• తాజా వార్తలు
  •  

నెక్స్ట్ ఫ్లాష్ సేల్‌లో రెడ్‌మీ 5ఏ 3799 /- కే కొనడానికి సూప‌ర్ ట్రిక్ మీకోసం

చైనా మొబైల్ దిగ్గ‌జం షియోమి ఇప్పుడు ఇండియ‌న్ మార్కెట్‌లో టాప్ సెల్ల‌ర్‌. ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా త‌న ఫోన్ల‌ను అమ్మే షియోమి వాటిని కొత్త‌గా లాంచ్ అయిన‌ప్పుడు ఫ్లాష్ సేల్‌లో పెడుతుంది. బాగా పాపుల‌రయిన మోడ‌ల్స్ అయితే ఫోన్ వ‌చ్చి ఆరు నెల‌లు దాటినా కూడా ఫ్లాష్ సేల్‌లో మాత్ర‌మే దొరుకుతాయి.  బేసిక్ స్మార్ట్‌ఫోన్ ప్రైస్‌కే సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో తీసుకొచ్చిన రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్ కూడా ఇలాగే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్ ధ‌ర 6999 రూపాయ‌లు. ఫ‌స్ట్ 50ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌కు 4999 రూపాయ‌ల‌కే ఇస్తుంది. అయితే దీన్ని ఫ్లాష్‌సేల్‌లో 3799 రూపాయ‌ల‌కే కొనుక్కోవ‌చ్చు.(అంటే జియో ఫోన్ రీఛార్జ్‌తో 1200 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ కూప‌న్లు,యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొంటే 200 రూపాయ‌ల క్యాష్‌బ్యాక్ వ‌స్తాయి). అయితే ఫ్లాష్ సేల్‌లో ఎంఐ ఫోన్ కొన‌డం అంత ఈజీకాదు. నిన్న రెడ్‌మీ నోట్‌5, షియోమి స్మార్ట్‌టీవీల‌కు ఫ్లాష్ సేల్ పెడితే ప‌ట్టుమ‌ని 5 నిముషాలు కూడా కాకముందే అన్నీ అమ్ముడైపోయాయి. అందుకే ఈసారి రెడ్‌మీ 5ఏను ఫ్లాష్‌సేల్‌లో కొనుక్కోవ‌డానికి సూప‌ర్ స్క్రిప్ట్‌ ట్రిక్ మీ కోసం..
స్క్రిప్ట్ కోడ్‌తో..
1. ఫ్లిప్‌కార్ట్ రెడ్‌మీ 5ఏ ఫ్లాష్ సేల్ పేజీలోకి వెళ్లి లాగిన్ అవ్వండి.
2.సేల్ ప్రారంభ‌మ‌వ‌డానికి 5 నిముషాల ముందు రిఫ్రెష్ కొట్టండి
3.మౌస్‌లో రైట్ బ‌ట‌న్ నొక్కి Inspect Element >> Console Option సెలెక్ట్ చేయండి.
4.setInterval(function(){ var d = new Date(); var eta = 1454999400000-d.getTime(); console.log(eta/1000); if(eta<0){ $(‘.sale-btn’).trigger(‘click’); } },10); అనే కోడ్ వ‌స్తుంది. దాన్ని కాపీ చేసి సైట్‌లో పేస్ట్ చేసి, ఎంట‌ర్ కొట్టండి.
5. ఇప్పుడు ఆ ట్యాబ్‌ను వ‌దిలేయండి. ఇది మిల్లీ సెక‌న్స్‌కోసారి ఆటోమేటిగ్గా రిఫ్రెష్ అవుతుంది. 
త‌ర్వాత ఏం చేయాలంటే..
1. నెక్స్ట్ ఫ్లాష్ సేల్ డేట్ అనౌన్స్‌చేసిన త‌ర్వాత ఆ రోజు సేల్‌కు 15 నిముషాల ముందే  ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేయండి. మొబైల్ ఫోన్ పేజీలోకి వెళ్లండి. 
2.రిజిస్ట‌ర్ చేసి లాంగిన్ అవ్వండి
3.మీకుకావాల్సిన రెడ్‌మీ 5ఏ క‌ల‌ర్, మోడ‌ల్ సెలెక్ట్ చేసి 12 పీఎం టైం ఫిక్స్ చేశాక వెంట‌నే Buy now బ‌ట‌న్ నొక్కండి.
4. సేల్ స్టార్ట‌వ‌గానే ఫోన్ మీ షాపింగ్ కార్ట్‌లోకి యాడ్ అవుతుంది.
5. వెంట‌నే (మ్యాగ్జిమం 15 నిముషాల్లో) Checkout చేసి పేమెంట్ చేసేయండి.
దీనికి మీకు బ్రాడ్‌బ్యాండ్‌, మంచి స్పీడ్ ఉన్న సిస్టం కావాలి.

జన రంజకమైన వార్తలు