‌ల‌కంటే ఎక్కువ అమౌంట్‌ను తేజ్ యూజ‌ర్ ఎవ‌రికైనా సెండ్ చేయొచ్చు. 
6. వెంట‌నే మీకు ఒక స్క్రాచ్ కార్డు ల‌భిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే 1000 రూపాయ‌ల వ‌ర‌కు ఎంత అమౌంటైనా మీకు క్యాష్ బ్యాక్ గా లభిస్తుంది.  ఇలా ఎన్ని సార్లు మనీ సెండ్ చేస్తే అన్ని స్క్రాచ్ కార్డులు లభిస్తాయి.
7. ఒక వారంలో మ్యాగ్జిమం 5 స్క్రాచ్ కార్డుల వరకు పొందవచ్చు.
తేజ్ పే రెంట్ ఆఫ‌ర్‌
ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. ఆల్రెడీ ఫిబ్ర‌వ‌రి అయిపోయింది కాబ‌ట్టి ఈ నెల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.మీ రెంట్ పే చేయ‌డం ద్వారా కూడా ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు క్యాష్ బ్యాక్‌, 5వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే స్క్రాచ్ కార్డు పొందవ‌చ్చు.
* 5వేలు, అంత‌కంటే ఎక్కువ రెంట్‌ను ఏ యూపీఐ ఐడీ లేదా అకౌంట్ నెంబ‌ర్‌కు గూగుల్ తేజ్ ద్వారా పే చేయాలి. పేమెంట్ డిస్క్రిప్ష‌న్‌లో #rentwithtez అని టైప్ చేసి పంపాలి.
* ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల రెంట్ కూడా ఇలా తేజ్ యాప్ ద్వారా పే చేస్తే మీరు 100 క్యాష్‌బ్యాక్ (ల‌క్ష రూపాయల వ‌ర‌కు) పొంద‌వ‌చ్చు.
* అంతేకాదు మీరు రెంట్‌ను ఈ యాప్ ద్వారా పే చేస్తే మీకు స్క్రాచ్ కార్డు వ‌స్తుంది. దీనితో మీకు 5వేల రూపాయ‌ల వ‌ర‌కు ఎంత అమౌంట‌యినా మీ అకౌంట్‌లో జ‌మ‌వుతుంది.
* అయితే త‌మిళ‌నాడు త‌ప్ప ఇండియాలో ఏ తేజ్ యాప్ యూజ‌ర్ అయినా దీన్ని వాడుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు